సచిన్ టెండుల్కర్
Sachin Tendulkar: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. భారత ఎన్నికల సంఘం ఆయనకు నేషనల్ ఐకాన్‌గా గుర్తింపు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఇరు వర్గాల మధ్య బుధవారం ఒప్పందం జరుగనుంది.
ఈ నేపథ్యంలో మూడేళ్ల పాటు సచిన్ నేషనల్ ఐకాన్‌గా ఉండనున్నారు. ఈ క్రమంలో ఓటింగ్ ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ.. దేశవ్యాప్తంగా ఓటర్లలో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగం కానున్నారు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసిన సచిన్ టెండుల్కర్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
యూత్‌లో భారీ క్రేజ్ దృష్ట్యా..
యువతలోనూ సచిన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రికెట్ గాడ్ క్రేజ్‌ను ఉపయోగించి ఓటర్లను మరింత చైతన్యవంతం చేసేందుకు ఈసీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈ లెజండరీ క్రికెటర్‌ను నేషనల్ ఐకాన్‌గా నియమించనుంది.
ఇక గతంలో బాలీవుడ్ నటులు పంకజ్ త్రిపాఠి, ఆమిర్ ఖాన్.. అదే విధంగా క్రీడా విభాగంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బాక్సర్ మేరీ కోమ్ లోక్‌సభ ఎన్నికల సమయంలో నేషనల్ ఐకాన్లుగా సేవలు అందించారు.
చదవండి: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్..
తానే బెస్ట్ బౌలర్ అనుకుంటాడు.. కోహ్లి బౌలింగ్ అంటే మాకు భయం: భువీ
Comments
Please login to add a commentAdd a comment