good response
-
‘పీఎం సూర్య ఘర్’కు కోటి రిజిస్ట్రేషన్లు
న్యూఢిల్లీ: సుమారు నెల క్రితం ప్రారంభించిన రూఫ్ టాప్ సోలార్ స్కీం ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు అనూహ్య స్పందన వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ పథకం కోసం ఇప్పటికే కోటి మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం అద్భుతమంటూ శనివారం ‘ఎక్స్’లో హర్షం వ్యక్తం చేశారు. అస్సాం, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ రిజిస్ట్రేషన్లు అయ్యాయన్నారు. ఇప్పటికీ రిజస్ట్రేషన్ చేయించుకోని వారు సాధ్యమైనంత త్వరగా ఆ పని చేయాలని సూచించారు. -
విశాఖలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి విశేష స్పందన
-
ఎన్పీఎస్, ఏపీవై పథకాలకు ఆదరణ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అటల్ పెన్షన్ యోజన (ఏపీవై), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) పథకాలకు మంచి ఆదరణ లభిస్తోంది. చందాదారులు పెద్ద ఎత్తున ఈ పథకాల్లో చేరుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో (2022 మార్చి 5 నుంచి 2023 మార్చి 4 నాటికి) ఈ రెండు పథకాల కింద చందాదారుల సంఖ్య 23 శాతం పెరిగి 6.24 కోట్లుగా ఉంది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. విడిగా చూస్తే ఏపీవై చందాదారుల్లో 28 శాతం వృద్ధి ఉంది. గతేడాది మార్చి 4 నాటికి ఈ రెండు పథకాల కింద చందారుల సంఖ్య 5.20 కోట్లుగా ఉంది. ఎన్పీఎస్ చందాదారుల్లో 23.86 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు కాగా, 60.72 లక్షల మంది రాష్ట్రాల ఉద్యోగులు కావడం గమనార్హం. కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్య 16.63 లక్షలుగా ఉంది. ఏపీవై చందాదారులు 4.53 కోట్లుగా ఉన్నారు. 2015 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం ఏపీవై పథకాన్ని తీసుకొచ్చింది. ఎలాంటి సామాజిక భద్రత లేని కార్మికులకు, ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే వారికి, వృద్ధాప్యంలో పింఛను సదుపాయం కోసం దీన్ని ప్రారంభించింది. సభ్యులు నెలవారీ చెల్లించిన చందానుబట్టి 60 ఏళ్లు వచ్చిన తర్వాత నుంచి ప్రతి నెలా రూ.1,000–5,000 మధ్య పింఛను లభిస్తుంది. 2022 అక్టోబర్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు ఈ పథకంలో చేరుకుండా కేంద్రం నిషేధించింది. -
అటల్ పెన్షన్ యోజనకు విశేష ఆదరణ
న్యూఢిల్లీ: సామాజిక భద్రతా పథకం– అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)కు విశేష ఆధరణ లభిస్తున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) పేర్కొంది. ఈ పథకం కింద ఇప్పటికి 5 కోట్ల మందికిపైగా ప్రజలు నమోదయినట్లు తెలిపింది. ఒక్క 2022 క్యాలెండర్ ఇయర్లో 1.25 కోట్ల మంది చందాదారులుగా చేరినట్లు వివరించింది. 2021లో ఈ సంఖ్య 92 లక్షలు కావడం గమనార్హం. 2021 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీవైని ప్రకటించారు. దీని విస్తృతికి పీఎఫ్ఆర్డీఏ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ పథకం కింద ఒక చందాదారుడు (చేరిన వయస్సు, చందాపై ఆధారపడి) 60 సంవత్సరాల వయస్సు నుండి నెలకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు కనీస హామీ పెన్షన్‌ను అందుకుంటాడు. చందాదారుని మరణానంతరం అదే పెన్షన్ చందాదారుని జీవిత భాగస్వామికి చెల్లించడం జరుగుతుంది. చందాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించినప్పుడు, చందాదారుడు 60 ఏళ్ల వరకు చెల్లించిన మొత్తం నామినీ పొందే వెసులుబాటు ఉంది. -
