ఇప్పటినుంచే భక్తులు పోటెత్తుతున్నారు!
వరంగల్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకోవడానికి ఇప్పటినుంచే భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క, సారక్క అమ్మవార్లను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. మరో నెలరోజుల్లో ప్రధాన జతర జరగనున్న నేపథ్యంలో మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు.
ప్రధాన జాతర సమయంలో మొక్కులు తీర్చుకోవడం కష్టతరంగా మారడంతో భక్తులు ఇప్పుటినుంచే పెద్ద ఎత్తున వస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆదివారం వాహనాల రద్దీ వల్ల కన్నెపల్లి-కొత్తూరు మధ్య భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోయి.. భక్తులు అవస్థలు పడుతున్నారు.