సోఫియా హ్యాట్రిక్
హాలీవుడ్... బాలీవుడ్... ఏ ‘వుడ్’లతో టచ్ లేకపోరుునా కోట్లు గడిస్తోంది టీవీ నటి సోఫియా వెర్గారా. ఫోర్బ్స్ వ్యూగజైన్ ‘హయ్యుస్ట్ పెరుుడ్ యూక్ట్రెస్’ లిస్టులో వరుసగా మూడో ఏడాదీ ఈ అమ్మడే టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఈ ఏడాదిలో సోఫియూ సంపాదన దాదాపు 37 మిలియున్ డాలర్లని అంచనా. 13 మిలియున్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది వురిస్కా హర్గిటే.
శ్రుతి మించిన ప్రమోషన్
‘దేశీ కట్టే’ చిత్రం టీమ్ చౌకబారు పబ్లిసిటీతో పరువు తీసుకుంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఈ చిత్రం ఆడియో లాంచింగ్‌లో.. పాటల వీడియో ప్లే చేస్తుండగా వుధ్యలో ఓ నీలి చిత్రం క్లిప్పింగ్ వచ్చేసింది. ఈ దెబ్బకు అక్కడున్నవారు షాక్‌కు గురయ్యారన్నది ‘మిడ్ డే’ కథనం. ఇది ఓ టెక్నీషియున్ పనని అంటున్నా... అతడు మాత్రం తనకేమీ తెలీదన్నాడు. ఇది తమనీ దిగ్భ్రాంతికి గురిచేసిందనేది నిర్మాత, దర్శకుల మాట.
అసోంలోనూ నో ట్యాక్స్
ప్రియాంకాచోప్రా నటించిన ‘మేరీకోమ్’ చిత్రానికి అసోం ప్రభుత్వం ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ ఎత్తివేసింది. స్ఫూర్తిదాయుకమైన వుణిపూర్ వుహిళా బాక్సర్ మేరీకోమ్ జీవిత కథ ఆధారంగా తీసిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. మేరీ యూవత్ దేశానికీ గర్వకారణవుని, అందుకే ట్యాక్స్ విధించడం లేదని అసోం వుుఖ్యవుంత్రి తరుణ్ గొగోయ్ చెప్పారు. వుహారాష్ర్ట, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇప్పటికే ఈ సినివూపై ట్యాక్స్ ఎత్తివేశాయి.