వాహన దారులకు బంపర్ ఆఫర్
-
బాప్రే.. ఒక్క నిమిషానికి 700 పెండింగ్ చలాన్లు క్లియర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్‌కు విశేష స్పందన వస్తోంది. నిమిషానికి 700 పెండింగ్ చలాన్లను అధికారులు క్లియర్ చేస్తున్నారు. బైక్‌లు, ఆటోలకు 75 శాతం, కారు, లారీ, హెవీ వెహికిల్స్‌కు 50 శాతం రాయితీని తెలంగాణ పోలీసులు కల్పించిన విషయం తెలిసిందే. మాస్క్ చలాన్లపై 90 శాతం రాయితితో వాహనాదారు పెద్ద ఎత్తున క్లియర్ చేసుకుంటున్నారు. చలాన్ల రయితీ ఈ నెల 31 వరకు అందుబాటులో ఉండనుంది. గత నాలుగేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 6.19 కోట్ల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు ప్రత్యేక అవకాశం కల్పించిన తెలంగాణ పోలీసులు వాహనదారులకు మరో శుభవార్త చెప్పారు. చలాన్ల చెల్లింపుల కోసం గంటల తరబడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే చలానాలు చెల్లించాలని సూచించారు. ఈ-చలాన్ ద్వారా అన్ని పెండింగ్ చలాన్లు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చని సూచించారు. అటు మీ సేవ, ఈ సేవలో కూడా చలానాలు చెల్లించేలా అవకాశం కల్పించారు ట్రాఫిక్ పోలీస్‌లు. -
ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది:గురుమూర్తి
-
భలే డిమాండు.. సరఫరా కూడా మెండు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లను అధికంగా తీసుకోవాలన్న ప్రభుత్వ సూచనల నేపథ్యంలో వాటి వినియోగం పెరిగింది. లాక్డౌన్ కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఫ్రూట్ జూస్, ఐస్‌క్రీం పార్లర్లు మూతబడ్డప్పటికీ డిమాండ్ మాత్రం సాధారణ రోజుల మాదిరే ఉంటోంది. మొబైల్ వాహనాల ద్వారా ప్రజల దగ్గరకే పండ్లను చేర్చడంతో పాటు కొత్తగా ఇంటికే పండ్ల సరఫరాతో మంచి గిరాకీ ఉంటోంది. పెరిగిన లభ్యత.. మెరుగైన కొనుగోళ్లు.. రాష్ట్రంలో బత్తాయి, మామిడి, నిమ్మ, బొప్పాయి, జామ, దానిమ్మ వంటి పండ్ల తోటల సాగు 4.40 ఎకరాల్లో సాగవుతుండగా, ప్రస్తుతం బత్తాయి, మామిడి పంటల కోతలు పెరిగాయి. దీంతో వీటి లభ్యత మార్కెట్లో విపరీతంగా పెరిగింది. భారతీయ వైద్య పరిశోధనా సంస్థ (ఐసీఎంఆర్) సిఫార్సుల మేరకు ప్రతీ మనిషి రోజుకు 100 గ్రాముల పోషక విలువలు గల పండ్లను తీసుకోవాలి. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రతీ మనిషి నెలకు 3 కిలోల పండ్లు తినాల్సి ఉంది. ఈ లెక్కన 1.20లక్షల మెట్రిక్ టన్నుల మామిడి, బత్తాయి తినాల్సి ఉంటుందని అంచనా వేశారు. మన మార్కెట్లో ఏప్రిల్, మే నెలలో 70వేల టన్నుల బత్తాయి, మామిడి 5 నుంచి 6 లక్షల మేర ఉత్పత్తి ఉంటోంది. హైదరాబాద్ మార్కెట్లోకి మామిడి ప్రతి రోజూ 600 నుంచి 1000 టన్నుల మేర వస్తోంది. బత్తాయి, వాటర్‌మిలన్, దానిమ్మ, ద్రాక్ష ఇతర రకాల పండ్లు రోజుకు 22వేల క్వింటాళ్లకు మించి వస్తున్నాయి. వాటి లభ్యత పెరగడంతో వీటిని వినియోగదారులకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 280 మొబైల్ రైతు బజార్ల ద్వారా 620 ప్రాంతాల్లో అమ్మకాలు చేపట్టారు. ఇవి విజయవంతమయ్యాయి. వీటి ద్వారా రోజుకు 15వేలకు పైగా వినియోగదారులు కొనుగోళ్లు చేస్తున్నారు. ఇంటికే సరఫరాకు శ్రీకారం... దీనికి అనుబంధంగా మార్కెటింగ్ శాఖ ఇంటికే పండ్ల సరఫరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 8875351555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు, రూ.300 విలువ చేసే మామిడి (1.5కిలోలు), బొప్పాయి(3 కిలోలు), నిమ్మ (12 కాయలు), బత్తాయి (2 కిలోలు), సపోటా (కిలో) పండ్లు డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే 35వేల మంది వినియోగదారులు ఈ సౌలభ్యాన్ని వినియోగించుకున్నారని మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. రోజుకు 1,500 నుంచి 2వేల కాల్స్ వస్తున్నాయని, 78 గంటల్లో వీటిని సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. గడ్డిఅన్నారం మార్కెట్ వికేంద్రీకరణ.. ఇక గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేయగా, వికేంద్రీకరణ చేసేందుకు నిర్ణయించింది. సరుకు రవాణా వాహనాలతో ఇక్కడ భౌతిక దూరం పాటించే అవకాశాలు లేకపోవడం, మహారాష్ట్ర నుంచి ద్రాక్ష, బత్తాయి, మామిడి వాహనాల నుంచి పండ్లు దించేందుకు హమాలీలు వెనకాడటం, దీన్ని మూసివేసి ఇతర ప్రాంతాలకు తరలించాలని స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో దీన్ని బుధవారం నుంచి మూసివేశారు. ఈ మార్కెట్‌కు ప్రతిదినం 18వేల నుంచి 20వేల క్వింటాళ్ల వివిధ రకాల పండ్లు వస్తుంటాయి. ఇప్పుడు సోమవారం నుంచి మామిడి మార్కెట్‌ను కోహెడకు, బత్తాయి, సపోటా, కమలాపండ్లను ఎల్బీనగర్ సమీప విక్టోరియా హౌస్ ప్రాంతానికి, వాటర్ మిలన్, కర్భూజ పండ్లను స్థానిక రోడ్డుమీద పెట్టి అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో కొనుగోళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. -
రోజుకు 35 కాల్స్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల అమలులో రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు మంచి స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు, వివిధ ప్రాంతాల నుంచి రోజుకు 35 వరకు కాల్స్ వస్తున్నాయని, ఈ కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన వారం రోజుల్లో 252 కాల్స్ వచ్చాయని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో తమకు ఆహార పదార్థాలు కావాలని, శానిటైజర్లు కావాలని ఎక్కువగా ఫోన్లు చేస్తున్నారని కంట్రోల్ రూం సభ్యులు చెబుతున్నారు. కాగా, ఈ కంట్రోల్ రూంను టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, ప్రధాన కార్యదర్శి ఎంఆర్‌జి.వినోద్‌రెడ్డితో పాటు పలువురు నేతలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ రూం నిర్వహణపై వినోద్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రజలు తమకు చెబుతోన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని, కొన్నింటిని తామే పరిష్కరిస్తున్నామని చెప్పారు. దీనికి స్థానిక కాంగ్రెస్ నేతల సాయం తీసుకుంటున్నామని వెల్లడించారు. -
అన్ని వర్గాల అభివృద్ది కొసమే నవరత్నాల సభలు
-
నవరత్న సభలకు విశేష స్పందన
-
మేలుకొలుపునకు జన స్పందన
బుక్కరాయసముద్రం (శింగనమల) : గ్రామాల్లో çరైతులు, ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన టీడీపీ ప్రభుత్వానికి కళ్లు తెరపించడానికి వైఎస్సార్సీపీ శింగనమల నియోజక వర్గ సమన్వయ కర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్రకు గ్రామాల్లో భారీ స్పందన లభిస్తోంది. మంగళవారం ఐదో రోజు చేపట్టిన మేలుకొలుపు పాదయాత్ర బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి, వెంకటాపురం క్రాస్, చెన్నంపల్లి, నీలారెడ్డిపల్లి, కొర్రపాడు గ్రామాల్లో కొనసాగించారు. ఈపాదయాత్రలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, గుంతకల్లు నియోజక వర్గం సమన్వయకర్త వైటీ వెంకటరామిరెడ్డి, బీసీసెల్ జిల్లా అధ్యక్షులు పామిడి వీరాంజినేయులు పాల్గొన్నారు. అడుగడుతునా పద్మావతికి ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. పద్మావతి దృష్టికి సమస్యలు.. బొమ్మలాటపల్లి పల్లి నుంచి పాదయాత్ర మొదలువుతూనే ఉపాధి కూలీలు బిల్లులు రాలేదని మొరపెట్టుకున్నారు. చెన్నంపల్లిలో పింఛన్లు రాలేదని, తాగునీటి సమస్య ఉందని ప్రజలు తెలిపారు. హెచ్చెల్సీ కాలువకు నీరు వదలకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వివరించారు. అక్కడి నుంచి నీలారెడ్డిపల్లికి బయలుదేరగా, మధ్యలో నాసిరకంగా నిర్మించిన పనులు పరిశీలించారు. ఉపాధి పనులు చేసి వస్తున్న కూలీలతో మాట్లాడుతూ బిల్లులు సక్రమంగా అందడం లేదన్నారు. కూలీ రోజుకు రూ.100 మాత్రమే వస్తోందని కూలీలు ఆమెకు తెలిపారు. మిరప పంటను గొర్రెలకు వదిలేయడంతో పంటను పరిశీలించారు. భూగర్భజలం తగ్గిపోయి బోరులో నీరు రాకపోవడంతో మిరపపంటను గొర్రెలకు వదిలేశారని వివరించారు. నీలారెడ్డిపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలో రైతు పుల్లారెడ్డికి చెందిన ఎండిన అరటి తోటను పరిశీలించారు. ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా అని పద్మావతి రైతును ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని రైతు వాపోయాడు. కార్యక్రమంలో మండల ఎంపీపీ సాకే ఆదిలక్ష్మి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, సహకార సంఘం సొసైటీ మండల అధ్యక్షులు నాగలింగారెడ్డి, జిల్లా ఎస్టీసెల్ అద్యక్షులు సాకే రామకృష్ణ, వైఎస్ ఎంపీపీ వెంకటరెడ్డి, జిల్లా కమిటీ మెంబర్ రామ్మోహన్‌రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చేర్మెన్ ముసలన్న, మాజీ మండల కన్వీనర్లు సుధాకర్‌రెడ్డి, లక్ష్మిన్న, ఎంపీటీసీ మల్లయ్య, సురేష్, జిల్లా మహిళా కార్యదర్శి కొండమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మేలుకొలుపు పాదయాత్రకు భారీ స్పందన
– వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి వద్ద గ్రామీణులు సమస్యల ఏకరవు యల్లనూరు / పుట్లూరు : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికివదిలేసిన టీడీపీ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు, గ్రామీణులను జాగృతం చేసేందుకు వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన ‘మేలుకొలుపు పాదయాత్రకు గ్రామాల్లో భారీ స్పందన వస్తోంది. కార్యక్రమంలోభాగంగా ఆమె శనివారం యల్లనూరు మండలంలోని అచ్యుతాపురం, వాసాపురం, బొప్పేపల్లి, పుట్లూరు మండలంలోని కొండుగారికుంట, కొత్తపల్లి, కుమ్మనమల, చాలవేముల క్రాస్, మడ్డిపల్లి గ్రామాల్లో పాదయాత్ర సాగించారు. తాడిపత్రి సమన్వయ కర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ సమస్యలపై మండుటెండలో పాదయాత్ర చేపడుతున్న జొన్నలగడ్డ పద్మావతిని తమ ఇంటి ఆడబిడ్డలా ఆదరిస్తూ హారతులు, పసుపు కుంకుమలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. కష్టాల ఏకరువు.. యల్లనూరు మండలం బొప్పేపల్లిలో పలువురు గ్రామస్తులు పద్మావతి వద్ద తమ సమస్యలను ఏకరువు పెట్టారు. శారద అనే మహిళ మాట్లాడుతూ ఇల్లు మంజూరు చేస్తామని జన్మభూమి కమిటీ సభ్యులు రూ.2500 వసూలు చేశారని, ఇప్పటివరకూ ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామస్తులు మాట్లాడుతూ ఒకరోజు మాత్రమే రేషన్ ఇచ్చి, అయిపోయిందని చేతులెత్తేస్తున్నారని తెలిపారు. పాఠశాల