ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణపతక విజేత? | The winner of the first gold medal in the Asian Games? | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణపతక విజేత?

Published Tue, Sep 23 2014 2:02 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

The winner of the first gold medal in the Asian Games?

 1.    సార్‌‌క దేశాల అంతర్గత, హోంశాఖ మంత్రుల సమావేశాన్ని 2014 సెప్టెంబర్ 19న ఎక్కడ నిర్వహించారు?
     ఎ) న్యూఢిల్లీ     బి) ఢాకా
     సి) ఖాట్మాండు     డి) కొలంబో
 2.    కేంద్ర ఎన్నికల సంఘం తరఫున ప్రచార కర్త కాని వ్యక్తి?
     ఎ) మహేంద్రసింగ్ ధోని
     బి) సైనా నెహ్వాల్
     సి) మేరీ కోమ్    డి) దీపికా కుమారి
 3.    2014 సెప్టెంబర్‌లో బీహార్‌లో నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు ప్రారంభిం చారు?
     ఎ) నరేంద్రమోడి     బి) రాజ్‌నాథ్ సింగ్
     సి) సుష్మాస్వరాజ్    డి) ప్రణబ్ ముఖర్జీ
 4.    17వ ఆసియాక్రీడల ప్రారంభోత్సవంలో భారత పతాక ధారి ఎవరు?
     ఎ) అభినవ్ బింద్రా
     బి) యోగేశ్వర్ దత్
     సి) సుశీల్ కుమార్
     డి) సర్దార్ సింగ్
 5.    2014 సెప్టెంబర్‌లో జరిగిన జీ20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశానికి భారతదేశం తరఫున ఎవరు హాజరయ్యారు?
     ఎ) అరుణ్ జైట్లీ
     బి) నిర్మలా సీతారామన్
     సి) సుష్మాస్వరాజ్
     డి) రవిశంకర్ ప్రసాద్
 6.    2014 మార్చిలో దేవధర్ ట్రోఫీ క్రికెట్‌ను కైవసం చేసుకున్న జట్టు?
     ఎ) నార్‌‌త జోన్     బి) సౌత్ జోన్
     సి) వెస్ట్ జోన్     డి) ఈస్ట్ జోన్
 7.    గ్రూప్ ఆఫ్ ఎయిట్ (జీ 8) కూటమి నుంచి ఇటీవల ఏ దేశాన్ని సస్పెండ్ చేశారు?
     ఎ) జపాన్     బి) ఫ్రాన్‌‌స
     సి) ఇటలీ     డి) రష్యా
 8.    డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది?
     ఎ) వాలీబాల్     బి) ఫుట్‌బాల్
     సి) టెన్నిస్     డి) బ్యాడ్మింటన్
 9.    అయిదో టీ 20 ప్రపంచకప్ క్రికెట్‌కు 2014లో ఆతిథ్యమిచ్చిన దేశం?
     ఎ) శ్రీలంక     బి) వెస్టిండీస్
     సి) ఇంగ్లండ్     డి) బంగ్లాదేశ్
 10.    ఈ- కామర్‌‌స దిగ్గజం అలీబాబా గ్రూప్ ఏ దేశానికి చెందింది?
     ఎ) సౌదీ అరేబియా
     బి) చైనా    సి) భారత్
      డి) ఫ్రాన్‌‌స
 11.    ఏ దేశం నుంచి విడిపోయి క్రిమియా 2014 మార్చి 18న రష్యాలో అంతర్భాగమైంది?
     ఎ) లాత్వియా     బి) జార్జియా
     సి) ఉక్రెయిన్     డి) కజక్‌స్థాన్
 12.    రష్యాలో అంతర్భాగమైన క్రిమియా రాజధాని?    
     ఎ) యాల్టా     బి) సింఫెరోపోల్
     సి) ఫెడోసియా     డి) కెర్‌‌చ
 13.    16వ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏ బాలీవుడ్ నటుడిని ప్రచాకర్తగా నియ మించింది?
