ప్రపంచ స్థాయికి ఓరుగల్లు ఖ్యాతి | orugallu is recognised by internationally | Sakshi
Sakshi News home page

ప్రపంచ స్థాయికి ఓరుగల్లు ఖ్యాతి

Published Sun, Dec 22 2013 7:11 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

జిల్లాలో కాకతీయులు కట్టడాలు నిర్మించడం వలన ఓరుగల్లు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చేప్పే అవకా శం మనకు లభించిందని ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.

 వెంకటాపురం, న్యూస్‌లైన్ : జిల్లాలో కాకతీయులు కట్టడాలు నిర్మించడం వలన ఓరుగల్లు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చేప్పే అవకా శం మనకు లభించిందని ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం రామప్ప ఆలయ ప్రాంగణంలో రెండవ రోజు కొనసాగిన కాకతీయ ము గింపు ఉత్సవాలకు ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గండ్ర మాట్లాడుతూ పురాతన ఆలయాలు కాకతీయులు నిర్మిం చినవేనని, అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయం టే అప్పటి సైన్స్ పరిజ్ఞానం ఎంతో గొప్పదన్నారు. దేవునిపై విశ్వాసం ఉండాలనే ఉద్ధేశంతోనే వారు ఆలయాలు నిర్మించారని పేర్కొన్నారు. నీటిలో తేలియాడే ఇటుకల తో రామప్ప ఆలయాన్ని నిర్మించడం అద్భుతమన్నారు. వారి కీర్తిని ప్రపంచ నలుమూలల చాటిచెప్పాలని కోరా రు. కాకతీయ ఉత్సవాలను భవిష్యత్‌లో అన్ని ప్రాంతా ల్లో నిర్వహించాలని చెప్పారు. అనంతరం కళాకారులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, నాగపూరి రాజలింగం, కలెక్టర్ కిషన్, ఆసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ సంజీవయ్య, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్, ట్రైనీ కలెక్టర్ రాజీవ్‌గాంధీ, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, ములుగు ఆర్డీఓ సభావట్ మోతీలాల్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, డీపీఆర్‌ఓ వెంకటరమణ పాల్గొన్నారు.
 
 ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం
 ఉత్సవాలకు వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులకు స్థానిక కళాకారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నంది విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఉత్సవాల ప్రారంభానికి ముందు కర్ణాటకకు చెందిన కళాకారులు చేసిన ‘గొల్లు గుణిత’ నృత్యం ఆకట్టుకుంది. ఉత్సవాలను తిలకించేందుకు మూడువేల మంది తరలివచ్చారు.
 
 కనువిందు చేసిన ఒడిస్సీ నృత్యం
 రామప్పలో శనివారం రాత్రి జరిగిన కాకతీయ ఉత్సవాల్లో పద్మశ్రీ మాధవి ముద్గల్ చేసిన ఒడిస్సీ నృత్యం కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచింది. ఆమె శిష్యులైన షోయాభిదాస్, షాలాకారాయి, శోభాబీస్ట్, దీపిక బీస్ట్ లు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కర్ణాటక కళాకారులు డోలు నృత్యాలు, వెంపటి నాగేశ్వరి బృందంచే శివాష్టకం నృత్యాలు అలరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement