
రియో ఒలింపిక్స్ తర్వాత రిటైర్: మేరీకోమ్
గువాహటి: వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్ తర్వాత తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని బాక్సర్ మేరీ కోమ్ తెలిపింది. ‘ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ రియో ఒలింపిక్స్ అనంతరం బాక్సింగ్‌లో కొనసాగకపోవచ్చు. రిటైర్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ప్రస్తుతానికైతే భారత్‌కు మరిన్ని పతకాలు అందించాలనే ఉద్దేశంతో కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ఏడాది కొన్ని అంతర్జాతీయ ఇన్విటేషన్ టోర్నీలు ఆడతాను. ఈశాన్య రాష్ట్రాల్లో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లున్నా పతకాలు సాధించలేకపోతున్నారు. ఇందుకోసం నా శాయశక్తులా సహకారం అందిస్తా’ అని మేరీ కోమ్ తెలిపింది.