'మేరి కోమ్'కు భారీ కలెక్షన్లు!
'మేరి కోమ్'కు భారీ కలెక్షన్లు!
Published Mon, Sep 8 2014 3:01 PM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
న్యూఢిల్లీ: బాక్సింగ్ ఛాంపియన్ ఎంసీ మేరి కోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం కలెక్షన్ల వర్షం కరుపిస్తోంది. మేరి కోమ్ చిత్రం తొలివారాంతానికి (3 రోజులు) 28.32 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సెప్టెంబర్ 5 తేది శుక్రవారం 8.02 కోట్లు, శనివారం 9.25 కోట్లు, ఆదివారం 11.05 కోట్లు రూపాయలను మేరి కోమ్ చిత్రం రాబట్టింది. ఈ చిత్రానికి వస్తున్న స్పందనపై ప్రియాంక చోప్రా ట్విటర్ లో ఆనందం వ్యక్తం చేసింది.
'మేరి కోమ్' చిత్రం ద్వారా ఒమంగ్ కుమార్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రియాంక నటన, కథ, కథనాలు విమర్శకులను ఆకట్టుకుంటున్నాయని చిత్రానికి సంబంధించిన వారు వెల్లడించారు. ఈ చిత్రం 1800 థియేటర్లలో విడులైంది.
Advertisement
Advertisement