     ఎ) షారుక్ ఖాన్     బి) అమితాబ్ బచ్చన్
     సి) అమీర్ ఖాన్     డి) సల్మాన్ ఖాన్
 14.    2014 విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది?    
     ఎ) కర్ణాటక     బి) రైల్వేస్
     సి) తమిళనాడు     డి) మహారాష్ర్ట
 15.    2014 సంవత్సరానికిగాను ప్రిట్జ్‌కర్ ఆర్కి టెక్చర్ ప్రైజ్ షిగెరు బాన్‌కు లభించింది. ఆయన ఏ దేశస్థుడు?
     ఎ) దక్షిణ కొరియా
     బి) చైనా     సి) జపాన్
      డి) ఉత్తర కొరియా
 16.    కాన్పూర్‌లోని ఇండియన్ ఆర్డినెన్‌‌స ఫ్యాక్టరీ మహిళల రక్షణ కోసం రూపొందించిన తేలిక పాటి రివాల్వర్ పేరు?
     ఎ) నిర్భయ్     బి) నిర్భీక్
     సి) ప్రగతి     డి) అభయ్
 17.    పార్లమెంట్‌తో తొలగింపునకు గురైన అలీ జైదాన్ ఏ దేశ ప్రధాని?
     ఎ) ఇరాన్     బి) ఇరాక్
     సి) అల్జీరియా     డి) లిబియా
 18.    మ్యాంగిఫెరా ఇండియా దేని శాస్త్రీయ నామం?
     ఎ) అరటి     బి) ఆపిల్
     సి) మామిడి     డి) జామ
 19.    స్వతంత్ర భారతదేశంలో గవర్నర్‌గా పని చేసిన తొలి మహిళ ఎవరు?
     ఎ) శారదా ముఖర్జీ
     బి) సరోజినీ నాయుడు
     సి) విజయలక్ష్మీ పండిట్
     డి) కుముద్‌బెన్ జోషి
 20.    1978 నుంచి ఏటా ప్రపంచ అభివృద్ధి రిపోర్‌‌టను ఏ సంస్థ ప్రచురిస్తోంది?
     ఎ) ప్రపంచ వాణిజ్య సంస్థ
     బి) ప్రపంచ బ్యాంక్
     సి) అంతర్జాతీయ ద్రవ్యనిధి
     డి) ఐక్యరాజ్యసమితి
 21.    భారతీయ రిజర్‌‌వబ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
     ఎ) కోల్‌కతా     బి) ఢిల్లీ
     సి) ముంబై    డి) హైదరాబాద్
 22.    86వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘12 ఇయర్‌‌స ఎ స్లేవ్’ ఎంపికైంది. ఈ చిత్ర దర్శకుడు?
     ఎ) స్టీవ్ మెక్‌క్వీన్     బి) అలెగ్జాండర్ పేన్
     సి) డేవిడ్ రసెల్     డి) మార్టిన్ స్కోర్‌‌స
 23.    గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్‌‌స అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
     ఎ) అనిత్ దేశాయ్    బి) అరుంధతీ రాయ్
     సి) కిరణ్ దేశాయ్     డి) శోభా డే
 24.    రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది?
     ఎ) అర్‌బీఐ గవర్నర్
     బి) ఆర్థిక మంత్రి    
     సి) ఆర్థిక శాఖ కార్యదర్శి
     డి) ఆర్థిక సేవల కార్యదర్శి
 25.    కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ (సీఎఫ్‌టీఆర్‌ఐ) ఎక్కడ ఉంది?
     ఎ) హైదరాబాద్     బి) మైసూరు
     సి) చెన్నై    డి) నాగ్‌పూర్
 26.    మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం?
     ఎ) 1919    బి) 1920
     సి) 1917    డి) 1915
 27.    ప్రత్యేక గారోలాండ్ రాష్ర్ట డిమాండ్‌ను 2014 మార్చి 18న ఏ రాష్ర్ట అసెంబ్లీ తిరస్కరించింది?
