మేడారం (తాడ్వాయి), న్కూస్‌లైన్ : కోటి మంది వచ్చే మేడారం జాతరకు కోటి జాగ్రత్తలు తీసుకోవాలని.. ఈ మేరకు అభివృద్ధి పనులకు ముందస్తుగా ప్రతిపాదనలు సిద్ధం చేయూలని అధికారులను కలెక్టర్ కిషన్ ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో జాతరలో సౌకర్యాలు మెరుగుపరిచి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అమ్మవార్ల ఆశీస్సులతో అందరం కలిసి జాతరను విజయవంతం చేయూలని పిలుపునిచ్చారు. వచ్చే సంవత్సరం ఫి బ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో కలెక్టర్ శనివారం వివిధ శాఖల అధికారులతో కలిసి మేడారంలో క్షేత్రస్థారుులో పర్యటించారు.
అనంతరం మేడారంలోని ఐటీడీఏ అతిథి గృహంలో రూరల్ ఎస్పీ పా లరాజు, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, ఐటీడీఏ, ఆర్‌డబ్ల్యూఎస్, ఎంఐ, ఐబీ, పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో, ఎండోమెంట్, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య, ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. గత జాతరలోని భక్తుల ఇబ్బందులను శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. గత జాతరకు 80 లక్షల మంది భక్తులు వచ్చారని... ఈసారి కోటి మంది భక్తులు వచ్చే అవకాశమున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
ప్రధానంగా జాతరలో తాగు నీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్య లు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూ పొందించాలని ఆయూ శాఖల అధికారులకు కలెక్టర్ కిషన్ సూ చించారు. అదేవిధంగా ఐటీడీఐ ఆధ్వర్యంలో లింక్ రోడ్ల అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు తయారు చేయూ లన్నారు. పస్రా నుంచి మేడారం... తాడ్వాయి నుంచి మేడారం వరకు గల తారు రోడ్లు అభివృద్ధి చేయాలని ఆర్‌ఆండ్‌బీ, ఎన్‌హె చ్ అధికారులను ఆదేశించారు. జాతరలో అస్వస్థతకు గురైన భక్తులకు వైద్య పరీక్షలందించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చే యాలన్నారు.
గద్దెల ప్రాంతంలోనే కాకుండా జాతర పది కిలోమీటర్ల మేర విద్యుత్ సరఫరా కోసం చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులకు చెప్పారు. బృందాల వారీగా అధికారులు సమన్వయంతో పని చేసి జాతర విజయవంతం చేయూలన్నారు. జంపన్నవాగు స్నానఘాట్టాల వద్ద భక్తులు తలనీలాలు సమర్పించేందుకు 50 మీటర్లకు ఒకటి చొప్పున ఎక్కువ సంఖ్యలో కేశఖండన కేంద్రాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు దేవతలను దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యే క క్యూ లైన్లు ఏర్పాటు చేయూలన్నారు. జాతరపై ఇది తొలి సమావేశమేనని.. ఇలాంటివి ఎన్నో ఉంటాయని కలెక్టర్ చెప్పారు.
భారీ భద్రత చర్యలు : రూరల్ ఎస్పీ పాలరాజు
మేడారం జాతరలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ భద్రత చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్పీ పాలరాజు తెలిపారు. గత జాతరలో భక్తుల ఎదుర్కొన్న ఇబ్బందులపై... అప్పుడు విధులు నిర్వర్తించిన ఎస్పీ జాబితా తయారు చేశారని చెప్పారు. ఈ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ సమస్యతోపాటు క్యూలో తోపులాట చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వీఐపీ, ప్రైవేట్ వాహనాల పార్కింగ్ కోసం అదనపు స్థలాలు ఏర్పాటు కోసం చర్యలు చేపట్టనున్నట్లు పాలరాజు వివరించారు.
దేవాదాయ సిబ్బంది తీరుపై అసంతృప్తి
తాడ్వాయి : దేవాదాయశాఖ అధికారుల తీరుపై కలెక్టర్ కిషన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎండ తీవ్రతకు దేవతల గద్దెల ప్రాగణంలోని నాపరాయి వేడిక్కింది. దీంతో అధికారులు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్ద దేవాదాయ సిబ్బంది బస్తా సంచులు వేశారు. అధికారులు వాటిపై నిలబడి దేవతలను దర్శించుకున్నారు. మేడారంలో పర్యటన ఉందని తెలిసి కూడా గద్దెల ప్రాంగణంలో నీడ ఏర్పాటు ఎందుకు చేయలేదని దేవాదాయశాఖ అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేయొద్దని వారికి సూచించారు.
‘కోటి’ జాగ్రత్తలు అవసరం
Published Sun, Aug 25 2013 3:02 AM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM
Advertisement