
చిత్తూరులో సీపీ ఫుడ్స్ చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్
బ్రాండ్ అంబాసిడర్‌గా మేరీ కోమ్
బెంగళూరు: భారత్‌లో ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ బిజినెస్‌లో ప్రవేశిస్తున్నామని థాయ్‌లాండ్‌కు చెందిన ఆగ్రో-ఇండస్ట్రియల్ దిగ్గజం చరొయిన్ పోక్‌ఫాండ్ ఫుడ్స్ పబ్లిక్ కంపెనీ లిమిటెడ్(సీపీ ఫుడ్స్) తెలిపింది. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో కొత్త చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. బెంగళూరు, చెన్నై వంటి రెండు పట్టణాల మధ్య ఉన్నందున చిత్తూరులో చికెన ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని సీపీ ఫుడ్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ పంత్ తెలిపారు. ఈ ప్లాంట్ కోసం 1.8 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశామని తెలిపారు. సీపీ ఫ్రొజెన్ చికెన్, సీపీ చిల్డ్ చికెన్, సీపీ ఈజీ స్నాక్స్(వెజ్ అండ్ నాన్ వెజ్), సీపీ ఎగ్స్ వంటి బ్రాండెడ్ ఉత్పత్తులను త్వరలో అందుబాటులోకి తెస్తామని సంజీవ్ వివరించారు. తమ బ్రాండ్ అంబాసిడర్‌గా మహిళ బాక్సర్ మేరీ కోమ్ వ్యవహరిస్తారని వివరించారు.