
‘మేరీ కామ్’ అదుర్స్!
భారతీయ బాక్సింగ్ చాంపియన్ మేరీ కామ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘మేరీ కామ్’లో ప్రియాంకా టైటిల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.
భారతీయ బాక్సింగ్ చాంపియన్ మేరీ కామ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘మేరీ కామ్’లో ప్రియాంకా టైటిల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అసలు సిసలైన బాక్సర్‌గా అగుపించడానికి ప్రియాంక చాలా కసరత్తులు చేశారు. శారీరకంగా ఫిట్‌గా తయారు కావడంతో పాటు, బాక్సింగ్ కూడా నేర్చుకున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ‘‘మేరీ కామ్‌గా ప్రియాంకా ఒదిగిపోయిన వైనం అద్భుతంగా ఉందని, పాత్రలో ఇంతలా పరకాయ ప్రవేశం చేయడం నమ్మశక్యంగా లేదనీ, ప్రియాంకకు అభినందనలు అని’’ ట్వీట్ చేశారు సమంత. అది మాత్రమే కాదు.. ప్రియాంకను అభినందిస్తూ తనకు వచ్చిన ట్వీట్స్ అన్నింటినీ సమంత రీట్వీట్ చేశారు.