న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ అనంతరం బాక్సింగ్‌కు వీడ్కోలు చెప్పనున్నట్లు ప్రకటించింది. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ విషయం వెల్లడించింది. ‘టోక్యో ఒలింపిక్స్ తర్వాత రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం ఆ మెగా టోర్నీలో భారత్‌కు పసిడి పతకం అందించడమే’అని ఆమె పేర్కొంది. కాగా, 36 ఏళ్ల మేరీకోమ్ తన 18 ఏళ్ల బాక్సింగ్‌లో భారత్‌కు ఎన్నో పతకాలు తెచ్చిపెట్టింది. ఆరురుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి వరల్డ్ రికార్డు సృష్టించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీ ఖాతాలో ఐదు ఆసియా చాంపియన్‌షిప్‌లు సైతం ఉన్నాయి. ప్రస్తుతం మేరీ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment