మేరీకోమ్‌కు అరుదైన గౌరవం | Mary Kom Named In IOC's Olympics Athlete Ambassadors | Sakshi
Sakshi News home page

మేరీకోమ్‌కు అరుదైన గౌరవం

Published Thu, Oct 31 2019 6:56 PM | Last Updated on Thu, Oct 31 2019 6:56 PM

Mary Kom Named In IOC's Olympics Athlete Ambassadors - Sakshi

టోక్యో: వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్నఒలింపిక్స్‌లో భాగంగా భారత మహిళా స్టార్‌ బాక్సర్‌, ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ మేరీకోమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి 10 మంది అంబాసిడర్లలో మేరీకోమ్‌కు చోటు దక్కింది. మహిళల అథ్లెట్ల విభాగంలో ఆసియా నుంచి మేరీకోమ్‌ అంబాసిడర్‌గా నియమించబడ్డారు. ఇటీవల వరల్డ్‌చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన బాక్సర్‌గా రికార్డు సాధించిన మేరీకోమ్‌.. ఐదుసార్లు ఆసియా చాంపియన్‌షిప్‌ను గెలిచారు. తన 51 కేజీల కేటగిరిలో కామన్వెల్త్‌ గోల్డ్‌తోపాటు ఆసియా గేమ్స్‌ పసిడి పతకాన్ని కూడా సాధించారు.  దాంతో మేరీకోమ్‌ను ఆసియా నుంచి మహిళల అథ్లెట్ల విభాగంలో అంబాసిడర్‌గా నియమిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ(ఐఓసీ) నిర్ణయం తీసుకుంది.

టోక్యో ఒలింపిక్స్‌ అంబాసిడర్ల గ్రూప్‌

పురుషుల విభాగం: లుక్మో లావల్‌(ఆఫ్రికా), జులియో సీజర్‌ లా క్రూజ్‌(అమెరికా), జియాన్‌గుయాన్‌ ఆసియాహు(ఆసియా), వాస్లీ లామాచెన్‌కో(యూరప్‌), డేవిడ్‌ యికా(ఒసినియా)

మహిళల విభాగం: ఖదిజా మార్ది(ఆఫ్రికా), మికియెలా మేయర్‌(అమెరికా), మేరీకోమ్‌(ఆసియా), సారా ఓరామౌన్‌(యూరప్‌), షెల్లీ వాట్స్‌(ఒసినియా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement