orugallu
-
వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే..?
ఖిలా వరంగల్: రాజులు పోయారు.. రాజ్యాలు అంతరించాయి. రాచరికపు వైభోగాలు కనుమరుగయ్యాయి. కానీ నాటి కట్టడాలు, జ్ఞాపకాలు నేటికీ చెక్కు చెదరలేదు. శతాబ్దాల చరిత్ర.. శత్రు దుర్బేధ్య నగరం.. శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది ఏకశిల కొండ. నాడు ఏకశిల నగరం, ఓరుగల్లుగా పలు పేర్లతో ప్రఖ్యాతిగాంచింది. కాలక్రమేణా దీనికి వరంగల్ (Warangal) పేరు స్థిరపడింది. వారసత్వ నగరంగా.. భారతదేశంలోని ఉత్తమ వారతస్వ నగరాల్లో ఒకటిగా ఓరుగల్లు (Orugallu) గుర్తింపు పొందింది. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరం. ఓరు.. అంటే ఒకటి, గల్లు.. అనే పదానికి రాయి అని అర్థాలున్నాయి. 11వ శతాబ్ధంలో ఈ అందమైన నగరాన్ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని 300 ఏళ్లు కాకతీయులు పాలించారు. ఈ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. రాజధానిగా చెప్పుకుంటున్న ఖిలా వరంగల్ కోట అద్భుతమైన పురాతన కట్టడాలు, అనేక స్మారక చిహ్నాలు, వాస్తు శిల్ప కళా సంపదకు నిలయం. వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే.. కాకతీయుల రాజధానిగా చెప్పుకునే ఖిలా వరంగల్ కోటలో ఏకశిల గుట్ట (ఎత్తయిన రాతి కొండ)గా ఉంది. ఏక (ఒక) శిల (రాయి) ఏకశిలా నగరం.. దీన్నే ఓరు (ఒకటి) గల్లు (రాయి) అని.. ఈ ఎత్తయిన కొండ పేరుతోనే ఓరుగల్లు నగరంగా పిలుస్తుంటారు. శతాబ్దాల కాలం నుంచి ఏకశిల, ఓరుగల్లు నగరం కనుమరుగై.. ప్రస్తుతం వరంగల్‌గా పేరొందింది. అందాల కొండ ఏకశిల గుట్టను ఎక్కి చూస్తే.. నగరంతోపాటు చుట్టు పక్క గ్రామాలు, కొండలు, గుట్టలు, కనువిందు చేస్తాయి. ఈకొండపై ఆలయం, బురుజు, సైనిక స్థావరం, విశ్రాంతి గదులు, ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. ఈ కొండపై ఉన్న ఎత్తయిన బురుజుపై ఫిరంగి, భారీ తోపులు ఏర్పాటు చేశారు. శత్రు సైన్యం రాకను పసిగట్టినప్పుడు ఫిరంగులు, తోపుల్ని పేల్చడం వల్ల.. కోట చుట్టూ ఉన్న సైన్యం అప్రమత్తమయ్యేదని చరిత్రకారులు చెబుతున్నారు. కొండపై సైనిక స్థావరం హనుమకొండ పద్మాక్షి దేవాలయం కేంద్రంగా మూడు కొండలను ఏకం చేసి కాకతీయుల తొలి రాజధానిని ఏర్పాటు చేశారు. కాకతీమాత అనుగ్రహంతో గణపతి దేవ చక్రవర్తి 1199 నుంచి 1262 మధ్యకాలంలో రాజధానిని ఓరుగల్లుకు మార్చేసి 300 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించారు. తొలుత 3వేల ఆడుగుల ఎత్తయిన ఏకశిల కొండపై సైనిక స్థావరం ఏర్పాటు చేశారు. ఇందుకు కొండపై ఎత్తయిన బురుజే సాక్ష్యం. బురుజు ఎక్కేందుకు అంతర్భాగంలోనే వేర్వేరుగా మెట్ల మార్గాలు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గం ఎక్కి చూస్తే నగరంతోపాటు చుట్టూ ఉన్న కొండలు గుట్టలు, అందమైన నగరం కనువిందు చేస్తాయి. బురుజుపై తోపులు పెట్టి పేల్చిన ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. సైనికులు గాయపడకుండా.. నిలువెత్తు పటిష్టమైన నాలుగు రాళ్లు నాలుగు వైపులా నిలబెట్టి ఉంటాయి. దీనిపైకి పర్యాటకులు ఎక్కి.. రాతి కట్టడాలు.. ఆహ్లాదకర వాతావరణాన్ని తిలకించి ఆస్వాదిస్తున్నారు. సైనికులకు విశ్రాంతి గదులు ఆనాడు కొండపై సైనికులకు విశ్రాంతి గదులు నిర్మించారు. ఫిరంగుల్లో మందు నింపేందుకు ప్రత్యేక గదులు వేర్వేరుగా ఉండేవని చెబుతారు. ఈ నిర్మాణాలన్నీ 20 ఏళ్ల క్రితం వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆదరణ లేక శిథిలమై కూలిపోయాయి. ఈగుట్టపైకి రహస్య సొరంగ మార్గాలు ఉండేవని.. వాటి ద్వారా చేరుకుని సైనికులకు మార్గనిర్ధేశం చేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు. చదవండి: ఇజ్రాయెల్‌లో తెలుగువారి ఇక్కట్లు అభివృద్ధికి దూరంగా.. ఏకశిల గుట్ట నేటికీ అభివృద్ధికి దూరంగా ఉంది. గుట్టపై విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. కనీసం ఐదువేల మంది ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. గుట్టపై పర్యాటకులు చల్లని వాతావరణం, ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ.. నగర అందాలను వీక్షిస్తూ సేదదీరుతుంటారు. కానీ గుట్టపై దాహార్తి తీరేందుకు మంచినీటి సౌకర్యం లేదు. మెట్ల మార్గం ద్వారా పర్యాటకులు ఎంతో కష్టపడి ఎక్కినా.. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు లేక అవస్థలు పడుతుంటారు. ఒకే రాయితో ఏర్పడిన సుందరమైన చారిత్రక గుట్టను ఆధునికీకరిస్తే.. పర్యాటకుల రాక మరింత పెరుగుతుందని, తద్వారా స్థానిక యువతకు స్వయం ఉపాధి మెరుగుపడుతుందని స్థానికులు భావిస్తున్నారు.కొండపై ఆలయంఏకశిల కొండపై అద్భుతమైన శిల్ప కళా సౌందర్యంతో కూడిన ఓ ఆలయం ఉంది. ఆలయంలో 28 స్తంభాలతో గర్భగుడి, విశాలమైన కల్యాణ మండపం ఉంది. శిల్ప కళా సౌందర్యంతో కనిపించే ఈ ఆలయ గర్భగుడి దేవతా విగ్రహాలు లేక బోసిపోయి కనిపిస్తోంది. ఆనాడు సైనికులు సైతం ఇక్కడ శివారాధన చేసిన తర్వాతే విధుల్లో చేరేవారని చారిత్రక నిపుణులు చెబుతున్నారు. -
సుస్థిర అభివృద్ధి సాధించాలి
హనుమకొండ అర్బన్: చారిత్రక వారసత్వ నగరం ఓరుగల్లు సుస్థిర అభివృద్ధి సాధించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన అయన హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు, ప్రఖ్యాత కవులు, కళాకారులు, రచయితలు, సామాజిక కార్యకర్తలతో భేటీ అయ్యారు. అదే విధంగా నగరంలోని వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళి, పద్మాక్షి ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. కాకతీయ ఆలయాల శిల్పకళను పరిశీలించారు. వరంగల్ కోట, వరంగల్ ఎన్ఐటీలను సందర్శించి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా హనుమకొండ రెడ్‌క్రాస్‌ను సందర్శించి తలసేమియా, సికిల్‌సెల్ ఎనిమియా అదనపు బ్లాక్‌ను ప్రారంభించారు. రెడ్‌క్రాస్ చేపడుతున్న కార్యక్రమాల పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వరంగల్ నగరం సుస్థిర అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదాదేవి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. లక్నవరం సరస్సులో బోటింగ్మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో బసచేసిన గవర్నర్ బుధవారం ఉదయం సరస్సులో మంత్రి సీతక్క, అధికారులతో కలిసి బోటింగ్ చేశారు. సరస్సు అంతా కలియదిరిగి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. -
ఆంధ్రాలో కాకతీయుల తమిళ శాసనం
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు (తెలంగాణ) కేంద్రంగా పాలించిన రాజు.. ఆంధ్రాలోని ఓ దేవాలయం.. అక్కడ తమిళంలో శాసనం.. కాకతీయ చక్రవర్తుల అద్భుత పాలన తీరుకు మరో సజీవ సాక్ష్యమిది. నాటి చక్రవర్తి ప్రతాపరుద్రుడు కొంతమేర తమిళులున్న ఓ ప్రాంతంలో వారి సౌకర్యం కోసం తమిళ భాషలో శాసనం వేయించడం విశేషం. నష్టపోయిన వారికి బీమా కోసం.. ప్రస్తుతం ఏపీలోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలో ఉన్న మోటుపల్లిలో క్రీస్తు శకం 1244వ సంవత్సరంలో కాకతీయ గణపతి దేవచక్రవర్తి ఓ శాసనం వేయించారు. ఆనాటి సముద్ర వాణిజ్యంలో భాగంగా ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లితే ఆదుకునేందుకు బీమా పథకాన్ని ప్రారంభిస్తూ.. సంస్కృతం, తెలుగు, తమిళ భాషల్లో శాసనం రాయించారు. మళ్లీ 64 ఏళ్ల తర్వాత 1308 ఆగస్టు 1న అదే మోటుపల్లిలో ప్రతాపరుద్రుడు తమిళంలో వేయించిన మరో శాసనం తాజాగా వెలుగు చూసింది. మోటుపల్లి కోదండ రామాలయ రాజగోపురం గోడ రాళ్లలో తమిళంలో రాసి ఉన్న శాసనాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆదివారం గుర్తించారు. ఆలయ పునరుద్ధరణ పనుల కోసం మోటుపల్లి హెరిటేజ్ సొసైటీ అధ్యక్షుడు బొండా దశరామిరెడ్డి ఆహ్వానంపై వెళ్లిన ఆయన.. ఆలయాన్ని పరిశీలించే క్రమంలో ఈ శాసనం వెలుగుచూసిందని తెలిపారు. గోడ నిర్మాణంలో అడ్డంగా పెట్టిన ఆ ఓ రాయిపై ఉన్న అక్షరాలను అచ్చు తీసి చదవగా.. ప్రతాపరుద్రుడు వేయించిన దాన శాసనంగా తేలిందని వివరించారు. దీనిపై కేంద్ర పురావస్తు శాఖ శాసన విభాగం డైరెక్టర్ మునిరత్నంరెడ్డిని సంప్రదించామన్నారు. గతంలో ఆ శాసనం నకలును తీశామని.. మోటుపల్లిని దేశి ఉయ్యకొండపట్నమని, ఒక తమిళ ఉత్సవానికి కొంత భూమిని దానం చేసినట్టు అందులో ఉందని మునిరత్నంరెడ్డి వివరించారని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఆ శాసనం వివరాలను అధికారికంగా రికార్డు చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. మోటుపల్లి పోర్టు పూర్వకాలంలో వాణిజ్య కేంద్రంగా ఉండేదని, వ్యాపార రీత్యా తమిళులు పెద్దసంఖ్యలో వచ్చి స్థిరపడ్డటంతో ప్రతాపరుద్రుడు తమిళంలో శాసనం వేయించి ఉంటారని శివనాగిరెడ్డి తెలిపారు. గణపతిదేవుడు నిర్మించిన ఈ ఆలయం మొదట్లో ఇది చెన్నకేశవ దేవర పేరుతో ఉందని, ఈ మేరకు ఓ శాసనం ఉందని చెప్పారు. సుమారు 50 ఏళ్ల కింద ఆలయంలోని విగ్రహం భిన్నంగా ఉందంటూ తొలగించి.. కోదండ రామాలయంగా మార్చారని వెల్లడించారు. తాజా శాసనంలో ఈ ఆలయాన్ని రాజనారాయణ పెరుమాళ్‌గా ప్రస్తావించారని తెలిపారు. అరుదైన ఈ శాసనాన్ని వెలికి తీసి ప్రత్యేకంగా ప్రతిష్టించాల్సి ఉందన్నారు. -
కాపురం గుట్టల్లో కాకతీయ స్థావరం
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు కోటకు ఆవల కాకతీయుల సైనిక రహస్య స్థావరం ఉండేదా? గోదావరి తీరాన చిట్టడివిలో రెండవ ప్రతాపరుద్రుడు శత్రువు గుర్తించని వనదుర్గం కట్టాడా? కాకతీయుల సైన్యాధ్యక్షుడు పోతుగంటి మైలి ఈ సైన్యంతోనే అల్లావుద్దీన్ ఖిల్జి సేనాని మాలిక్ కాఫర్‌పై దాడి చేశాడా?.. యువ చారిత్రక పరిశోధకుడు అరవింద్ ఆర్య పరిశోధనలు అవుననే సమాధానమిస్తున్నాయి. శత్రువుల రాకను ముందే పసిగట్టడానికి కాకతీయులు శత్రు దుర్భేద్యమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ పటిష్టమైన రాతి గోడలు, సైనికులు పహారా కోసం నలువైపులా నిర్మించిన బురుజుల ఆధారాలు లభ్యమయ్యాయి. ముందే పసిగట్టేందుకు.. కాకతీయ సామ్రాజ్యంపై శత్రు రాజుల కన్నెప్పుడూ ఉండేది. ఢిల్లీ సుల్తాన్లు 5 సార్లు కాకతీయ సామ్రాజ్య ఆక్రమణకు దండెత్తారు. ఈ 5 మార్లు సుల్తాన్ల సైన్యం గోదావరి మీదుగానే ప్రయాణం చేసి ఓరుగల్లు రాజ్య ప్రవేశం చేసింది. దీంతో పరాయి సైన్యం రాకను ముందే పసిగట్టి నిలువరించేందుకు రెండవ ప్రతాప రుద్రుడు ఓరుగల్లు కోటకు ఉత్తర దిక్కున 140 కి.మీ దూరంలో కాపురం, వల్లూరు, ప్రతాపగిరి, నందిగామ గొంతెమ్మ గుట్టల మీద రహస్య స్థావరాలు ఏర్పాటు చేసిన చారిత్రక ఆనవాళ్లు వెలుగుచూశాయి. 200 మందికి పైగా సైనికులకు ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచేర్లకు 3 కిలోమీటర్ల దూరంలో కాపురం అనే గ్రామం ఉంది. ఆ ఊరికి కాస్త దూరంలో దట్టమైన అడవిలో మూడు కొండలు కనబడుతుంటాయి. శిల్పి పనిగట్టుకొని ఉలితో చెక్కిన తరహాలో ఈ గుట్టలున్నాయి. ఆ కొండల పైభాగంలో ఆలయం, సహజంగా ఏర్పడ్డ రాతి గోడ, ఆ పక్కనే మానవ నిర్మిత కోట గోడలు, బురుజులు, పెద్ద రాతి స్తంభాలు, కుండ పెంకులు లభ్యమయ్యాయి. వాన నీటి నిల్వ కోసం కొండ పైభాగంలో నాడు నిర్మించుకున్న బావుల లాంటి నిర్మాణాలు నేటి చెక్ డ్యాంలను తలపిస్తాయి. గుట్టల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణాలు, సైనికుల నివాసానికి కొండ మధ్య భాగంలో కుడి, ఎడమ వైపున గుహలున్నాయి. రెండు కొండలను కలుపుతూ సుమారు 500 మీటర్ల మేర సహజ సిద్ధంగా ఏర్పాటైన రాతి గోడ ఉంది. ఈ రెండు గుహలలో 200 మందికి పైగా సైనికులు నివాసం ఉండేందుకు సరిపడేంత స్థలం గుర్తించారు. గరుడ విగ్రహం, సైనిక గుహ ముఖ భాగం మూడంచెల భద్రత రక్షణ కోసం కాకతీయులు శత్రు దుర్భేద్యమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడంచెల్లో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ అత్యంత పటిష్టమైన రాతి గోడలు, సైనికుల పహారా కోసం నలువైపులా బురుజులు ఉన్నాయి. సైనికుల అవసరాల కోసం కొండ పైభాగంలో 1వ, 2వ కోటగోడల మధ్య రెండు చెక్ డ్యాంలను పోలి ఉన్న బావులు నిర్మించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు కొండ మీద పల్లం వైపు రాతి ముక్కలతో గోడ నిర్మించుకున్నారు. సుల్తానులను నిలువరించడానికే కొండ మీద దొరికిన చారిత్రక ఆనవాళ్లు, అక్కడి చుట్టు పక్కల గ్రామాల్లోని జన బాహుళ్యం నుంచి సేకరించిన సాంస్కృతిక ఆనవాళ్ల ఆధారంగా ఇక్క డ కాకతీయుల రహస్య సైనిక స్థావరం ఉందనే అంచనాకు వచ్చాం. గోదావరి నది మీదుగా ఢిల్లీ సుల్తానులు పదే పదే దండెత్తుతుండటంతో కాకతీయులు దీనిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి. – అరవింద్ ఆర్య పరికి, చరిత్ర యువ పరిశోధకుడు సైనిక స్థావరాలు ఉండొచ్చు కొండ మీద దొరికన ఆనవాళ్ల ఆధారంగా ఇక్కడ సైనిక స్థావరాలు ఉండొ చ్చని తెలుస్తోంది. ఇప్పటికీ ఈ ప్రాంతం గురించి సరైన చారిత్రక అవగాహన లేదు. చారిత్రక, సాంస్కృతిక, అజ్ఞాత చరిత్ర ఇక్కడ దాగి ఉంది. పురావస్తు శాఖ అధికారులు పూర్తిగా పరిశోధన చేసి ఈ ప్రాంత చరిత్ర, కట్టడాలను వెలుగులోకి తీసుకురావాలి. – ప్రొఫెసర్ జయధీర్ తిర్మల్‌రావు -
తైక్వాండోలో తళుక్కు
వారికి రెండు కాళ్లు.. రెండు ఆయుధాల లాంటివి. రెప్పపాటు సమయంలో కాళ్లను వేగంగా తిప్పుతూ ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు వినూత్న రీతిలో నైపుణ్యం ప్రదర్శిస్తుంటారు. ఆత్మవిశ్వాసంతో పోటీల్లో నెగ్గుతూ పతకాలు సాధిస్తుంటారు. బాక్సింగ్ తరహాలో కనిపించే తైక్వాండో క్రీడలో రాణిస్తూ దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతున్న విద్యార్థులు, యువ క్రీడాకారులపై కథనం. – వరంగల్ స్పోర్ట్స్ ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతోందనేది ఒకప్పటి మాట. అయితే కరాటేతోపాటు తైక్వాండోతో కూడా శత్రువుల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని చెబుతున్నారు ఓరుగల్లుకు చెందిన పలువురు విద్యార్థులు, క్రీడాకారులు. చేతులను తక్కువగా ఉపయోగిస్తూ కాళ్లతోనే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే సాహస క్రీడగా పేరొందిన తైక్వాండోలో వారు రాణిస్తూ జిల్లాకు పేరు తీసుకొస్తున్నారు. వివరాల్లోకి వెళితే..క్రీస్తు పూర్వం 37వ శతాబ్దంలో కొరియాలోని కుగుర్మో రాజవంశీయులు తైక్వాండో క్రీడకు రూపకల్పన చేసినట్లు చరిత్ర చెబుతోంది. తర్వాత సిల్లా వంశీయులు ఈ క్రీడ అభివృద్ధికి పాటుపడ్డారు. తైక్వాండోలో 90 శాతం కాళ్లు, 10 శాతం చేతులను ఉపయోగించి ప్రత్యర్థుల నుంచి ఆత్మరక్షణ పొందేందుకు నేర్చుకున్న ఆర్మీ అధికారులకు కొరియా దేశం ప్రోత్సాహం అందించింది. 1980లో ఇండియాలో గుర్తింపు 1973లో మొదటిసారిగా తైక్వాండోను జిమ్మి ఆర్ జగిత్యానిగామ అనే మాస్టర్ వియత్నాం నుంచి వచ్చి భారతదేశానికి Sపరిచయం చేశారు. 1980లో భారత ప్రభుత్వం తైక్వాండోకు అధికారికంగా గుర్తింపు ఇచ్చింది. 1985లో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్‌లో గుర్తింపు లభించింది. ఈ క్రమంలో ప్రతి ఏటా ఎస్జీఎఫ్ఐ, ఆర్జీకేఏ, యూనివర్సిటీ స్థాయిల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆట విధానం 12 మీటర్ల దీర్ఘచతురస్రాకార బోట్లో తైక్వాండో పోటీలను నిర్వహిస్తుంటారు. జాతీయస్థాయి పోటీల్లో మూడు నిమిషాల కాలవ్యవధి.. మూడు రౌండ్లు, రాష్ట్రస్థాయి పోటీల్లో మూడు నిమిషాలు.. రెండు రౌండ్లు, జిల్లాస్థాయి పోటీల్లో రెండు నిమిషాలు.. రెండు రౌండ్లు నిర్వహిస్తుంటారు. మ్యాచ్‌లో ముఖంపై తగిలిన కిక్కు మూడు పాయింట్లు, చాతిపై తగిలితే ఒక పాయింట్, రిబ్స్, పొట్టపై తగిలితే ఒక పాయింట్ ఇస్తారు. అలాగే ప్రత్యేకమైన కొన్ని కిక్‌లపై మూడు లేదా రెండు పాయింట్లు ఇస్తారు. తైక్వాండో పోటీలో ప్రత్యర్థిని గట్టిగా పట్టుకోవడం, నెట్టివేయడం, వెనకవైపు కిక్ చేయడం, ఎరీనా దాటడం లాంటివి చేస్తే మైనస్ పాయింట్లు ఇస్తారు. అఖిల్.. అదర హో యువ క్రీడాకారుడు అఖిల్ తైక్వాండోలో అదరగొడుతున్నాడు. కోచ్‌ల పర్యవేక్షణ లో కఠోర శిక్షణ పొందుతున్న ఆయన రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నాడు. 2014లో చండీఘర్‌లో జరిగిన జాతీయస్థాయి అండర్–17లో బ్రాంజ్, 2015లో హైదరాబాద్‌లో జరిగిన అండర్–19 రాష్ట్ర స్థాయి పోటీల్లో సిల్వర్, దారువాడ్లో జరిగిన రీజినల్ పోటీల్లో కన్సొలేషన్ బహుమతి పొందాడు. వీటితోపాటు ఇప్పటివరకు మూడు రాష్ట్రస్థాయి, రెండు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. పవన్.. మెరిసెన్ మానుకోటకు చెందిన పవన్ తైక్వాండో లో ప్రతిభ కనబరుస్తున్నాడు. పవన్ 2014లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అండర్–17 జాతీయస్థాయి పోటీల్లో, 2015లో గుజరాత్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరి గిన అండర్–19 రాష్ట్ర స్థాయి పోటీల్లో వెండి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. గతంలో ౖహె దరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ పోటీల్లో వెండి, 2014లో ప్రకాశంలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ పోటీల్లో వెండి పతకం సాధించాడు. సత్తాచాటుతున్న సాత్విక తొర్రూరుకు చెందిన సీహెచ్. సాత్వికారెడ్డి తైక్వాండోలో మూడేళ్లుగా శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటుతోంది. 2013లో చండీఘర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీ ల్లో గోల్డ్ మెడల్, 2015లో పంజాబ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సిల్వర్, దారువాడ్లో జరిగిన జాతీయస్థాయిలో బహుమతి సాధించింది. 2012లో కేరళలో పైకా నిర్వహించిన జాతీయస్థాయి, ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో 2013లో జరిగిన జాతీయస్థాయి అండర్–17, 2014లో మహబూబ్‌నగర్ లో జరిగిన అండర్–17 పైకా జాతీయస్థా యి, మధ్యప్రదేశ్‌లో జరిగిన అండర్–19 జాతీయస్థాయి, 2015లో మహారాష్ట్రలో జరిగిన ఎస్జీఎఫ్ఐ జాతీయస్థాయి పోటీలకు హాజరైంది. -
ఓరుగల్లు సందేశానికి 135 ఏళ్లు
1884లోనే సెంటినరీ బాప్టిస్టు చర్చి నిర్మాణం 1956లో కేథ్రడల్ క్రీస్తు మందిరం హన్మకొండ కల్చరల్ : చారిత్రాత్మక ఓరుగల్లుకు సువార్త సందేశం చేరి 135 ఏళ్లు అవుతోంది. ఎందరో మిషనరీ గురువులు తమ జీవితాలను త్యాగం చేసి సువార్త సందేశాన్ని మోసుకొచ్చి ఇక్కడ బీజం వేశారు. భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడి ప్రజల మత సామాజి క విషయాల్లో జోక్యం చేసుకోవద్దనే నిబంధనను పాటిస్తూ వచ్చిం ది. అయితే, 1813లో కొత్త చార్టర్ సిద్ధం చేస్తున్న సమయం లో డాక్టర్ విలియమ్ కేరీ స్పూర్తితో ఎవాంగ్లికన్స్ మత వ్యా ప్తికి ఇంగ్లాండ్ పార్లమెంట్లో చట్టంలో మార్పులు తీసుకొ చ్చారు. దీంతో క్రైస్తవ మిషనరీలు తమ సేవలను ప్రారంభిం చాయి. 1835లో అమెరికాలోని వర్జినీయాలో బాప్టిస్ట్ మిషన రీ కన్వెన్షన్ జరిగినప్పుడు తెలుగు ప్రాంతాల్లో సువార్త ప్రచా రం చేయాలని నిర్ణయించి రెవరెండ్ ఎస్ఎస్ డే దంపతులను ఇందుకోసం నియమించారు. 1836లోనే రెవరెండ్ ఎస్ఎస్ డే హన్మకొండను సందర్శించి క్రీస్తు విత్తు నాటడానికి సరైన స్థలంగా భావించారట. కానీ ఆయన విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరులో కొంతకాలం ఉండి 1845లో అమెరికా తిరిగి వెళ్లిపోయారు. హైదరాబాద్ స్టేట్‌లో రెవరెండ్ డబ్ల్యూడబ్ల్యూ క్యాంప్‌బెల్ 1875లో మిషనరీ స్థాపించారు. అయితే, నల్లగొండ తదితర దూరప్రాంతాలకు వెళ్లడానికి ఆయనకు సహాయకులు అవసరం కావడంతో 1878లో ఒంగోలులో పనిచేస్తున్న రెవరెండ్ ఆల్బర్ట్ లారిడ్జ్ను పిలిపించుకున్నారు. కొందరు సహాయకులతో కలిసి 1879 జనవరి 11న హన్మకొండలోని కోర్టు వెనుక ఉన్న ఓ ఇంట్లో మిషనరీని స్థాపిం చారు. లారిడ్జ్కు తోడుగా ఆత్మకూరి రంగయ్య, బెజవాడ ఆంబ్రొసు, దళవాయి నారయ్య, కలపాల నర్సయ్య, దీనమ్మ పనిచేశారు. రెవరెండ్ ఆల్బర్ట్ లారిడ్జ్ సతీమణి ఎలిజెబెత్, దీనయ్య కలిసి స్త్రీల సమాజం ఏర్పాటు చేశారు. ఒంగోలులో ఇంజనీర్‌గా పనిచేస్తున్నప్పుడే రెవరెండ్ ఆల్బర్ట్ లారిడ్జ్ తెలు గు నేర్చుకోవడంతో ఇక్కడి ప్రజలతో కలిసి మాట్లాడటం సులభమైంది. ‘నిజాం’ అనుమతితో చర్చి నిర్మాణం హన్మకొండలో ఏర్పాటుచేసిన మిషనరీస్ ద్వారా హన్మకొండతో పాటు బీమారం,వడ్డేపల్లి, గుండ్లసింగారంలో సువార్త ప్రచారం చేశారు. హన్మకొండ లష్కర్ బజారులో ప్రెంచ్, బ్రిటీష్ సైనిక నివాసాలు ఉండడంతో రెవరెండ్ ఆల్బర్ట్ లారిడ్జ్ ఇదే సరైన ప్రదేశమని భావించారు. ఇక నిజాం ప్రభు త్వ అనుమతితో 1880 జనవరి 4న చర్చి నిర్మాణానికి పూనుకోగా 1884 లో సెంటినరీ బాప్టిస్టు చర్చి నిర్మా ణం పూర్తయింది. ఆ తర్వాత భార్య ఎలి జబెత్ అనారోగ్యం కారణంగా లారిడ్జ్ తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత 1844 నుంచి 1886 వరకు రెవరెండ్ ఆల్ఫ్రెడ్ ఆగస్టస్ న్యూహాల్, 1886 నుంచి 1891 వరకు రెవరెండ్ రేమండ్ మెప్లీస్టన్, 1891 నుంచి1893 వరకు రెవరెండ్ థామస్ పార్కర్ డడ్లీ, 1893 నుంచి 1897 వరకు రెవరెండ్ ఆత్మకూరి రంగయ్య, 1897 నుంచి 1898 వరకు దలవాయి నారయ్య, 1898 నుంచి 1901వరకుచావలి ఆంధ్రయ్య, 1901 నుండి 1902 వరకు రెవరెండ్ వేసపోగు జాన్, ఆ తర్వాత రెవరెండ్ దాసరి ప్రసంగి, వేసపోగు ఆంబ్రోసు, జేడీ.ఎడ్వర్డ్, రెవరెండ్ ఎంఎస్ఎం.రామానుజులు, రెవరెండ్ వీఆర్.దేవదాసు, రెవరెండ్ రూబెన్ తదితరులు బాప్టిస్టు మిషన్పురోగతికితోడ్పడ్డారు. అనంతరం మిషన్ కార్యకలాపాలు విస్తరణకు నోచుకున్నాయి. బాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్, సండే స్కూల్, విలి యంకేరి బాప్టిస్టు స్కూల్, వికలాంగుల కోసం రీచ్, బ్లైండ్స్కూల్ వంటివి ఏర్పాటు చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, చర్చికి వస్తున్న ఆరాధకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో జేడీ.ప్రసాద్ అధ్యక్షతన ఉన్న సంఘ కార్య నిర్వాహక కమిటీ 15వందల మంది ఒకేసారి ప్రార్థన చేసుకునేలా మరో పెద్ద చర్చి భవనం నిర్మించాలని తలపెట్టారు. చాడా పురుషోత్తంరెడ్డి డిజైన్ చేసిన ప్రస్తుత సెంటినరీ బాప్టిస్టు చర్చి నిర్మాణానికి 1991లో భూమిపూజ చేయగా 2005లో నిర్మా ణం పూర్తయింది. ప్రస్తుతం పాస్టర్‌గా రెవరెండ్ డాక్టర్ నిరంజన్‌బాబు పాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫాతిమా కేథ్రడల్ చర్చి.. వరంగల్ జిల్లా కాజీపేటలో ఉన్న రోమన్ కేథ్రడల్ క్రీస్తు మందిర నిర్మాణానికి బిషప్ బెరట్టా 1956లో శంకుస్థాపన చేశారు. బ్రదర్ సారా ఈ చర్చికి కేథ్రడల్ గౌరవాన్ని కల్పించగా ఫాతిమా చర్చిగా పేరుపొందింది. ఈ చర్చి కారణంగానే ఈ ప్రాంతానికి ఫాతిమానగర్‌గా పిలుస్తున్నారు. ఇటలీ నిర్మాణశైలిలో ఎర్రని రంగురాయితో నిర్మించబడిన ఈ ర్చిలో విశాలపైన ప్రార్థనా వేదిక.. ఎదురుగా జీసెస్, మేరీ, జోసఫ్ విగ్రహాలు ఉంటాయి. నాలుగు ప్రక్కలా అమర్చబడిన రంగురంగుల అద్దాలు సూర్యరశ్మి సోకినంతనే శోభాయమానంగా రంగులు వెదజల్లుతాయి. చర్చి పైభాగంలో అమర్చబడిన శిలువ చాలా దూరం నుండి కూడా కనిపిస్తుంది. చర్చి భవనం లోపలి భాగంలో పైన జీసస్ విగ్రహం, కుడివైపు మరియామాత విగ్రహం, ఎడమ దిక్కు భాగంలో క్రీస్తు విశేషాలు కనిపిస్తాయి. -
ఓరుగల్లులో టెక్స్టైల్ పార్క్
* కాకతీయుల కీర్తిని దేశానికి చాటేలా ఉత్సవాలు * వరంగల్ జిల్లా సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశంలోనే అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో వరంగల్‌లో టెక్స్టైల్ పార్కును నెలకొల్పుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కాకతీయ ఉత్సవాలను వరంగల్ జిల్లాకే పరిమితం చేయకుండా.. కాకతీయుల ఘనకీర్తిని దేశ ప్రజలకు చాటేలా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మామునూరు ఎయిర్‌పోర్టులో రాకపోకలకు అనుగుణంగా ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రాజధాని తర్వాత పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం వరంగల్‌లో పర్యటించారు. నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. రింగ్‌రోడ్డు, రహదారుల నిర్మాణం, టెక్స్టైల్ పార్కుకు అనువైన స్థలం కోసం వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ధర్మసాగర్ మండలం దేవనూరు సమీపంలోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అంతకుముందు ప్రతిపాదిత టెక్స్టైల్ పార్క్, కాకతీయ ఉత్సవాల నిర్వహణ, వరంగల్ నగర అభివృద్ధి అంశాలపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల నుంచి సూచనలు, అభిప్రాయాలు తీసుకున్నారు. స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, మంత్రులు ఎ.చందూలాల్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ జి.కిషన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలివీ.. * వేల చెరువులు నిర్మించి అందరికీ అన్నం పెడుతున్న కాకతీయ సామ్రాజ్యపు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేంత ఘనంగా కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలి. ఫిబ్రవరి లేదా మార్చిలో ఉత్సవాలు జరపాలి. ఎన్ఆర్ఐలను భాగస్వాములను చేసేందుకు తెలంగాణ ప్రవాసీ దివస్, వైబ్రంట్ తెలంగాణ వంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ ఉత్సవాలు వరంగల్‌కే పరిమితం కావొద్దు. తెలంగాణ పది జిల్లాల్లో ఉత్సవాలు జరపాలి. గోల్కొండ కోట కట్టింది కాకతీయులే. అక్కడా కాకతీయుల ఉత్సవాలు జరపాలి. లక్నవరం, రామప్ప, ఘనపురం, పాకాల వంటి చెరువులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. కాకతీయ ఉత్సవాల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలి. * కాకతీయ ఉత్సవాలకు బస్తర్‌లో ఉన్న కాకతీయుల వారసులు కమల్‌చంద్ర బంజ్దేవ్ను అధికారికంగా ఆహ్వానించాలి. పేరిణి నృత్యానికి పూర్వ వైభవం తేవాలి. మైసూర్లో దసరా ఉత్సవాలు నిర్వహించినట్లే కాకతీయ ఉత్సవాలు జరపాలి. ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకరోజు వరంగల్‌లోనే ఉండాలి. * పార్లమెంట్లో ఝాన్సీరాణి ఫొటో ఉన్నట్లే రాణి రుద్రమదేవి ఫొటో ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం. పోతన, పాల్కురికి సోమనాథ ఉత్సవాలు నిర్వహిస్తాం. బమ్మెరలోని పోతన దున్నిన నాలుగు ఎకరాల స్థలంలో స్మారక కట్టడం ఏర్పాటు చేస్తాం. * కాకతీయులు అందించిన చెరువులను పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ కార్యక్రమం చేపడుతున్నాం. ఎస్సారెస్పీ, దేవాదుల, కంతనపల్లి వంటి ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపే సాధ్యాసాధ్యాలపై నీటి పారుదల శాఖాధికారులు అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలి. హన్మకొండలోని వడ్డేపల్లి చెరువు వద్ద మిషన్ కాకతీయ పైలాన్ ఏర్పాటు చేస్తాం. * వరంగల్‌లో అత్యున్నత నాణ్యత ప్రమాణాల తో టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తాం. సూరత్‌లో దొరికే చీరలు, షర్ట్, సల్వార్ మెటీరియల్, తిర్పూర్‌లో దొరికే రెడీమేడ్ వస్తువులు, షోలాపూర్‌లో లభ్యమయ్యే చద్దర్లు అన్ని ఒకేచోట లభ్యమయ్యేలా వరంగల్ టెక్స్టైల్ పార్కును నెలకొల్పాలి. టెక్స్టైల్ పార్కులో తయారైన వస్తువుల మార్కెటిం గ్‌కు సదుపాయాలు కల్పించాలి. పరిశ్రమకు అనుబంధంగా టౌన్షిప్ డెవలప్ చేయాలి. * హైదరాబాద్ ఇప్పటికే కిక్కిరిసిపోయింది. కొత్తగా వచ్చే యూనివర్సిటీలు, సంస్థలు, ఐటీ కంపెనీలను వరంగల్‌కు తరలిస్తాం. వరంగల్ నగర జనాభా కొద్ది సంవత్సరాల్లోనే రెట్టింపవుతుంది. 20 లక్షల జనాభా జీవనం సాగించడానికి అనువుగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలి. నిరసనలు.. అరెస్టుల నడుమ పర్యటన ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా పర్యటన నిరసనలు, అరెస్టుల మధ్య కొనసాగింది. పోలీసులు పలువురు నేతలు, సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. మరికొందరిని పోలీస్స్టేషన్లకు తరలించి... సీఎం హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. కేసీఆర్ రాకకు ముందే హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డితోపాటు ఇతర నాయకులను గృహ నిర్భం ధం చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు విద్యాసాగర్, టీపీసీసీ మీడియా సెల్ కన్వీనర్ ఈవీ శ్రీనివాసరావు తదితరులను అరెస్టు చేసి హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హన్మకొండలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ఏఐటీయూసీ నాయకుడు వరద రాజేశ్వర్‌రావును అరెస్టు చేశారు. కాగా ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయూలని ఏబీవీపీ విద్యార్థులు సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. హన్మకొండ హంట ర్రోడ్డులోని కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి చేరుకున్న సీఎంను కలుసుకునేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో టీఆర్ఎస్ మహిళా నేతలు పలువురు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన ఐకేపీ వీఓఏలను పోలీసులు అడ్డుకున్నారు. -
1,00,859 వితంతు పింఛన్ లబ్ధిదారులు
రాష్ట్రంలో 6 శాతం.... వరంగల్‌లో 11 శాతం జిల్లాలోని మహిళా జనాభా లెక్కన రాష్ట్రంలో ప్రథమ స్థానం ఆందోళన కలిగిస్తున్న మూడు పదుల్లోపే వైదవ్యం... ఓరుగల్లు మహిళలకు ఒక్కో రంగంలో ఒక్కో చరిత్ర ఉంది. ఉద్యమం.. రాజకీయ నేపథ్యంలో వారిది ప్రత్యేక శైలి. కానీ.. ఇదే గడ్డపై దిగ్భ్రాంతికరమైన విషయం కూడా ఉంది.. అదేమిటంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వితంతువులు జిల్లాలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మూడు పదుల వయసు దాటకుండానే వారిని వైదవ్యం వెక్కిరిస్తోంది. జిల్లాలో 11 శాతం వితంతువులు ఉన్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. రాష్ట్రంలో సగటున 6 శాతం వితంతువులు ఉంటే.. జిల్లాలో మాత్రం ఆ సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది. దీనికి కారణాల పలు రకాలు ఉన్నప్పటికీ.. ముఖ్యమైన కారణం మాత్రం మద్యం మహమ్మారేనని జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు మాత్రం పెద్దగా లేవని చెప్పొచ్చు. భర్త మరణించిన వారు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసి చేతులు దులుపుకుంటే చాలదు. మూలాల్లోకి వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే మూడు పదుల్లోపే వైధవ్యం పొందుతున్న విషయంలో మన అపఖ్యాతి మరింత విస్తరించే ప్రమాదం లేకపోలేదు. పింఛన్లలో... ప్రభుత్వం అందజేసే సామాజిక భద్రతా పింఛన్లు(ఎస్ఎస్పీ) పొందుతున్న వితంతువుల సంఖ్య జిల్లాలో లక్ష దాటింది. 10 జిల్లాల్లో వితంతు పింఛన్లు పొందుతున్న వారిలో సంఖ్యాపరంగా జిల్లా రెండో స్థానంలో నిలుస్తోంది. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా మనకన్నా కాస్త ముం దుంది. అయితే అన్ని వర్గాల వారిని ఆందోళనకు గురిచేస్తున్న ఈ విష యం ప్రస్తుతం కొత్త పింఛన్ల పంపిణీతో రాష్ట్రస్థాయిలో చర్చకు వస్తోంది. జిల్లాలో అత్యధికంగా వితంతువులు ఉండటంపై పలు స్వచ్ఛంద సంస్థలు పలుమార్లు సర్వేలు కూడా నిర్వహించాయి. కబళిస్తున్న గుడుంబా.. 2009లో డీఆర్డీఏతోపాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు జిల్లాలో ప్రత్యేకంగా వితంతువుల విషయంలో సర్వే చేశాయి. ఇందలో గుడుంబా మరణాలే ఎక్కువ మందిని వితంతువులను చేశాయని సర్వేలు నిర్ధారించా యి. సర్వే లెక్కలో గుర్తిస్తున్న భయంకర నిజాల ఆధారంగా నివారణ చర్యలు తీసుకోవడంలో మాత్రం ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితిలో మార్పు రావడంలేదనే విమర్శ వినిపిస్తోంది. కాగా, జిల్లాలో ప్రభుత్వ పింఛన్లు 4,45,030 ఉండగా.. అందులో 1,00,859 మంది వితం తు పింఛన్‌దారులు ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో మొత్తం పింఛన్లు 4,41,603 ఉండగా.. వితంతు పింఛన్లు 1,02,259 ఉన్నాయి. నా కుటుంబం వీధిన పడింది.. ఈమె పేరు బి.స్వరూప. వయసు 28 ఏళ్లు. హన్మకొండ మండలం వడ్డేపల్లి. భర్త సంజీవ్ ఆటోనడుపు తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఒక బాబు, పాప. సంతోషంగా సాగుతున్న కుటుం బంలో మద్యం మహమ్మారి చిచ్చుపెట్టింది. తాగుడుకు బానిసై కొంతకాలానికి భర్త అనారోగ్యంతో చనిపోయాడు. భర్త మరణంతో కుటుంబం వీధిన పడింది. పిల్లల పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగిళ్లలో పాకి పనిచేసి పిల్లల్ని చదివిస్తోంది. ఇప్పటికి 20 సార్లు వితంతు పింఛన్ కోసం అర్జీ పెట్టుకున్నా అధికారులకు స్వరూప దీన స్థితిపై జాలి కలగలేదు. ఇటీవల ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోమంటే.. తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటోంది. ఎక్కువగా ఉన్న మండలాలు మండలం పేరు వితంతు పింఛన్లు మొత్తం పింఛన్లు మహబూబాబాద్ 3,104 11,292 మరిపెడ 2,962 11,077 స్టేషన్‌ఘన్‌పూర్ 2,939 13,056 పరకాల 2,667 13,441 కురవి 2,594 9,881 ఆత్మకూరు 2,416 10,580 వర్ధన్నపేట 2,382 8,868 హన్మకొండ 2,346 7,951 హసన్‌పర్తి 2,298 8,567 ధర్మసాగర్ 2,236 10,068 -
మైలసంత
ఓరుగల్లు, క్రీ.శ. 1300 ఆ రోజు ముఖ్య సమావేశం. బాహత్తర నియోగాధిపతి (చీఫ్ సెక్రటరీ) పిలుపు అందుకోగానే అన్ని శాఖల అధిపతులతో పాటుగా హడావుడిగా రాతికోటలోని సభామంటపం చేరాడు దండనాయకుడు (పోలీస్ కమిషనర్) సింగమనాయుడు. ఇంకా సమావేశం మొదలవలేదు. అధికారులంతా ముఖమండపంలో ఎదురు చూస్తున్నారు.‘ఎందుకో అత్యవసర సమావేశం?’ మండపంలో కూర్చొని వున్న గజసాహిణి గోన విఠలరెడ్డిని అడిగాడు సింగమనాయుడు. గోన విఠలరెడ్డి వర్ధమానపురం రాజు. కాకతీయుల అపారమైన గజసైన్యానికి నాయకుడు. ‘ఏముందప్పా? నూటికి ముప్పై కప్పంగా కట్టినా భాండాగారం వట్టిపోయిందని ఒకటే గొడవ. అంబయ్యదేవుడిని ఓడించాక ఖజానాలో చేరిన నలభై కోట్లు కోటగోడ మరమ్మతుకే సరిపోయాయట. నాయకుల కప్పాలు, భూములపైన ఆదాయం, వాణిజ్యపన్నులూ అన్నీ కలిపి ఈసారి ఎనభై కోట్లే వచ్చాయట. అవి వీరభటుల బత్యాలు, నవలక్ష ధనుర్థారులకే చాలడంలేదు. ఇక వాళ్లని కూడా గ్రామాలనికి తోలి నాయంకరాలకి పంచాలని అయ్యగారి ఉద్దేశ్యం. వడ్డమాను ఆదాయమంతా ఆరువేల ఏనుగుల్ని మేపడానికే చాలదు. ఇక వీళ్లు కూడా మా పైనబడితే మా రాజ్యాల్లో ఏమీ మిగలదు’ అన్నాడు గోన విఠలరెడ్డి. ఇంతలో రొప్పుకుంటూ వచ్చిన తలారి సాంబడు ‘దన్నాయకులు సింగప్రభువులకి దండాలు. మైలసంతలో దిక్కులేని శవం పడి ఉందట’ అన్నాడు. సింగమనాయుడు ఉలిక్కిపడ్డాడు. ‘ఎన్నడూ లేనిది ఇదేం ఉపద్రవం?’ అనుకుంటూ హుటాహుటిగా బయల్దేరాడు. ఓరుగల్లు కోట బయట వందల కొలదీ అంగళ్లతో దేశవిదేశాల వర్తకులతో ప్రతి మంగళవారం మైలసంత జరుగుతుంది. ఆ సంత నుంచి ప్రభుత్వానికి సుంకాల ద్వారా వచ్చే ఆదాయమే సాలుకి మూడుకోట్లు, పటిష్టమైన రక్షణ వ్యవస్థ మధ్య ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకి తావులేదు. మరి ఇది ఎలా జరిగినట్టు? నూనె అంగళ్ల మధ్య భటులు కట్టిన దడి మధ్యలో బోర్లా పడివున్న శవం. కంసాలి వేషంలో వచ్చిన గజదొంగ కన్నప్పది. చుట్టూ పరికించి చూశాడు సింగమనాయుడు. దుకాణాలలో లావాదేవీలు మామూలుగానే జరుగుతున్నాయి. చోద్యానికి వచ్చిన జనాలు భటులు కలుగచేసుకోవడంతో దూరంగా పారిపోయారు. ‘చచ్చినవాడు కంసాలివాడట. అక్కలవీధిలో విడిది. శవం అప్పటికే నీలిరంగు తిరిగి ఉంది. అంటే హత్య జరిగి చాలాసేపే అయింది. బహుశా నిన్న సాయంత్రమే మరణించి ఉంటాడు’ వివరించాడు తలారి సాంబడు. ‘కావలి భటులకి వివరాలు చెప్పకుండా ఊరు దాటడం సాధ్యం కాదు. అలాంటప్పుడు అతడు కోటదాటి బయటకి ఎలా వచ్చినట్లు? ‘అక్కలవీధిలో విచారిస్తే తెలుస్తుంది!’ ‘ఊ! శవాన్ని గోళకీమఠానికి శవపరీక్షకి పంపండి’ అని తలారి భటులకి ఆదేశమిచ్చి కోటవైపు కదిలాడు సింగమనాయుడు. సంతలో విపరీతమైన రద్దీ. తమలపాకులు, టెంకాయలు, నువ్వులు, గోధుమలు, ఆవాలు, పెసలు, వడ్లు, ఉప్పు, బెల్లం, మిరియాలు, పసుపు, ఉల్లి, అల్లం... ప్రతిదానికి ప్రత్యేకమైన అంగళ్లు. గంపలో గాజుబుడ్లతో ‘సంపెంగనూనె...’ అని అరుస్తూ గుర్రానికి అడ్డం వచ్చిన మాలపిల్లని అదిలించి వేగంగా ముందుకి కదిలాడు సింగమనాయుడు. పట్టుబట్టల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. కాకతమ్మ బోనాల పండుగ ఇంకా ఎన్నాళ్లో లేదు. అక్కసాలెవాడ వద్ద దండాలు పెడుతూ ఎదురొచ్చాడు సుంకాధికారి. చుట్టూ ఉన్న తగరం, సీసం, రాగి, ఇనుము కర్మాగారాల ఠంగుఠంగనే సుత్తుల శబ్దంలో అతడు చెప్పేది వినపడక గుర్రం దిగాడు సింగమనాయుడు. ‘ఏమిటి సంగతి?’ ‘ఏముంది ప్రభూ! ఈ సాలు మిరియాలపై సుంకం పదోవంతు కూడా రాలేదు. అంటే బొక్కసానికి ముప్పైలక్షలు నష్టం. ఏమైందని మన కరణాలని అడిగితే అమ్మకాలే లేవంటారు. పన్ను కట్టాల్సిందే అని పట్టుబడితే ఈ వర్తకులు తీర్పరుల సభక్తి (ట్రిబ్యునల్) వ్యాజ్యం తెచ్చారు’ ‘మిరియాల చారు లేకుండా ముద్ద దిగని మన ప్రజలు ఉప్పూకారాలు మానేసే వ్రతం పట్టారా ఏమిటి? ఊహ్. మీ తిప్పలు మీరు పడండి. నా తిప్పలు నాకున్నాయి. సంతలో ఎవరో కంసాలిని హత్య చేశారు. బంగారం కోసమై ఉండొచ్చు. దొంగసొమ్ము కొనేవాళ్ల మీద కాస్త నిఘా పెట్టండి. ఎవరిపైనన్నా అనుమానం వస్తే వెంటనే తలారికి తెలియపర్చండి.’ ‘చిత్తం ప్రభూ’ అని సెలవు తీసుకున్నాడు సుంకాధికారి. పూటకూళ్లింట్లో కన్నప్ప అద్దెగదిని చూపిస్తూ ‘ఇదే గది. పాపం అబ్బాయి మంచివాడే! వచ్చి వారమైంది. ఎవరితోనూ గొడవలేదు’ అంటూ మారుతాళంతో తలుపు తెరిచింది పూటకూళ్ల సీతక్క. గది చక్కగా సర్దినట్లుంది. దానిని పరిశీలించే పని తలారి సాంబడికి అప్పజెప్పి ‘వ్యాపారం కోసం ఎవరెవరిని కలిసాతో తెలుసా? అతడి కొరకు వచ్చినవాళ్ల వివరాలేమైనా ఉన్నాయా?’ సీతక్కని అడిగాడు సింగమనాయుడు. ‘అతడి కోసం ఎవరూ రాలేదు. కాని నాలుగురోజుల క్రితం అనుమయ్యశెట్టిని పరిచయం చేయమని కోరితే నేనే చేశాను’ ‘కంసాలికి జొన్నల వ్యాపారితో ఏంపని?’ ‘అతడి వద్ద నగలేవో బేరానికి పెట్టాలని.’ ఇంతలో ‘అయ్యా! తమరిది చూడాలి’ గదిలోంచి కేకపెట్టాడు సాంబడు. సంచిలో నల్లబట్టల మధ్య చోరవృత్తికి కావాల్సిన పరికరాలు. ‘ఇతడు కంసాలి కాదు. దొంగ’ అన్నాడు తలారి సాంబడు. ‘అంటే, వీడు అనుమయ్యశెట్టి ఇంటికి కన్నం వేయటానికి పథకం వేశాడా? ఆ మూడో గోనెసంచి విప్పండి. అందులో ఏముందో?’ అన్నాడు సింగమనాయుడు. విప్పారు. జొన్నలు. గోనెసంచి మీద నీలిరంగు ముద్ర ఉంది. అనుమయ్యశెట్టిది. మూతివిప్పి తలకిందులు చేశాడు. జలజలమని రాలే జొన్నల మధ్య మరో మూట. సంచిలో సంచి! మూటవిప్పాడు సింగమనాయుడు. నల్లబంగారం! ‘పదండి. వెంటనే అనుమయ్యశెట్టి కోష్టాలు పరిశీలించాలి. సాంబయ్యా.. నువ్వు వెంటనే సుంకాధికారి మల్లన్నని అక్కడికి తోడ్కొనిరా’ అంటూ బయలుదేరాడు దండనాయకుడు సింగమనాయుడు. తీర్పరుల ధర్మాసనం ముందు పొగడదండతో దోషిగా నిలబడ్డాడు అనుమయ్య. సామాన్యుల ఆహారమైన జొన్నలపై కాకతీయ రాజ్యంలో సుంకంలేదు. ధనికులు తినే వడ్లూ, గోధుమలూ, ఇతర దినుసులపై సుంకం మాడబడివీసం- అంటే 16వ వంతు. సుగంధద్రవ్యాలు, హస్తకళ సామాగ్రులపై మాడబడిచిన్నం- అంటే 8వ వంతు. కానీ నల్లబంగారమనే మిరియాలపై మాత్రం అత్యధికంగా మాడబడిపణం- అంటే సగం. ‘గత పది నెలలుగా జొన్నల సంచులలో మిరియాలు తేవటం ద్వారా అనుమయ్య ఎగవేసిన సుంకం ముప్పైలక్షల మాడలకి పైబడే’ అంటూ నేరాన్ని వివరించాడు వడ్ల వ్యవహారి (ప్రాసిక్యూటర్). శెట్టి ఆస్తిపాస్తులు జప్తు చేసి అతడి వద్ద కొనగోళ్లు చేసిన అంగళ్లపై మడిగసుంకం (అంగడిపన్ను) రెండు రెట్లు పెంచాల్సిందిగా సుంకాధికారికి ఆదేశాలిచ్చాడు మైలసంత తీర్పరి. ‘రహస్యం తెలుసుకొని బెదిరించి డబ్బు గుంజేందుకు వచ్చిన కన్నప్పని హత్య చేయించినందుకు, నిందితునికి తగిన శిక్ష విధించేందుకు దండ న్యాయస్థానానికి అప్పగించడమైనది’ అంటూ లేచాడు తీర్పరి. అంతా ఎటువాళ్లటు వెళ్లిపోయారు. సింగమనాయుడికి కన్నప్ప గుర్తొచ్చాడు. పాపం దొంగకన్నప్ప! వచ్చింది దొంగతనానికే అయినా వీడి వల్ల ఇంటిదొంగలు బయటపడ్డారు అనుకుంటూ ఇంటిదారి పట్టాడు సింగమనాయుడు. లోటు బడ్జెట్ కాకతీయ సామ్రాజ్యం ఒక ఫెడరల్ వ్యవస్థ. మధ్యయుగం ఆరంభంలోనే కే ంద్రీకృత ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. రాజ్యం నాడులు, విషయాలుగా విభజింపబడి, అవి సామంతరాజుల చేతుల్లో ఉండేవి. వాళ్లు అవకాశం వచ్చినప్పుడల్లా తిరుగుబాటు చేసేవారు. ఆ పరిస్థితుల్లో ఓరుగల్లు చక్రవర్తికి కుడిభుజాలుగా నిలిచిన గోన, మల్యాల, చెరకు, రేచర్ల నాయకులు ఆంధ్రసామ్రాజ్యం ముక్కచెక్కలు కాకుండా కాపాడారు. కాని కుట్రలూ కుతంత్రాలూ సాగేవి. నేడో రేపో తెగబడేందుకు ఢిల్లీలో పొంచి ఉన్న ముస్లిం సైన్యాల భయం ఒకటి. దాంతో రాజధాని రక్షణ అత్యంత కీలకమై ఏడు ప్రాకారాలతో ఓరుగల్లు కోట నిర్మించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ శత్రుదుర్భేధ్యం చేయక తప్పలేదు. చక్రవర్తి రక్షణకై నవలక్ష ధనుర్థారులతో మూలబలాన్ని పోషించారు. యుద్ధసమయంలో సామంతుల సైన్యాలు చక్రవర్తికి సహాయపడేవి. ప్రతాపరుద్రీయం, సిద్ధేశ్వరచరిత్ర అనే గ్రంథాల్లో కనిపించే కాకతీయ సామ్రాజ్యపు ఆదాయ వ్యయాల (పక్కన ఉన్న) పట్టిక చూస్తే ఆనాటి ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థమవుతుంది. వ్యయం ఆదాయం (ప్రతాపాలు = రూపాయలు) చక్రవర్తి తులాభారం 3.5 కోట్లు చక్రవర్తి నిత్యవైభవాలకి 3.6 కోట్లు జీతాలు నవలక్ష ధనుర్ధారులకి 38 కోట్లు జీతాలు ఇతరులు, రక్షకభటులు 50 కోట్లు సత్రాలు 1 లక్ష బ్రాహ్మణులకి దానాలు 1.3 కోట్లు అంతఃపురం, ద్వారపాలకులకు 3.8 కోట్లు గుర్రాలు, ఏనుగులు 2.5 కోట్లు ఆలయానికి మఠాలకి(వ రంగల్లు) 1 కోటి రాజగృహాల నిర్మాణం 1 కోటి సామంతుల కప్పం 24 కోట్లు భూములనుండి ఆదాయం 20 కోట్లు వాణిజ్య సుంకాలు 44 కోట్లు మొత్తం 88 కోట్లు లోటు 16 కోట్లు మొత్తం 104 కోట్లు 104 కోట్లు అంటే అదొక లోటు బడ్జెట్! చక్రవర్తి ఆదాయం రక్షణ వ్యవస్థకే చాలేది కాదు. ఆదాయం పెంచేందుకు పన్నులు వసూలు చేసే వ్యవస్థని పటిష్టం చేశారు. సామంతులు కూడా సైన్యపు భారాన్ని మోసేందుకు వ్యవసాయాభివృద్ధికై చెరువులు, కాలువలు తవ్వించారు. వాణి జ్యానికి ప్రోత్సాహం లభించింది. వాణిజ్యాన్ని నియమితం చేసేందుకు ప్రతి పట్టణంలో రెండు రకాల సంతలను ప్రభుత్వమే నిర్వహించేది. పట్టణం మధ్యలో మడిసంత, ఊరి వెలుపల మైలసంతలను నిర్వహించారు. వరంగల్‌లోని ఖాన్సాహెబ్తోట ప్రాంతంలో ఒకప్పటి మైలసంత ఉండేది. ఆ సంతలో అమ్మిన వస్తువులూ వాటిపై పన్నుల వివరాలు కూడా అక్కడి శాసనంలో దొరుకుతాయి. కోటలో సుంకాల వల్ల ధరలు ఎక్కువ. అయితే మైలసంతలో తక్కువ పన్నుతో ఉత్పత్తిదారులే స్వయంగా అమ్ముకునే అవకాశం ఉండేది నేటి రైతుబజార్లలా! అయితే ప్రతాపరుద్రుని కాలానికి సామంతులపై కప్పం భారం విపరీతంగా పెరిగింది. 72 శాఖల అధికారుల జీతాలకి బదులుగా, రాజ్యాన్ని 72 నాయంకరాలుగా విభజించి వారికి పన్నుల వసూలు, సైన్యాన్ని పోషించడం వంటి బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారిలో వెలమలు ఎక్కువ. అది ముందు నుంచీ కాకతీయుల ధ్వజం పట్టి సామ్రాజ్యాన్ని కాపాడిన సామంతుల కన్నెర్రకి కారణమైంది. ఇదే తరువాతి యుగంలో వెలమల, రెడ్ల మధ్య వైరానికి దారితీసింది. - సాయి పాపినేని ఫోన్: +91 9845034442 -
కోటలోనే ఎగిరిన జెండా
హన్మకొండ కల్చరల్ : నిజాం రాష్ట్రంలో మొదటిసారిగా త్రివర్ణపతాకం ఎగిరింది వరంగల్ కోటలోనే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి పంద్రాగస్టు వేడుకలు కూడా కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లులోనే కావడం విశేషం. దేశ స్వాతంత్రోద్యమంలో భాగంగా 1944లో వరంగల్‌లో సర్వోదయ సంఘం స్థాపించబడింది. ఆనాటి పరిస్థితులను బట్టి ప్రతివారం వరంగల్ కోటలోనూ, స్థంభంపల్లిలోనూ, త్రివర్ణ పతాకం ఎగురవేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతవరకు హైదరాబాద్ సంస్థానంలోని ఏ ప్రాంతంలో కూడా జెండావందనం బహిరంగంగా జరగలేదు. ఈ మేరకు ఎమ్మెస్ రాజలింగం, హయగ్రీవాచారి, సంగరంబోయిన కనకయ్య, మల్లయ్య, దుగ్గిశెట్టి వెంకటయ్య, సుదర్శన్, బి.రంగనాయకులు, వి.గోవిందరావు, బత్తిని రామస్వామి, బత్తిని మొగిలయ్య అధ్వర్యంలో 1944 నుంచి జెండావందనాలు జరుగుతూ వచ్చాయి. ఆవిధంగా మొదటిసారి జెండా వందనం వరంగల్ కోట నుంచే ప్రారంభం కావడం మన జిల్లాకు గర్వకారణం. ప్రతీ వారం నిజాం వ్యతిరేకపోరాటంలో యువకులను ఉత్తేజితులను చేస్తూ వరుసగా త్రివర్ణపతాకావిష్కరణలు జరిగాయి. అందులో భాగంగానే బత్తిని రామస్వామి ఇంటిముందు ఆవరణలో 1946 అగస్టు 11వ తేదీన జెండా వందనం జరిగింది. మొగిలయ్య కూడా అందులో పాల్గొన్నాడు. జెండా వందనం అనంతరం ఉద్యమ కార్యక్రమాల గూర్చి అందరూ చర్చించుకుంటుండగా.. ఇత్తెహదుల్ ముసల్మీన్ సంస్థకు చెందినజాకార్ల గుంపు ఖాసీమ్షరిఫ్ అధ్వర్యంలో వారిపై దాడి చేసింది. ఇందులో బత్తిని రామస్వామికి గాయాలయ్యాయి. అప్పటి వరకు జెండావందనంలో పాల్గొని.. ఆ తరువాత తన వృత్తి పనిపై వెళ్తున్న మొగిలయ్యకు తనసోదరుడు గాయపడిన సంగతి, ఘర్షణ జరిగిన సంగతి తెలిసింది.వెంటనే మొగిలయ్య సింహంలా వచ్చి రజాకార్లపై కలబడ్డాడు. మొగిలయ్యది దృఢమైన శరీరసౌష్టవం కావడంతో మొగిలయ్యను వదిలేస్తే తమను వదిలిపెట్టడని భావించిన రజాకార్లు బరిసెతో పోడవడంతో మొగిలయ్య అక్కడిక్కడే మరణించాడు. హైదరాబాద్ స్వతంత్రోద్యమంలో మొగిలయ్యదే మొదటిరాజకీయ హత్యగా ఉండిపోయింది. రామస్వామి, గుఱ్ఱం వెంకటయ్య, కూచం మల్లేషం గాయపడ్డాడు. ఎదురుగట్ల వెంకటయ్య, గుర్రం రామస్వామి, మంథిని రాజవీరు, మంథిని శివయ్య, బైరి రామస్వామి, పొశాల బుచ్చయ్య, మట్టెవాడ రాంబ్రమ్మం, ఎదురుకట్ట కనకయ్య, దాసరి శమ్మయ్య, మాసం నారాయణ, బారుపల్లి రామయ్య తదితరులు క్షతగాత్రులయ్యారు. మిగిలినవారు ఇంటి వెనక వైపు ద్వారం గుండా తప్పించుకున్నారు. మొగిలయ్య హత్య చేయబడ్డాడనే విషయం తెలుసుకున్న అజంజాహీ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు.. పని వదిలేసి నర్మెటి రామస్వామి న్యాయకత్వంలో పరిగెత్తుకుంటూ వచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఖాసిం షరిఫ్ దుండగులు పోతూ..పోతూ.. వరంగల్ చౌరస్తాలో మొగిలయ్యను చంపిన బరిసెను చూపుతూ ఊరేగింపు చేశారు. ఇక్కడ ఆర్యసమాజ నాయకుడు చెరుకు కాంతయ్య ఇంటిపై దాడి చేశారు. శబ్ధానుశాసనాంధ్ర గ్రంథాలయం ముందు నిల్చొని ఉన్న ఏవీవీ స్కూల్ విద్యార్థి ఖమ్మంకు చెందిన ప్రతాప సూర్యనారాయణను కత్తితో పొడిచి గాయపరిచారు. ఆర్యసమాజ నాయకులు వెలగందుల జనార్దన్గుప్త, చింతల రంగయ్యలు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వరంగల్ సుబేదార్ సైతం ముష్కరులను అభినందించారు. చైతన్యం నింపిన కాళోజీ కవిత.. అలర్లు సృష్టిస్తారనే కారణంపై కాళోజీ నారాయణరావు, ఎమ్మెస్ రాజలింగం, హయగ్రీవాచారి, మొ గిలయ్య అన్న బత్తిని రామస్వామిలను ఆరు నెలల పాటు నగర బహిష్కారం చేశారు. బహిష్కరణ ని బంధనను ఉల్లంఘించిన రాజలింగంను నిర్బం ధించారు. బూర్గుల రామకృష్ణారావు ఈ సంఘటనను నిరసిస్తూ నేరస్తులకు తగిన శిక్ష విధించాలని నిజాం రాజుకు నివేదిక పంపించారు. డాక్టర్ భోగరాజుపట్టాభి సీతారామయ్య ఈ సంఘటన నిరసిస్తూ నేరస్థులను కఠినంగా శిక్షించాలని నిజాంను హెచ్చరించాడు. నిజాం రాజు ఈ సంఘటనపై విచారించడానికి ప్రధాని మీర్జాఇస్మాయిల్‌ను నియమించాడు. ఇది తెలిసిన ఖాసిం షరిఫ్ బళ్లారికి వెళ్లి అక్కడే దా క్కున్నాడు. విచారించడానికి మీర్జాఇస్మాయిల్ వరంగల్ వచ్చిన సందర్భంగా భేతి కేశవరెడ్డి, బండారు చంద్రమౌళీశ్వరరావులు హత్య జరిగిన తీరును ప్రత్యక్షంగా చూపించారు. నిదింతులను శిక్షించాలని కోరుతూ ఖిలా వరంగల్‌లోని యువకులు విజ్ఞాపన పత్రం సమర్పించారు. మీర్జాస్మాయిల్ విచారించి వెళ్లిన తరువాత,.. ఎన్నాళ్ల నుండియో ఇదిగో ఇదిగో యనుచు/ ఇన్నాళ్లకైనను వెళ్లి వచ్చితివా? కోటగోడల మధ్య ఖూని జరిగిన చోట/ గుండాల శక్తుల గోచరించినవా? బజార్ల బాలకుని బల్లెంబుతో పొడచు/ బద్మాషునేమైన పసిగట్టినావా? .. అంటూ పరిహసిస్తూ కాళోజీ రాసిన కవిత చాలా మందిని ఆలోచింపచేసింది. కానీ, ఆ తరువాత ఈ సంఘటనలో గాయపడిన వారినే ప్రభుత్వం నేరస్థులుగా పరిగణించి జరిమానాలు విధించింది. యువకుల్లో పోరాట పటిమ.. ఈ సంఘటన ఇక్కడి యువకులలో భయాన్ని కలి గించ లేదు. పైగా యువకులు స్వచ్చంద సేవకులుగా ముందుకు రావడం ఓరుగల్లు ప్రజలకు పోరా ట పటిమకు నిదర్శనం. అలా ముందుకు వచ్చినవారిలో ఆరెల్లి బుచ్చయ్య, వెంకటనారాయణ యాదవ్ పలాసలో శిక్షణకు వెళ్లారు. దుగ్గిశెట్టి వెంకటయ్య, న ర్మెటి రామస్వామిలు ఆ తరువాత కాంగ్రెస్ వాలంటీర్ దళాలకు దళాధిపతులుగా ఆగ్రభాగాన నిలి చారు.ఇక్కడి నుంచి అటు ఆర్యసమాజీయులు, కాం గ్రెస్ వారు తమ పోరాట పంథాను మార్చుకున్నారు. దళాలను ఏర్పాటు చేసుకుని రహస్య పోరా టం జరిపారు. కమ్యూనిస్టులు పాలకుర్తిని కేంద్రం గా చేసుకుని విస్నూరు రామచంద్రరెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఊరు కమ్మర్లు తుపాకులు, బర్మార్లు, బందూకులు తయారు చేశారు. ప్రజలు బందూకు పట్టారు. చివరికి నిజాం రాజు, అతని తా బేదార్లు లోంగిపోక తప్పలేదు. తెలంగాణ ప్రజల పోరాట స్పూర్తి ప్రపంచ ప్రజలను నివ్వెరపర్చింది. -
గణపతిదేవునిగా...సుమన్
ఓరుగల్లు రామప్ప దేవాలయ చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘రామప్ప’. ఇందులో గణపతిదేవునిగా సుమన్ నటించారు. కాశీవిశ్వనాథ్, విన్నీ ముఖ్య పాత్రలు చేశారు, ఓ ప్రత్యేక పాత్రలో సంగీతదర్శకుడు చక్రి నటించారు. ఈ చిత్రానికి పానుగంటి శశిధర్ దర్శకుడు. సాయిచరణ్ మూవీస్ పతాకంపై కుమార్ మారబోయిన నిర్మిస్తున్న ఈ చిత్రం రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘గ్రాఫిక్స్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే, చక్రిపై తీసిన ప్రత్యేక పాట యువతను బాగా అలరిస్తాయి. అన్ని వర్గాలవారూ చూడదగ్గ చిత్రం ఇది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మహిత్ నారాయణ్, కథాసేకరణ-స్క్రీన్‌ప్లే: ఎ.ఆర్.కె. సాయి, సమర్పణ: ఆమూరి శైలజామధుసూదన్. -
సమరోత్సాహం
కేసీఆర్ సుడిగాలి ప్రచారం... హెలికాప్టర్ ద్వారా పర్యటన ఒకే రోజు ఐదు సెగ్మెంట్లలో సభలు... అధిక సంఖ్యలో హాజరైన జనం గులాబీ బాస్ మాటల తూటాలు... ప్రత్యర్థులపై విమర్శల బాణాలు పిచ్చికూతలు మానుకోవాలని రాహుల్‌కు హితవు వరంగల్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో ‘కారు’ రయ్.. రయ్ మంటూ దూసుకెళ్తోంది. గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సుడిగాలి పర్యటనతో ఓరుగల్లులో ప్రచారపర్వాన్ని వేడెక్కిం చారు. మంగళవారం ఒకే రోజు ఐదు శాసనసభ నియోజకవర్గాలను చుట్టేసి ప్రత్యర్థి పక్షాలకు అందనంత దూరంలో నిలిచారు. బహిరంగ సభలకు భారీగా జనం తరలిరావడంతో టీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు ఆ పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు భూపాలపల్లిలో బహిరంగ సభ ప్రారంభం కాగా, ములుగు, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడలో సాగింది. సాయం త్రం ఐదు గంటలకు కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా ఖమ్మం జిల్లాలో ప్రచారానికి వెళ్లారు. వ్యంగ్యాస్త్రాలు.. విమర్శలు బహిరంగ సభల్లో కేసీఆర్ మాటల తూటాలు పేల్చారు. ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధిం చారు. విమర్శలు వాడీ పెంచుతూ ప్రత్యర్థి పార్టీలపై దుమ్మెత్తిపోశారు. అదేసమయంలో జిల్లాలోని ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యమం నడిపినట్లే ప్రభుత్వాన్ని నడిపిస్తామంటూ వరాల వర్షం కురిపించారు.