ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జియో, ఫేస్‌బుక్ మెగా ఒప్పందానికి సంబంధించి కీలక అనుమతి లభించింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్ 9.99 శాతం వాటా కొనుగోలుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ మేరకు యాంటీట్రస్ట్ వాచ్‌డాగ్ సీసీఐ ఇండియా బుధవారం ట్వీట్ చేసింది.
జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటా కోసం ఫేస్‌బుక్ రూ .43,574 కోట్ల పెట్టుబడులును పెట్టనుంది. రిలయన్స్ ఇటీవలికాలంలో సాధించిన 11 మెగా డీల్స్ సిరీస్‌లో ఇది మొదటిది. ఏప్రిల్ 22 న ప్రకటించిన ఈ ఒప్పందంతో మార్క్ జుకర్‌బర్గ్ ఆధ్యర్యంలోని ఫేస్‌బుక్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా అవతరించింది. కాగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా రిలయన్స్ రుణ రహిత సంస్థగా అవతరించింది. అలాగే 11 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ను అధిగమించి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ కంపెనీగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. (అది మా డీఎన్ఏలోనే ఉంది : అంబానీ)
@CCI_India approves acquisition of 9.99% stake in Jio Platforms by Jaadhu Holdings LLC.
— CCI (@CCI_India) June 24, 2020
చదవండి : ధనాధన్ జియో
ఫేస్‌బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం
Comments
Please login to add a commentAdd a comment