న్యూఢిల్లీ:భారత మహిళా బాక్సింగ్పై స్టార్ బాక్సర్ మేరీకోమ్ ఆందోళన వ్యక్తం చేసింది. రాబోవు తరంలో భారత్ నుంచి సాధ్యమైనంత మహిళా బాక్సర్లు ప్రాతినిధ్యం వహిస్తారనే విషయం కచ్చితంగా చెప్పలేమని పేర్కొంది.
'భారత్లో బాక్సింగ్ పోటీలు ఎక్కువగా జరగడం లేదు. జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. దాదాపు రెండు-మూడు సంవత్సరాల నుంచి చూస్తే భారత్లో జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీనే జరగలేదు. ఇలా అయితే అంతర్జాతీయ పాల్గొనే భారత మహిళా బాక్సర్లు ఎక్కడ్నుంచి వస్తారు. ఇక ఏ మహిళా బాక్సర్ను అంతర్జాతీయ స్థాయిలో చూస్తానని నేను అనుకోవడం లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి దేశ మహిళా బాక్సింగ్ బాగా మెరుగుపడింది. దాన్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. యువ బాక్సర్లకు శిక్షణ ఇస్తేనే భవిష్యత్ బాక్సర్లు ఉంటారు'అని ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్ తెలిపింది.