గణపతిదేవునిగా...సుమన్
ఓరుగల్లు రామప్ప దేవాలయ చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘రామప్ప’. ఇందులో గణపతిదేవునిగా సుమన్ నటించారు. కాశీవిశ్వనాథ్, విన్నీ ముఖ్య పాత్రలు చేశారు, ఓ ప్రత్యేక పాత్రలో సంగీతదర్శకుడు చక్రి నటించారు. ఈ చిత్రానికి పానుగంటి శశిధర్ దర్శకుడు. సాయిచరణ్ మూవీస్ పతాకంపై కుమార్ మారబోయిన నిర్మిస్తున్న ఈ చిత్రం రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘గ్రాఫిక్స్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే, చక్రిపై తీసిన ప్రత్యేక పాట యువతను బాగా అలరిస్తాయి. అన్ని వర్గాలవారూ చూడదగ్గ చిత్రం ఇది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మహిత్ నారాయణ్, కథాసేకరణ-స్క్రీన్‌ప్లే: ఎ.ఆర్.కె. సాయి, సమర్పణ: ఆమూరి శైలజామధుసూదన్.