రాణిరుద్రమ పౌరుషం, సమ్మక్క-సారలమ్మ ధీరత్వానికి వారసత్వంగా నిలిచిన ఓరుగల్లులో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. చట్టసభలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1984లో కల్పనాదేవి లోక్‌సభలో అడుగుపెట్టారు.
1967లో జిల్లా నుంచి మొదటిసారిగా మహిళా ఎమ్మెల్యే ఎన్నికయ్యూరు. ఆ తర్వాత 2004 నుంచి మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే ఉన్నారు. 2009లో ఒకేసారి నలుగురు మహిళలు ఎమ్మెల్యేలు గెలుపొంది రికార్డు సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు.
1995లో 225 ఎంపీటీసీ, 17 మంది మహిళా జెడ్పీటీసీ సభ్యులు ఉంటే.. ఇప్పుడు 369 ఎంపీటీసీ, 25 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించనున్నారు.