Courtesy: PTI
దుబాయ్: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు రింగ్‌లోకి దిగకముందే ఏడు పతకాలను ఖాయం చేసుకున్నారు. దుబాయ్‌లో నేడు మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌లో కరోనా కారణంగా మహిళల విభాగంలో 10 కేటగిరీల్లో కలిపి మొత్తం 47 మంది బాక్సర్లే పాల్గొంటున్నారు.
చిన్నసైజు ‘డ్రా’ కారణంగా భారత్ నుంచి మేరీకోమ్ (51 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), అనుపమ (ప్లస్ 81 కేజీలు), సవీటి బురా (81 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), లాల్‌బుత్సహి (64 కేజీలు), మోనిక (48 కేజీలు) సెమీస్ చేరారు. కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు.
చదవండి: చైనా మారథాన్‌లో పెను విషాదం
Comments
Please login to add a commentAdd a comment