అసంతృప్తులకు అవకాశాలు ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వారికి కేసీఆర్ భరోసా కల్పించారు. పరకాల టికెట్ ఆశించిన పార్టీ రాష్ట్ర నాయకుడు నాగుర్ల వెంకటేశ్వర్లుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని భూపాలపల్లి సభలో హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగుర్ల ఆనందంతో కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. ఇక మహబూబాబాద్ ఎంపీ టికెట్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామచంద్రుడికి ఇస్తారని భావించినప్పటికీ... ఆయన పోటీకి విముఖత చూపిన విషయం తెలిసిందే. మహబూబాబాద్ సభలో ఆయన గురించి ప్రస్తావిస్తూ రామచంద్రుడికి రాజ్యసభ, ఎమ్మెల్సీల్లో ఏదో ఒక అవకాశం కల్పిస్తామన్నారు. ఇక ఇప్పటికే ఈ లైన్లో పరకాల సిట్టింగ్ ఎమ్మె ల్యే బిక్షపతి కూడా ఉన్న విషయం తెలిసిందే. సరాసరి ప్రసంగంలోకి... సభాస్థలికి సమీపంలోనే హెలికాప్టర్లో దిగిన ఆయన సరాసారి వేదికపైకి వెళ్లి ప్రజలకు అభివాదం చేసి... సరాసరి ప్రసంగంలోకి వెళ్లిపోయూరు. ఆయన ప్రసంగం 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే సాగింది. 40 నిమిషాల వ్యత్యాసంతోనే సభలు సాగారుు. తొలి సభ తర్వాత మలి సభలు కొంత ఆలస్యంగా ప్రారంభం కావడంతో తన ప్రసంగ సమయూన్ని తగ్గించుకున్నారు. ఎక్కువ సభల్లో పాల్గొనడమే లక్ష్యంగా ప్రచారం కొనసాగించారు. జిల్లాలో ఇప్పటికే రెండు దశల్లో ప్రచారం చేపట్టిన కేసీఆర్ మూడో విడతగా మరోసారి ఈ నెల 26వ తేదీన పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. -
నేడు మడికొండలో ఓరుగల్లు గర్జన
హాజరుకానున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష మంది సమీకరణ లక్ష్యం సభకు భారీ ఏర్పాట్లు వరంగల్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ శివారు మడికొండలో ఓరుగల్లు గర్జన పేరిట టీఆర్ఎస్ గురువారం బహిరంగ సభ నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న సభకు గులాబీ దళం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ దఫా టీఆర్ఎస్ ఒంటరిగా అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ సభను టీఆర్ఎస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభ సక్సెస్ చేసి... ఓటర్ల మనసులను దోచుకునే ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి భారీ జనసమీకరణకు ప్రణాళికలు రూపొందించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇదివరకే జనసమీకరణ లక్ష్యం నిర్ధేశించారు. ఇందుకనుగుణంగా మడికొండలోని టీఎన్జీవోలకు చెందిన 40 ఎకరాల గ్రౌండ్లో 30 ఎకరాల భూమిని చదును చేశారు. ముళ్లపొదలు తొలగించి సభాస్థలిలో లైటింగ్ ఏర్పాట్లు చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ రాక సభలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్లో హన్మకొండకు రానున్నారు. ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో హెలిపాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా జేఎస్ఎం పాఠశాలలో ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ... హైటెన్ష్‌న్ తీగల అడ్డంకితో అక్కడికి మార్చారు. కేసీఆర్ ఇక్కడకు చేరుకున్న అనంతరం నేరుగా హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ కొద్దిసేపు సేద తీరి, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ముఖ్య నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల వరకు సభాస్థలికి చేరుకోనున్నారు. సభ అనంతరం రాత్రి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సభలో 12 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులతోపాటు రెండు లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు హాజరుకానున్నారు. లక్ష మంది లక్ష్యం : రవీందర్రావు గులాబీ గుభాళించేలా... ప్రత్యర్థి పక్షాలను ఆత్మరక్షణలో పడేసేలా సభ నిర్వహిస్తామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. సభాస్థలిలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ లక్ష మంది లక్ష్యంగా జనసమీకరణ చేపట్టామన్నారు.టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయనతోపాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. -
ఓ మహిళా.. ఏలుకో...
రాణిరుద్రమ పౌరుషం, సమ్మక్క-సారలమ్మ ధీరత్వానికి వారసత్వంగా నిలిచిన ఓరుగల్లులో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. చట్టసభలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1984లో కల్పనాదేవి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1967లో జిల్లా నుంచి మొదటిసారిగా మహిళా ఎమ్మెల్యే ఎన్నికయ్యూరు. ఆ తర్వాత 2004 నుంచి మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే ఉన్నారు. 2009లో ఒకేసారి నలుగురు మహిళలు ఎమ్మెల్యేలు గెలుపొంది రికార్డు సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. 1995లో 225 ఎంపీటీసీ, 17 మంది మహిళా జెడ్పీటీసీ సభ్యులు ఉంటే.. ఇప్పుడు 369 ఎంపీటీసీ, 25 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించనున్నారు. -
ప్రపంచ స్థాయికి ఓరుగల్లు ఖ్యాతి
వెంకటాపురం, న్యూస్‌లైన్ : జిల్లాలో కాకతీయులు కట్టడాలు నిర్మించడం వలన ఓరుగల్లు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చేప్పే అవకా శం మనకు లభించిందని ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం రామప్ప ఆలయ ప్రాంగణంలో రెండవ రోజు కొనసాగిన కాకతీయ ము గింపు ఉత్సవాలకు ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గండ్ర మాట్లాడుతూ పురాతన ఆలయాలు కాకతీయులు నిర్మిం చినవేనని, అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయం టే అప్పటి సైన్స్ పరిజ్ఞానం ఎంతో గొప్పదన్నారు. దేవునిపై విశ్వాసం ఉండాలనే ఉద్ధేశంతోనే వారు ఆలయాలు నిర్మించారని పేర్కొన్నారు. నీటిలో తేలియాడే ఇటుకల తో రామప్ప ఆలయాన్ని నిర్మించడం అద్భుతమన్నారు. వారి కీర్తిని ప్రపంచ నలుమూలల చాటిచెప్పాలని కోరా రు. కాకతీయ ఉత్సవాలను భవిష్యత్‌లో అన్ని ప్రాంతా ల్లో నిర్వహించాలని చెప్పారు. అనంతరం కళాకారులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, నాగపూరి రాజలింగం, కలెక్టర్ కిషన్, ఆసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ సంజీవయ్య, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్, ట్రైనీ కలెక్టర్ రాజీవ్‌గాంధీ, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, ములుగు ఆర్డీఓ సభావట్ మోతీలాల్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, డీపీఆర్ఓ వెంకటరమణ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం ఉత్సవాలకు వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులకు స్థానిక కళాకారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నంది విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఉత్సవాల ప్రారంభానికి ముందు కర్ణాటకకు చెందిన కళాకారులు చేసిన ‘గొల్లు గుణిత’ నృత్యం ఆకట్టుకుంది. ఉత్సవాలను తిలకించేందుకు మూడువేల మంది తరలివచ్చారు. కనువిందు చేసిన ఒడిస్సీ నృత్యం రామప్పలో శనివారం రాత్రి జరిగిన కాకతీయ ఉత్సవాల్లో పద్మశ్రీ మాధవి ముద్గల్ చేసిన ఒడిస్సీ నృత్యం కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచింది. ఆమె శిష్యులైన షోయాభిదాస్, షాలాకారాయి, శోభాబీస్ట్, దీపిక బీస్ట్ లు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కర్ణాటక కళాకారులు డోలు నృత్యాలు, వెంపటి నాగేశ్వరి బృందంచే శివాష్టకం నృత్యాలు అలరించాయి. -
వర్షంతో ఓరుగల్లువాసుల ఇక్కట్లు