Jio net
-
ఇండియాలోనే ఉత్తమ నెట్వర్క్..ఊక్లా అవార్డులు అన్నీ సంస్థకే..
దేశంలో అగ్రగామి నెట్‌వర్క్‌గా రిలయన్స్ జియో నిలిచింది. ఊక్లా సంస్థ ప్రకటించే స్పీడ్‌టెస్ట్‌లకు సంబంధించిన అవార్డులను అన్నింటినీ రిలయన్స్జియో గెలుచుకుంది. 5జీ నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్ విభాగంలో మొత్తం అవార్డులను జియో గెలుపొందినట్లు ఊక్లా ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తమ, వేగవంత, టాప్ రేటెడ్ మొబైల్ నెట్వర్క్, ఉత్తమ మొబైల్ కవరేజీ, ఉత్తమ మొబైల్ వీడియో, గేమింగ్ అనుభూతి, 5జీ మొబైల్ నెట్వర్క్, 5జీ మొబైల్ వీడియో అనుభూతి, 5జీ మొబైల్ గేమింగ్ అనుభూతి అవార్డులను జియో దక్కించుకుందని తెలిపింది. ఊక్లా స్పీడ్‌టెస్ట్ అందించే సూచనల ద్వారా తమ సంస్థతోపాటు ఇతర సంస్థల వినియోయోగదారులకు అత్యుత్తమ సేవలను అందించేలా ప్రయత్నిస్తున్నట్లు సంస్థ సీఈఓ, ప్రెసిడెంట్ స్టీఫెన్ తెలిపారు. ఈ అవార్డులు, గుర్తింపుతో భారత్‌లో అత్యుత్తమ నెట్‌వర్క్‌గా జియో మారిందన్నారు. టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల మార్పు తీసుకురావడంతోపాటు డిజిటల్ సమాజాన్ని సృష్టించాలన్నది జియో లక్ష్యమని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ అన్నారు. -
జియో డౌన్.. గగ్గోలు పెడుతున్న యూజర్లు
Reliance Jio Outage: రిలయన్స్ జియో నెట్వర్క్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ముఖ్యంగా ముంబై టెలికాం సర్కిల్ పరిధిలో నెట్‌వర్క్‌కు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. దీంతో కాల్స్ ఇన్కమ్, అవుట్‌గోయింగ్‌కు ఇబ్బంది పడుతున్నారు యూజర్లు. ఇదిలా ఉంటే ముంబైతో పాటు దేశంలోని మరికొన్ని సర్కిల్స్‌లోనూ ఇదే తరహా సమస్యలు యూజర్లు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. మరికొన్ని చోట్ల నాలుగైదు రోజుల నుంచి నెట్వర్క్ సరిగా పని చేయడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జియో నుంచి మాత్రమే కాదు.. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియో నెంబర్లకు కాల్స్ కనెక్ట్ కావడం లేదనే ఫిర్యాదు అందుతున్నాయి. అంతరాయానికి కారణం ఏంటన్నది స్పష్టం చేయని జియో నెట్వర్క్.. యూజర్లకు వీలైనంత త్వరగా సేవలు పునరుద్ధరిస్తామని పేర్కొంది. అంతవరకు ప్రత్యామ్నాయ సిమ్ లేదంటే ఇంటర్నెట్ బేస్డ్ సేవల్ని వినియోగించుకోవాలని యూజర్లకు విజ్క్షప్తి చేస్తోంది. మరోపక్క నెట్వర్క్ పని చేయకపోవడంపై ఇతర నెట్వర్క్ యూజర్లు మీమ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. Meanwhile #jio network pic.twitter.com/6dceYAo4Pc — hemaantt (@hemaantt) February 5, 2022 Jio Network down in full mumbai ( no calls, internet or mails) living life in ancient times #jio pic.twitter.com/ZDbY6riXVN — SavageNewsFurkan (@furkanaibani) February 5, 2022 #Jio network down Don't worry Mukesh Ambani is on duty: pic.twitter.com/EvA0c0bSDI — Hemant (@Sportscasmm) February 5, 2022 -
ఏడు ఐపీఎల్ జట్లకు అనుబంధ స్పాన్సర్‌గా జియో
ప్రస్తుత ఐపీఎల్ -10 సీజన్ లో ఆడుతున్న 8 జట్లలో ఏడు జట్లకు జియో అనుబంధ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లతో జియో ఒప్పందం చేసుకుంది. జియో నెట్ హైస్పీడ్ వై-ఫై సేవలు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లకు రిలయన్స్ జియో తమ హై-స్పీడ్, వై-ఫై ఇంటర్నెట్ సేవలను జియో నెట్ ద్వారా అందిస్తోంది. రిలయన్స్ జియో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ కోసం తమ జియో నెట్ వై-ఫై తో స్టేడియం మొత్తం కవర్ చేసింది. ఈ సేవల కోసం, ప్రేక్షలకు కావలసింది ఒక స్మార్ట్ ఫోన్ మాత్రమే. వై-ఫై కి కనెక్ట్ అయిన తరువాత, జియో నెట్ హోం పేజీలో ఇచ్చిన మొబైల్ నంబరుకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే వై-ఫై కనెక్ట్ అవుతుంది.