ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విలీనం ప్రక్రియను ముమ్మరం చేశారు. రూ.70వేల కోట్ల విలువైన ఎంటర్ టైన్‌మెంట్ విభాగానికి చెందిన ఆ రెండు సంస్థల్ని విలీనం చేసేందుకు గాను అనుమతి కావాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుండి క్లియరెన్స్‌ను అభ్యర్థించింది.
పీటీఐ నివేదిక ప్రకారం..ఈ ఏడాది ఫిబ్రవరిలో ముఖేష్ అంబానీ చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటుకు నిర్ణయించాయి.
సంయుక్త సంస్థలో రిలయన్స్ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ డీల్ గురించి ఎప్పటినుంచో వస్తున్న ఊహాగానాలకు తెర దించుతూ ఫిబ్రవరిలో అధికారిక ప్రకటన విడుదల చేశాయి.
ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం కానుంది. జాయింట్ వెంచర్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుంది. విలీన సంస్థలో రిలయన్స్‌కు 16.34 శాతం, వయాకామ్ 18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు దఖలు పడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment