International boxing
-
నిఖత్ జరీన్‌కు పతకం ఖాయం
గువాహటి: ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల 51 కేజీల విభాగంలో ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5–0తో భారత్‌కే చెందిన అనామికపై విజయం సాధించింది. సెమీఫైనల్లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌తో నిఖత్ తలపడనుంది. మరో క్వార్టర్ ఫైనల్లో మేరీకోమ్ 5–0తో మాలా రాయ్ (నేపాల్)పై గెలుపొందింది. సరితా దేవి (60 కేజీలు), అంకుశిత బోరో (64 కేజీలు), మంజు రాణి (48 కేజీలు) కూడా సెమీఫైనల్‌కు చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సరిత 5–0తో ప్రీతి బెనివాల్ (భారత్)పై, అంకుశిత 4–1తో లలిత (భారత్)పై, క్లియో తెసారా (ఫిలి -
వివక్షపై మారతమ్మ పంచ్
విశాఖపట్నం, పెందుర్తి : కొందరు జీవితాలను తెరిచి చూస్తే ఎంతో స్ఫూర్తి కలిగిస్తుంటాయి. కష్టాలకు..కన్నీళ్లకు బెదిరిపోకుండా..కరిగిపోకుండా ముందుకు వెళ్లే వారి ధైర్యం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయి. రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఇద్దరు ఆడపిల్లల భారాన్ని మోయలేక వెళ్లిపోయాడు. మరి ఆ కన్నతల్లి అలా అనుకోలేదు. పేగుతెంచుకున్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు కష్టాలెన్ని వచ్చినా ఎదుర్కొంది. ఉగ్గుపాలల్లో ధైర్యం నింపి పట్టిందేమో గానీ రెండో కుమార్తె తల్లి కల నెరవేర్చేలా ఎదిగింది. ఓ నిరుపేద కుటుంబం..రెక్కాడితేగాని డొక్కాడని వైనం..అప్పటికే ఓ కూతురు..రెండోకాన్పులో కొడుకే పుడతాడని ఆమె భర్త గట్టిగా నమ్మాడు..కానీ మరోసారి ఆడబిడ్డే..తప్పు భార్యదే అన్నట్టు ఇళ్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడా మగాడు..ఇద్దరు ఆడపిల్లలతో పూటగడవడం కూడా కష్టమైన దుస్థితి ఆ తల్లిది..ఏదోలా ఓ అపార్ట్‌మెంట్‌కు వాచ్‌ఉమెన్‌గా ఆ తల్లికి ఉపాధిమార్గం దొరికింది..కిష్టపరిస్థితిలో సంసారజీవీతాన్ని భారంగా ఈడుస్తూ ఆ తల్లి పడుతున్న కష్టం కళ్లారా చూస్తూ పెరిగింది ఆ రెండో బిడ్డ..ఈ క్రమంలో పురుషుల క్రీడగా పేరొందిన కఠినమైన బాక్సింగ్ వైపు మళ్లింది ఆ చిన్నారి మనసు..తాను కుటుంబం పరంగా గడిపిన అత్యంత కఠినమైన రోజులతో పాటు బాక్సింగ్‌లో ప్రత్యర్థి నుంచి ఎదురైన కఠోర పంచ్‌లు ఆమెను మరింత రాటుదేల్చాయి..నాడు ఆడపిల్ల అని తండ్రి చేత ఛీదరించుకున్న ఆ బిడ్డే నేడు అంతర్జాతీయస్థాయిలో మెరుస్తూ ‘సబల’గా ప్రజల మన్ననలు అందుకుంటుంది. పెందుర్తికి చెందిన సతివాడ మారతమ్మ ప్రస్తుతం భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న బాక్సర్. నిరుపేద కుటుంబం జన్మించిన మారతమ్మ కఠోర శ్రమ, అకుంటిత దీక్షతో అంతర్జాతీయ వేదికపై మెరుస్తోంది. చిన్నతనం నుంచే.. మారతమ్మ తల్లి రామలక్ష్మి కాయకష్టం చేసుకుని కుటుంబాన్ని ఈదుతున్న సమయంలో మారతమ్మకు బాక్సింగ్‌పై ఆసక్తి కలిగింది. స్థానికుల సహాయంతో ప్రాక్టిస్ మొదలుపెట్టిన మారతమ్మ అనతికాలంలోనే మేటి బాక్సర్‌గా తయారైంది. అంతర్జాతీయ స్థాయిలో రెండు(ఒక రజతం, ఓ కాంస్యం) పతకాలు సాధించిన ఆమె జాతీయ స్థాయిలో మూడు బంగారు పతకాలను కొల్లగొట్టింది. అంతే కాకుండా జాతీయస్థాయిలో సీనియర్ బాక్సింగ్‌లో రెండు కాంస్యాలు గెలుచుకుంది. ఏడాదిన్నర జరిగిన జాతీయ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించింది. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించిన మారతమ్మ అంతకంటే మంచి ఉద్యోగం కోసం అన్వేషిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మారతమ్మ రానున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి పతకాలను సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. -
సరితపై ఏడాది నిషేధం
కోచ్ ఫెర్నాండెజ్‌పై రెండేళ్లు జీఎస్ సంధూకు మినహాయింపు ఏఐబీఏ నిర్ణయం న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకం స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) ఏడాదిపాటు నిషేధం విధించింది. దాంతోపాటు వెయ్యి స్విస్ ఫ్రాంక్‌ల జరిమానా వేసింది. నిషేధం 2014 అక్టోబర్ 1 నుంచి 2015 అక్టోబర్ 1 వరకు అమల్లోకి ఉంటుంది. తీవ్రమైన చర్యలు తప్పవని మొదట్లో సంకేతాలు వచ్చినా... నిషేధం తక్కువగా ఉండటంతో సరితా దేవి బాక్సింగ్ కెరీర్‌కు పెద్ద ముప్పు తప్పింది. ప్రస్తుతం మణికట్టు గాయంతో బాధపడుతున్న ఆమె ఒలింపిక్స్ అర్హత టోర్నీ అయిన 2016 మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అందుబాటులో ఉండనుంది. ‘ఏఐబీఏ నిర్ణయం నాకు ఊరటనిచ్చింది. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన బాక్సింగ్ ఇండియా, కేంద్ర క్రీడల మంత్రికి, సచిన్ టెండూల్కర్‌కు, ఇతర అధికారులకు కృతజ్ఞతలు. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. కాబట్టి దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవడానికి మరింత కష్టపడతా’ అని సరిత పేర్కొంది. ఈ సంఘటనలో జాతీయ కోచ్ గురుబక్ష్ (జీఎస్) సింగ్ సంధూ, సాగర్ మైదయాల్ల తప్పులేదని ఏఐబీఏ క్రమశిక్షణ కమిటీ తేల్చింది. అయితే భారత్‌కు పని చేస్తున్న విదేశీ కోచ్ బ్లాస్ ఇగ్లేసియాస్ ఫెర్నాండెజ్‌ను మాత్రం కఠినంగా శిక్షించింది. ఆయనపై రెండేళ్ల నిషేధంతో పాటు 2 వేల స్విస్ ఫ్రాంక్‌ల జరిమానా విధించింది. 2014 అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. సరితా వ్యక్తిగత కోచ్ లెనిన్ మిటెటీపై ఏడాది, బౌట్ సందర్భంగా అనధికారికంగా రింగ్‌లో ఉన్నందుకు బాక్సర్ భర్త తొయిబా సింగ్‌పై రెండేళ్ల సస్పెన్షన్ విధించింది. సరితపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ తాజాగా ఏఐబీఏకు లేఖ రాస్తామన్నారు.