బాక్సింగ్లో మేరీకోమ్ 'పసిడి' పంచ్
ఇంచియాన్ : బాక్సర్ మేరీకోమ్ పసిడి పంచ్ విసిరింది. ఆసియా క్రీడల్లో భారత్కు మరో బంగారు పతకం లభించింది. 51 కేజీల మహిళల విభాగంలో మేరీకోమ్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్స్లో కజికిస్తాన్ బాక్సర్ జైనా షెకర్ బెకోవాపై ఆమె విజయం సాధించింది. ఇక ఆసియా క్రీడల్లో ఆమెకు ఇదే తొలి బంగారు పతకం. దాంతో ఇప్పటివరకూ భారత్కు ఏడు స్వర్ణాలు, 8 రజిత, 32 కాంస్య పతకాలతో పదో స్థానంలో నిలిచింది.