
గువాహటి: ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల 51 కేజీల విభాగంలో ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5–0తో భారత్‌కే చెందిన అనామికపై విజయం సాధించింది. సెమీఫైనల్లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌తో నిఖత్ తలపడనుంది.
మరో క్వార్టర్ ఫైనల్లో మేరీకోమ్ 5–0తో మాలా రాయ్ (నేపాల్)పై గెలుపొందింది. సరితా దేవి (60 కేజీలు), అంకుశిత బోరో (64 కేజీలు), మంజు రాణి (48 కేజీలు) కూడా సెమీఫైనల్‌కు చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సరిత 5–0తో ప్రీతి బెనివాల్ (భారత్)పై, అంకుశిత 4–1తో లలిత (భారత్)పై, క్లియో తెసారా (ఫిలి
Comments
Please login to add a commentAdd a comment