పైకప్పు పడిపోయి మూడు సంవత్సరాలు అయిందని, ఎంఎల్ఏ యామినీబాల వచ్చి మూడుసార్లు పాఠశాలను పరిశీలించినా నూతన భవనాన్ని నిర్మించలేదున్నారు. కొండుగారికుంటలో తాగునీటి సమస్య ఉండగా కేవలం రెండు ట్యాంకర్ల నీరు మాత్రమే అందిస్తున్నారని మహిళలు వాపోయారు. గుంతల్లోని నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంపై మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. దీపం పథకం కింద కేవలం రూ.950లకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా రూ.1250 వసూలు చేస్తున్నారని మహిళలు వాపోయారు. బొప్పేపల్లి చెరువుకు నీరు అందించాలి.. – సుబ్బరాయసాగర్ నుంచి 29వ డ్రిస్టిబ్యూటర్ ద్వారా బొప్పేపల్లి చెరువుకు నీటిని సరఫరా చేయాలని జొన్నలగడ్డ పద్మావతి డిమాండ్ చేశారు. బొప్పేపల్లి చెరువుకు నీరు చేరితే ఓబుళాపురం, కడవకల్లు, చెర్లోపల్లి, మడ్డిపల్లి, చాలవేముల, కుమ్మనమల, రంగరాజుకుంట, కొండుగారికుంట గ్రామాల్లో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. కనీసం తాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు. కుమ్మనమల ప్రాథమికోన్నత పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యార్థుల సమస్యలను తీర్చాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మునిప్రసాద్, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ వెంకటరామిరెడ్డి, జిల్లా కార్యదర్శులు రామాంజులరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, యువజన కన్వీనర్ రామాంజులరెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ నాగేష్, ఎంపీటీసీ లక్ష్మిదేవి, సర్పంచ్‌లు రామక్రిష్ణారెడ్డి, దశ్యుంతుల, విజయభాస్కర్‌రెడ్డి, సర్వేశ్వర్‌రెడ్డి, నాయకులు రామాంజులరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
పాదయాత్రకు జననీరాజనం
దిష్టితీస్తూ, పూలమాలలతో మహిళల స్వాగతం తోటపల్లి (నెల్లిపాక) : పోలవరం నిర్వాసితుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సీపీఎం ఆద్వర్యంలో విలీన మండలాల్లో చేపట్టిన పాదయాత్రకు జనం నీరాజనాలు పడుతున్నారు. పాదయాత్రగా వస్తున్న నాయకులకు గ్రామ గ్రామానా మహిళలు గుమ్మడి కాయలతో దిష్టితీస్తూ పూలమాలలు వేసి డప్పు వాయిద్యాలతో స్వాగతం పలుకుతున్నారు. పాదయాత్ర ఐదో రోజు మంగళవారం కుసుమనపల్లి గ్రామం నుంచి తోటపల్లి మీదుగా సాగింది.గిరిజన మహిళలు అధిక సంఖ్యలో హాజరై గిరిజన సంప్రదాయ నృత్యాలతో నాయకుల్లో ఉత్సాహాన్ని నింపారు. తోటపల్లిలో జరిగిన సభలో మాజీ ఎంపీ మిడియం బాబూరావు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాడ్లాడుతూ పోలవరం నిర్వాసితులకు అండగా పోరాడేందుకే తమ పార్టీ పాదయాత్రలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు, జిల్లా కార్యదర్శి అరుణ్ కిరణ్, సర్పంచ్‌లు సుకో నాయక్, సోంది రామారావు, ఇరప చిన్నక్క, నాయకులు బీబీజీ తిలక్, మర్లపాటి నాగేశ్వరరావు, ఐ వెంకటేశ్వర్లు, మాధవరావు, శేషావతారం, రంబాల నాగేశ్వరరావు, కోడూరి నవీన్, కాక అర్జున్, ఇరప వెంకటేశ్వర్లు ,సాయి, శిరమయ్య,పెంటయ్య, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
కురుబ వధూవరుల వేదికకు విశేష స్పందన
అనంతపురం రూరల్ : జిల్లా కురుబ సంఘం ఆధ్వర్యంలో శనివారం గుత్తిరోడ్డులోని కనకదాస కళ్యాణమంటపంలో నిర్వహించిన కురుబ వధూవరుల పరిచయ వేదికకు విశేష స్పందన లభించింది. అనంతపురం, కర్నూల్, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వధూవరుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగే పరశురాం మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవనంలో వివాహ శుభకార్యాలకు వధూవరుల పరిచయ వేదికలు దోహదపడతాయన్నారు. కురుబ సంఘం నాయకులు పిడుగు క్రిష్ణమూర్తి, కర్నూల్ జిల్లా అధ్యక్షుడు పుల్లన్నగౌడు, లక్ష్మిసంజప్ప, నారాయణ, ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఇస్కాన్ పరీక్షలకు స్పందన
అనంతపురం కల్చరల్ : ఇస్కాన్ మందిరం స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన రాష్ట్ర స్థాయి పరీక్షలకు అనూహ్య స్పందన లభించింది. అనంతపురంతో పాటు ధర్మవరం, హిందూపురం, గుంతకల్లు, కదిరి, కల్యాణదుర్గం తదితర చోట్ల పరీక్షలు నిర్వహించారు. ఇస్కాన్ వ్యవస్థాపకుడు భక్తివేదాంద శ్రీల ప్రభుపాదుల జీవిత విశేషాలపై సాగిన పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల మంది హాజరైనట్టు ఇస్కాన్ జిల్లా ఇన్చార్జి దామోదర గౌరంగదాసు తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో 700 మంది, ఇంటల్ ఇంజనీరింగ్ కళాశాలలో 600 మంది ఆధ్యాత్మిక పరీక్షల్లో పాల్గొన్నారు. మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ పరీక్షల్లో ఉత్తమ ప్రదర్శన కింద ప్రథమ బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.75 వేలు, తతీయ బహుమతికి రూ.50 వేలు అందిస్తున్నామన్నారు. విజేతలకు త్వరలో విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఇస్కాన్ దక్షిణ భారతదేశ అధ్యక్షుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో రామభద్ర గోవిందు, రాధా గోస్వామి, సుందర చైతన్యదాసు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
బాలలచిత్రోత్సవానికి విశేష స్పందన
-
వీరి అవసరం..వారికి ఆదాయం
కర్నూలు(జిల్లా పరిషత్): భూముల ధరలు పెరగనుండడంతో జిల్లాలో రిజిస్ట్రేషన్లకు విశేష స్పందన వస్తోంది. రిజిస్ట్రార్ కార్యాలయాలకు రెట్టింపు సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. వీరి బలహీనతను ఆసరగా చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయం సిబ్బందిమామూళ్లకు తెరలేపారు. అన్ని డాక్యుమెంట్లు కరెక్టుగా ఉన్నా తెలియని తప్పులు చూపుతూ భారీగా దండుకుంటున్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌పై కార్యాలయంలో రూ.20వేల నుంచి రూ.40వేల వరకు చేతులు మారుతున్నాయి. జిల్లాలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి భూముల విలువ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయా మండల, మున్సిపాలిటీల పరిధిలోని సబ్రిజిస్టార్ల ప్రతిపాదనలను జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆధ్వర్యంలోని కమిటీ పది రోజుల క్రితం ఆమోదించింది. జిల్లాలో 20 నుంచి 60 శాతం వరకు స్టాంప్ డ్యూటీ పెంచేసింది. 2013 ఏప్రిల్ ఒకటిన స్టాంప్ డ్యూటీని పెంచారు. మార్కెట్లో విక్రయిస్తున్న ధరల కంటే చెల్లిస్తున్న ధర తక్కువగా ఉందని, ఈ కారణంగా ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో రెండురోజుల్లో భూముల విలువలు పెరిగితే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ భారం అధికమవుతుందన్న కారణంగా ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత వారంతో పోలిస్తే ఈ సోమవారం నుంచి రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. జిల్లాలో 24 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో కర్నూలు, కల్లూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, మున్సిపాలిటీల పరిధిలో బుధ, గురువారాల్లో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు కర్నూలులో 272 రిజిస్ట్రేషన్లు జరగ్గా, 27 నుంచి 30వ తేదీ వరకు 490 రిజిస్ట్రేషన్లు జరగడం విశేషం. అలాగే కల్లూరులో సోమవారం నుంచి గురువారం వరకు 458 రిజిస్ట్రేషన్లు జరిగాయి. పెరిగిన మామూళ్లు సందట్లో సడేమియా అన్నట్లు ప్రజల అవసరాన్ని, భయాన్ని ఆసరగా చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగులు భారీగా మామూళ్ల మొత్తాన్ని పెంచేశారు. ఏదైనా భూమి, ఇళ్లు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించాలంటే ముందుగా డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లాలి. డాక్యుమెంట్ చేయడానికి రూ.1000 నుంచి రూ.1500ల వరకు వసూలు చేస్తున్నారు. అయితే అనధికారికంగా కొంతమంది కీలక డాక్యుమెంట్ రైటర్లు దళారులుగా మారారు. డాక్యుమెంట్లు సరిగ్గా లేవని, స్థలం లిటికేషన్లో ఉందని చెబుతూ రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఫలితంగా డాక్యుమెంట్ రైటర్లు చెప్పిన మేరకు కాస్త అటూ ఇటూగా బేరమాడి మామూళ్లు ముట్టచెప్పి పని ముగించుకుంటున్నారు. ఇటీవల బుధవారపేటలోని ఓ స్థలానికి ఎలాంటి ఇబ్బందులూ లేకున్నా కోర్టు చిక్కులు ఉన్నాయంటూ ఓ కీలక ఉద్యోగి రూ.2లక్షల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తి అందరి ముందూ గట్టిగా వాదించడంతో రూ.2లక్షల మొత్తం కాస్తా రూ.20వేలకు దిగినట్లు చర్చ జరుగుతోంది. ఏమీ తెలియకుండా రిజిస్ట్రేషన్‌కు వెళ్లే వారికి పలు రకాల భయాలు సృష్టించి ఉద్యోగులు లబ్ధిపొందుతున్నారు. కార్యాలయంలో ఒక్కోసీటుకు ఒక్కో రేటు చెబుతూ రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. -
’షి అండ్ షైన్’ కి విశేష స్పందన
-
చుక్కల మందుకు చక్కని స్పందన
విజయనగరం ఆరోగ్యం: పల్స్‌పోలియో కార్యక్రమానికి మంచి స్పందన కనిపించింది. కార్యక్రమంలో భాగంగా తొలిరోజే లక్ష్యానికి చేరువగా 98.22శాతం మందికి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో ఐదేళ్లలోపు పిల్లలు 2,42, 416 మందికి పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా 2,38,101మంది పిల్లలకు వేశారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 1600 బూత్‌లలో పోలియో చుక్కలు వేసేందుకు గాను 3200 టీమ్‌లను ఏర్పాటు చేశారు. 160 మంది ఈకార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలో కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు, కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌లు పిల్లలకు పోలియో చుక్కలు వేసారు. డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి విజయనగరంపట్టణం, రామతీర్థం, నెలిమర్లలో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అదనపు వైద్యారోగ్యశాఖాధికారి సి.పద్మజ పోలిపల్లి,మెంటాడ, తెట్టంగి, తెర్లాంలలో పర్యవేక్షించారు. డీటీసీఓ రామారావు సాలూరు నియోజకవర్గం పరిధిలో పర్యవేక్షించారు. గరివిడి, చీపురుపల్లిలలో మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ పర్యవేక్షించారు. పార్వతీపురం, నీలకంఠాపురం, గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల్లో డిప్యూటీ డీఎంహెచ్ఓ భాస్కర్‌రావు, గజపతినగరం నియోజకవర్గం పరిధిలో జైబార్ కో ఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు. -
‘మేరీ కామ్’ అదుర్స్!
భారతీయ బాక్సింగ్ చాంపియన్ మేరీ కామ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘మేరీ కామ్’లో ప్రియాంకా టైటిల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అసలు సిసలైన బాక్సర్‌గా అగుపించడానికి ప్రియాంక చాలా కసరత్తులు చేశారు. శారీరకంగా ఫిట్‌గా తయారు కావడంతో పాటు, బాక్సింగ్ కూడా నేర్చుకున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ‘‘మేరీ కామ్‌గా ప్రియాంకా ఒదిగిపోయిన వైనం అద్భుతంగా ఉందని, పాత్రలో ఇంతలా పరకాయ ప్రవేశం చేయడం నమ్మశక్యంగా లేదనీ, ప్రియాంకకు అభినందనలు అని’’ ట్వీట్ చేశారు సమంత. అది మాత్రమే కాదు.. ప్రియాంకను అభినందిస్తూ తనకు వచ్చిన ట్వీట్స్ అన్నింటినీ సమంత రీట్వీట్ చేశారు. -
ఫేస్బుక్ పేజీకి అనూహ్య స్పందన
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉంటున్న ఈశాన్య ప్రజల సౌకర్యార్థం ఢిల్లీ పోలీసులు ప్రారంభించిన ఫేస్బుక్ పేజీకి అనూహ్య స్పందన లభిస్తోంది. మూడు వారాల కిందట ప్రారంభించిన ఈ పేజీలో దేశవ్యాప్తంగా ఉన్న ఈశాన్య ప్రజలనుంచి ఇప్పటికే 5,500 ఫిర్యాదులు, సూచనలు అందాయి. స్పందించినవారిలో ఎక్కువగా యువత ఉండటం విశేషం. ఈశాన్య రాష్ట్రాల ప్రజల కోసం www.dpfne.com (delhipolicefornortheast.com) పేజీని ఢిల్లీ పోలీసులు మే 9న ప్రారంభించారు. అనతి కాలంలోనే ఇది ప్రచారం పొందింది. ప్రారంభమైన నాటినుంచి నేటివరకు దేశంలోని పలు ప్రాంతాల్లోని ఈశాన్య రాష్ట్రాల ప్రజలనుంచి 5,500 ఫిర్యాదులు, సూచనలు అందాయని పోలీసు జాయింట్ కమిషనర్ రాబిన్ హిబూ తెలిపారు. ఈ పేజీకి బాధ్యతలు హిబు చూస్తున్నారు. ఈశాన్య ప్రజలు తమ సమస్యలను పంచుకోవడానికి ఫేస్బుక్ పేజీ సులభమైన మార్గమని హిబూ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మోసపోకుండా సరైన డ్రైవింగ్ లెసైన్సులు పొందాలని మే 30న ఢిల్లీ పోలీసులు కోరారు. నాగాలాండ్‌కు చెందిన యువతిని న్యాయవాది టిస్ హజారీ కోర్టు బయట వేధించిన ఘటనపై పోలీసుల చర్యలేంటని మే 27న ఓ యువకుడు పేజీలో పోస్టు చేశాడు. న్యాయం చేయడంలో జాప్యం చేస్తే నిజాన్ని తిరస్కరించడమేనని కూడా ఆ యువకుడు కామెంట్ చేశాడు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, డీసీపీ, జాయింట్ కమిషనర్లు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారని ఢిల్లీ పోలీసులు సమాధానమిచ్చారు. ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో తాను ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు హిబూ తెలిపారు. ఫేస్బుక్ పేజీలో ఏదైనా ఫిర్యాదు అందగానే తాము చర్యలు తీసుకుంటామని, స్థానిక పోలీసులకు సమాచారమందించి సాధ్యమైనంత తొందరగా సమస్యను పరిష్కరించమని కోరతామని ఆయన చెప్పారు. అంతేకాదు ఈ విషయంపై సంబంధిత పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి వివరణ కూడా తీసుకుంటామన్నారు. ఫేస్బుక్ పేజీ ప్రారంభించిన నాటినుంచి ఈశాన్య రాష్ట్రాల ప్రజల మీద వేధింపులకు సంబంధించి అందిన ఫిర్యాదుల మేరకు 250 కేసులు నమోదు చేశారు. 150 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారంతా అత్యాచారం, వేధింపులు, ఈవ్‌టీజింగ్, ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారేనని హిబూ చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలపై స్పందించిన హిబూ సీనియర్ పోలీసు అధికారులతో చర్చిస్తామని సమాధానమిచ్చారు. అంతేకాదు తమకు అందిన సూచనల మేరకు సరైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈశాన్య ప్రజల సంక్షేమం కోసం ఫేస్బుక్ పేజీతోపాటు 1093 నంబర్‌పై నార్త్ఈస్ట్ హెల్ప్‌లైన్, 9810083486 నంబర్‌పై వాట్పప్‌ను కూడా నిర్వహిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. దక్షిణ ఢిల్లీ లజ్‌పత్‌నగర్‌లో కొందరు దుకాణదారులు అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి 19 ఏళ్ల నిడోతానియాపై దాడి చేయడంతో అతను మరణించడం, ఈ ఘటనపై ఢిల్లీలోనే కాకుండా, ఈశాన్య రాష్ట్రాలనుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయిన విషయం విదితమే. రాజధానిలో ఈశాన్య ప్రజలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫేస్బుక్పేజ్, హెల్ప్‌లైన్ నంబర్, వాట్సప్ వంటి సోషల్ నెట్‌వర్క్‌లను వారికి అందుబాటులోకి తెచ్చారు ఢిల్లీ పోలీసులు.