ప్రధాని మంచి పనిచేశారు..
Published Sat, Nov 19 2016 1:59 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్టార్ బాక్సర్ మేరీ కోమ్ అభినందించారు. ఎలాంటి కష్టాలు లేకుండా జీవితంలో ఏ మంచిని సాధించలేమని తెలిపారు.అన్ని సర్దుకునే వరకు కొంత ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను తాను అర్థం చేసుకోగలనని, కానీ భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఈ అడుగు చాలా కీలకమన్నారు. పెద్దనోట్ల రద్దు ప్రజల్లో మార్పు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వివిధ రూపాల్లో భారత్లో బ్లాక్మనీ విజృంభిస్తుందని, ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా అభినందించి తీరాల్సిందేనని కోమ్ తెలిపారు.
‘‘ ఇది భారత్లో మార్పు తీసుకుస్తుందని నేను భావిస్తున్నా. ముఖ్యంగా పేద ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇవి కొన్నిరోజులే. కష్టం లేనిదే ఎలాంటి ఫలితం దక్కదు. కచ్చితంగా భవిష్యత్తులో లబ్ది పొందుతామనే ఆశ ఉంది’’అని ఒలంపిక్ మెడలిస్ట్ పేర్కొన్నారు. ఇంతపెద్ద సంచలన నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోదీకి సెల్యూట్ చేయాల్సిందేనని లెజెండరీ అథ్లెట్ మిల్కా సింగ్ తెలిపారు. భవిష్యత్తు తరం వారికి ఈ నోట్ల రద్దు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పేదరికాన్ని కొంతమేర తగ్గించవచ్చన్నారు. చెప్పడం తేలికే.. కానీ అమల్లోకి తీసుకురావడమే కష్టం. అలాంటిది మోదీ నెరవేర్చారని, గ్రేట్ జాబ్ నిర్వహించారని కొనియాడారు. పేద పిల్లలు చదువుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని మిల్కా సింగ్ చెప్పారు.
Advertisement
Advertisement