     ఎ) మేఘాలయ     బి) త్రిపుర
     సి) మణిపూర్     డి) పశ్చిమ బెంగాల్
 28.    2014 ఏప్రిల్ 1న మాన్యుయెల్ వాల్స్ ఏ దేశానికి ప్రధానిగా నియమితులయ్యారు?
     ఎ) ఫ్రాన్‌‌స    బి) జర్మనీ
     సి) ఆస్ట్రియా     డి) ఇటలీ
 29.    2014 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఛాంపి యన్‌గా ఎవరు నిలిచారు?
     ఎ) షిజియాన్ వాంగ్
     బి) లీజురాయ్    సి) సైనా నెహ్వాల్
     డి) వాంగ్ ఇహాన్
 30.    2014 ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ సోపోట్ నగరంలో జరిగాయి. సోపోట్ ఏ దేశంలో ఉంది?
     ఎ) జమైకా     బి) పోలండ్
     సి) రష్యా     డి) ఫ్రాన్‌‌స
 31.    ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
     ఎ) వాషింగ్‌టన్     బి) రోమ్
     సి) న్యూయార్‌‌క    డి) జెనీవా
 32.    86వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికైన అల్ఫోన్సో క్యూరోన్ ఏ దేశానికి చెందినవాడు?
     ఎ) ఇటలీ     బి) స్పెయిన్
     సి) మెక్సికో     డి) యూఎస్‌ఏ
 33.    భారత్ ట్వంటీ20 ప్రపంచ కప్ క్రికెట్‌ను ఏ సంవత్సరంలో గెలుచుకుంది?
     ఎ) 2009    బి) 2007
     సి) 2010    డి) 2012
 34.    పెన్సిలిన్‌ను వేటి నుంచి తయారుచేస్తారు?
     ఎ) బ్యాక్టీరియా     బి) వైరస్
     సి) శైవలాలు     డి) శిలీంద్రాలు
 35.    మారియా ఇసాబెల్ అలెండీ ఏ దేశ సెనేట్‌కు ప్రెసిడెంట్‌గా ఎంపికైన తొలి మహిళ?
     ఎ) అర్జెంటీనా     బి) మెక్సికో
     సి) చిలీ     డి) బొలీవియా
 36.    17వ ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణపతకం సాధించిన షూటర్?
     ఎ) అభినవ్ బింద్రా
     బి) జీతురాయ్    సి) గగన్ నారంగ్
     డి) రంజన్ సోధి
 37.    2014 లారెస్ క్రీడా పురస్కారాల్లో వరల్డ్ స్పోర్‌‌ట్సమన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
     ఎ) సెబాస్టియన్ వెటెల్
     బి) రఫెల్ నాదల్
     సి) ఉసేన్ బోల్ట్     డి) రోజర్ ఫెదరర్
 38.    2014 మార్చిలో లక్నోలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జాతీయ పురుషుల హాకీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న జట్టు?
     ఎ) ఎయిర్ ఇండియా
     బి) ఉత్తర ప్రదేశ్    సి) రైల్వేస్
     డి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
 39.    ద సన్‌సెట్ క్లబ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
     ఎ) ముల్క్‌రాజ్ ఆనంద్
     బి) కుల్‌దీప్ నయ్యర్
     సి) కుష్వంత్ సింగ్
     డి) ఆర్. కె. నారాయణ్
 40.    ఖజురహో దేవాలయాన్ని ఎవరు
     నిర్మించారు?
     ఎ) చోళులు     బి) కాకతీయులు
     సి) చందేలులు     డి) రాష్ర్టకూటులు
 సమాధానాలు
     1) సి    2) డి    3) సి    4) డి
     5) బి    6) సి    7) డి    8) సి
     9) డి    10) బి    11) సి    12) బి
     13) సి    14) ఎ    15) సి    16) బి
     17) డి    18) సి    19) బి    20) బి
     21) సి    22) ఎ    23) బి    24) సి
     25) బి    26) డి    27) ఎ    28) ఎ
     29) ఎ    30) బి    31) డి    32) సి
     33) బి    34) డి    35) సి    36) బి
     37) ఎ    38) ఎ    39) సి    40) సి  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement