పెరిగే గుడ్డు - తరిగే గుడ్డు | experment that increase, decrease quantitie of egg size | Sakshi

పెరిగే గుడ్డు - తరిగే గుడ్డు

Published Tue, Sep 8 2015 3:46 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

పెరిగే గుడ్డు - తరిగే గుడ్డు

పెరిగే గుడ్డు - తరిగే గుడ్డు

ఆరోగ్యవంతమైన జీవనం కోసం రోజూ ఓ గుడ్డు తినమని చెబుతారు వైద్యులు.

ఆరోగ్యవంతమైన జీవనం కోసం రోజూ ఓ గుడ్డు తినమని చెబుతారు వైద్యులు. పోషక విలువలు మెండుగా కలిగిన ఆహారంగా దీనికి పేరు. శరీరానికి ఇది చేసే మేలును పక్కనబెడితే.. గుడ్డుతో ఎన్నో ప్రయోగాలు చేయవచ్చు. అందులో కొన్ని వంటకు సంబంధించినవి, మరికొన్ని వైజ్ఞానిక విషయాలకు చెందినవి. ఈ రోజు మనం గుడ్డుతో చేయదగిన సరికొత్త వైజ్ఞానిక ప్రయోగాన్ని గురించి తెలుసుకుందాం..!
 

 ప్రయోగం: గుడ్డు పరిమాణం మార్పు
 కావాల్సినవి:
  రెండు గుడ్లు
  కారో కార్న్ సిరప్
  మంచినీళ్లు
  రెండు గాజు గ్లాసులు
  వినెగర్
  పెద్దల పర్యవేక్షణ
 
 ఏం చేయాలి?

  •    తొలుత రెండు గాజు గ్లాసులను తీసుకుని, రెండిట్లోనూ వినెగర్‌ను నింపండి.
  •    ఇప్పుడు రెండు గుడ్లను తీసుకుని వాటిని గ్లాసుల్లోకి జారవిడవండి. 24 గంటలపాటు వాటిని వినెగర్‌లో మునగనివ్వండి.
  •   ఇలా చేయడం ద్వారా గుడ్డుపై ఉన్న పెంకులు కరిగిపోయి, మెత్తటి గుడ్డు మాత్రమే మిగులుతుంది.
  •    ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఓ గ్లాసులో సిరప్‌ని, మరో గ్లాసులో మంచినీటిని నింపండి.
  •    ఈ రెండింటిలోకీ వినెగర్‌లో తడిసిన గుడ్లను నెమ్మదిగా జారవిడవండి. మరో 24 గంటలపాటు వాటి జోలికి వెళ్లకండి.
  •    ఇప్పుడు రెండు గుడ్లనూ గ్లాసుల నుంచి వెలుపలికి తీసి పరీక్షించండి.

 ఏం జరుగుతుంది?
 మొదట సమాన పరిమాణంలో ఉన్న గుడ్లు ఇప్పుడు వేర్వేరు పరిమాణాల్లో దర్శనమిస్తాయి. నీటిని నింపిన గ్లాసులో ఉన్న గుడ్డు, సిరప్‌లో మునిగిన గుడ్డు కంటే పెద్దదిగా కనిపిస్తుంది. అదే సమయంలో సిరప్‌లో ఉంచిన గుడ్డు కుంచించుకుపోయినట్టుగా ఉంటుంది.
 ఏంటీ కారణం?
 ప్రయోగం ప్రారంభంలో గుడ్లను వినెగర్‌లో ముంచినపుడు రసాయనిక చర్యలు జరుగుతాయి. వినెగర్‌లోని ఎసిటిక్ ఆమ్లం, గుడ్డు పెంకులోని కాల్షియం కార్బొనేట్‌తో చర్య జరుపుతుంది. ఫలితంగా కార్బన్ డై ఆక్సైడ్, నీరు, కాల్షియం ఏర్పడతాయి. నీరు, కాల్షియం వంటివి మన కంటికి కనిపించవు. అయితే, గ్లాసులోంచి పైకి వెళ్లే బుడగల రూపంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను మాత్రం గమనించవచ్చు. ఈ ప్రక్రియ కారణంగా పెంకులు లేని గుడ్లను పొందవచ్చు.
 కుంచించుకుపోవడం...
 తర్వాతి దశలో సిరప్ ఉన్న గ్లాసును పరీక్షిస్తే.. అందులో కరిగి ఉన్న చక్కెర గాఢత దృష్ట్యా సిరప్ అధిక సాంద్రత కలిగి ఉంటుంది. ఈ చక్కెర అణువులు గుడ్డు పైపొరలోకి చొచ్చుకుపోలేవు. అయితే, గుడ్డులోని నీటి అణువులు మాత్రం పైపొరను దాటుకుని బయటకు రాగలవు. గ్లాసులోని చక్కెర గాఢతతో నీటి గాఢత సరితూగే వరకూ గుడ్డులోని నీటి అణువులు బయటకు వస్తూనే ఉంటాయి. ఇలా గుడ్డు నుంచి సిరప్‌లోకి నీరు బదిలీ కావడంతో గుడ్డు కుంచించుకుపోతుంది.
 పెరగటం...
 మరోవైపు, మంచినీటి గ్లాసును పరిశీలిస్తే.. అందులోని గుడ్డు సాధారణం కంటే పెద్దదిగా కనిపిస్తుంది. దీనికి కారణం గుడ్డులో ఉన్న నీటి అణువుల గాఢత కంటే గ్లాసులోని నీటి గాఢత ఎక్కువ కావడమే. దీంతో గుడ్డు నుంచి నీరు బయటకు పోవడానికి బదులుగా బయటి నీరు గుడ్డులోకి వచ్చి చేరుతుంది. ఇంకేముంది! గుడ్డు తన పరిమాణం కంటే పెద్దదిగా మారుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement