Ramappa
-
రామప్ప దేవాలయం లో ఇటుకలు ఎంత తేలికో తెలుసా ?
-
రామప్ప ఆలయంలో గాలిలో తేలుతున్న స్తంభం..!
-
రామప్ప దేవాలయం మరియు వాటి రహస్య శక్తులు..!
-
‘రామప్ప’ పరిసరాలు కాంక్రీట్ జంగిల్‌గా మారొద్దు : హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రామప్ప ఆలయానికి వరల్డ్ హెరిటేజ్ గుర్తింపునిస్తూ యునెస్కో ప్రకటించిన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో నిర్ణీత దూరం వరకు ఎటువంటి కట్టడాలకు అనుమతి ఇవ్వరాదని హైకోర్టు స్పష్టంచేసింది. ఆలయ శిల్పకళకు, పర్యావరణానికి విఘాతం కలగకుండా ఆలయం చుట్టూ కొంత ప్రాంతాన్ని నిర్మాణ నిషిద్ధ (బఫర్‌జోన్) ప్రాంతంగా ప్రకటించాలని ఆదేశించింది. అంతర్జాతీయ పర్యాటకుల బసకు వీలుగా చేపట్టే నిర్మాణాలు ఆలయానికి దూరంగా ఉండాలని తేల్చిచెప్పింది. నగరంలోని చారిత్రక కుతుబ్‌షాహీ టూంబ్స్ చుట్టూ కాంక్రీట్ జంగిల్ తయారైందని, రామప్ప ఆలయ పరిసరాలు అలా మారకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. యునెస్కో నిర్ధేశించిన మేరకు శాశ్వత గుర్తింపు లభించేందుకు అవసరమైన పనులను సకాలంలో పూర్తిచేయాలని, అందుకు మైలురాళ్లు నిర్ధేశించుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిన నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పత్రికల్లో వచ్చిన కథనాలను గతంలో ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి యునెస్కో నిర్దేశించిన మేరకు పనులు పూర్తిచేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది. 2022 డిసెంబర్‌లోగా పనులు పూర్తిచేయాలి యునెస్కో నిర్ధేశించిన మేరకు పనులన్నింటినీ ఈ ఏడాది డిసెంబర్‌లోగా కాకుండా 2022 డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని వరల్డ్ హెరిటేజ్ కమిటీ సూచించిందని కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు నివేదించారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులతో కూడా కమిటీ వచ్చే వారంలో సమావేశమై.. బఫర్ జోన్‌ను ప్రకటించే విషయంపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆలయ పరిసరాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఇటీవల సమావేశం నిర్వహించారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరీందర్ నివేదించారు. దీంతో స్పందించిన ధర్మాసనం రానున్న నాలుగు వారాల్లో తీసుకున్న చర్యలను వివరిస్తూ తాజా నివేదికను సెప్టెంబర్ 29లోగా సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను వాయిదావేసింది. -
వారసత్వ రేసులో రామప్ప.. యునెస్కో కీలక సూచనలు
-
ఇలాంటివి కుతూహలం కలిగిస్తాయి: విజయ్ దేవరకొండ
తక్కువ టైంలో దక్కిన క్రేజ్‌ను నిలబెట్టుకుంటూ ప్యాన్ ఇండియన్ లెవల్‌కు వెళ్లిపోయాడు ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరీ డైరెక్షన్లో లైగర్‌తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా ఓరుగల్లు ఘనత మీద ట్విటర్లో ఒక పోస్ట్ చేశాడు. ‘చరిత్ర గురించి ఎప్పుడూ ఒక కుతూహలం ఉంటుంది. 800 సంవత్సరాల చరిత్ర, కాకతీయ సామ్రాజ్యపు వైభవపు గుర్తు రామప్ప గుడి ప్రపంచ వారసత్వ హోదా రేసులో నిలబడింది’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. అలా సొంత నేల చారిత్రక ఘనతపై తన ఆసక్తిని ప్రదర్శించాడు. Have always been very intrigued by the historic past.. The 800 year old Ramappa Temple built by the Kakatiya dynasty is now in the race for world heritage status! https://t.co/ItwPIoDdXe — Vijay Deverakonda (@TheDeverakonda) July 10, 2021 కాగా, అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో బృందం జులై 16న సమావేశమవుతోంది. రామప్ప గుడి గనుక ఈ ఘనత సాధిస్తే తెలంగాణలోనే మొట్టమొదటి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరుతుంది. జులై 24-26 మధ్య డబ్ల్యూహెచ్‌సీ కమిటీ వోటింగ్ మీదే మిగతాదంతా ఆధారపడి ఉంటుంది. చదవండి: రామప్ప గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా? -
రామప్పపై యునెస్కో సందేహాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయం పక్కనే ఉన్న కల్యాణ మండపం పునర్నిర్మాణంలో నెలకొన్న దుస్థితి రామప్పకు ఎదురవుతుందా? రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే విషయాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్న యునెస్కోకు ఈ తరహా సందేహం వచ్చినట్లుంది. రామప్ప పరిరక్షణ, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, కట్టడంపై దుష్ప్రభావం చూపే పరిస్థితులను సకాలంలో నిరోధించటం, ఆక్రమణల్లేకుండా చూడటం, పర్యాటకుల సంఖ్య పెంచేందుకు చేపట్టే చర్యలు, పర్యాటకుల వల్ల కట్టడంపై ప్రభావం.. తదితర అంశాలన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి అత్యున్నత స్థాయి హోదా అధికారి ఆధ్వర్యంలో అథారిటీ ఏర్పాటు చేస్తారా అంటూ తాజాగా యునెస్కో ప్రశ్నల వర్షం కురిపించింది. వచ్చే జూన్/జూలైలో చైనాలో జరిగే సమావేశంలో రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే విషయాన్ని యునెస్కో తేల్చనుంది. ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చేముందు ఇలాంటి సందేహాను యునెస్కో లేవనెత్తడం సహజమేనని అధికారులు పేర్కొంటున్నా.. రామప్పపై వేయి స్తంభాల దేవాలయ కల్యాణమండపం పునర్నిర్మాణంలో కనిపించిన నిర్లక్ష్యం ప్రభావం ఉంటుందన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. అప్పుడే ప్రశ్నించిన యునెస్కో ప్రతినిధి గత నవంబర్‌లో యునెస్కో ప్రతినిధి వాసు పోష్యానంద రామప్పను సందర్శించారు. డోజియర్‌లో పేర్కొన్న ప్రత్యేకతలు రామప్ప కట్టడానికి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని తేల్చేందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తన రెండ్రోజుల పర్యటనలో వేయి స్తంభాల దేవాలయాన్ని కూడా చూశారు. ఆలయం పక్కనే అసంపూర్తిగా ఉన్న కల్యాణమండపాన్ని చూసి విస్తుపోయారు. దానికి కారణాలపై వాకబు చేశారు. శిథిలావస్థకు రావటంతో కట్టడాన్ని పునర్నిర్మిస్తున్నామని అధికారులు వివరించారు. కానీ తిరిగి నిర్మించేందుకు ఇన్నేళ్ల సమయం ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్న లేవనెత్తారు. దీంతో కొన్ని అంతర్గత సమస్యలు అని అధికారులు చెప్పారు. అద్భుత నిర్మాణం దుస్థితిని కళ్లారా చూశాక ఆయనకు రామప్ప విషయంలో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందా అన్న అనుమానం వచ్చినట్లుంది. అందుకే తాజాగా మన అధికార యంత్రాంగం నుంచి స్పష్టత కోరుతూ యునెస్కో పలు ప్రశ్నలు అడిగింది. రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే వేయి స్తంభాల దేవాలయం పక్కనే ఉండే కల్యాణమండపాన్ని పునర్నిర్మించేందుకు దశాబ్దన్నర కిందటే విడదీసి ఆ రాళ్లపై సీరియల్ నంబర్లు వేసి పక్కన పెట్టారు. చివరకు మూడేళ్ల కింద పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పట్లో రూ.7.5 కోట్ల అంచనాతో మొదలుపెట్టినా.. పైకప్పు వరకు రాకుండానే ఆ నిధులు ఖర్చయిపోయాయి. ఇప్పుడు దాదాపు రూ.కోటి వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు బకాయి ఉన్నాయి. తదుపరి నిధులు వస్తే కానీ పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదు. దాదాపు రెండేళ్లుగా అవి నిలిచిపోయే ఉన్నాయి. ఈ పనుల్లో పాలుపంచుకునే స్థపతులతో పాటు ఇతర సిబ్బందికి చెల్లించే మొత్తం తాలూకు రేట్లను సవరించాలన్న విజ్ఞప్తి ఉంది. ఆ రేట్లు ఎంతుంటాయో నిర్ధారించేందుకే ఏడాదికిపైగా సమయం పట్టింది. ఇటీవలే ఆ ధరలను పేర్కొంటూ ఏఎస్ఐకి ప్రతిపాదన పంపారు. ముందు చూపు లేకపోవడంతోనే.. గతంలో పనులు చేపట్టినప్పుడు క్రేన్లను వినియోగించారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే వాటిని వాడారు. ఇప్పుడు ఆ బిల్లులను క్లియర్ చేయటం కష్టంగా మారింది. పునాదులకు అయ్యే వ్యయం రెట్టింపు అయింది. దీనికి కారణాలను ఢిల్లీ అధికారులకు వివరించాల్సి ఉంది. ఇలాంటి చిక్కుముడులతో పనులు పెండింగులో పడి పైకప్పు లేకుండానే మొండి శిలలు వెక్కిరిస్తున్నాయి. అలాంటి సమస్య రాదు.. ‘వేయిస్తంభాల దేవాలయ మండపం పునర్నిర్మాణంలో జాప్యం జరిగిన మాట వాస్తవమే. త్వరలో మళ్లీ పనులు మొదలై ఏడాదిన్నరలో పూర్తి చేస్తాం. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కే విషయంలో దీని ప్రభావం ఉంటుందనుకోను. కొన్ని అనుమానాలను నివృత్తి చేయాలంటే యునెస్కో కోరిన మాట నిజమే. వాటికి సమాధానాలు పంపాం. ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే సమయంలో ఇలాంటి సందేహాలను నివృత్తి చేసుకోవటం యునెస్కోకు సహజమే’ – మల్లేశం, ఏఎస్ఐ అధికారి -
చరిత్రకు వారసత్వం..
‘ప్రత్యేకత’ ఉంటే హెరిటేజ్‌గా గుర్తింపు సాక్షి, హైదరాబాద్: చార్మినార్, రామప్ప, వేయి స్తంభాల గుడి.. అద్భుత నిర్మాణానికి, కట్టిపడేసే శిల్పకళకు తార్కాణాలు. నాటి నైపుణ్యానికి ప్రతీకలు. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఇలాంటి కట్టడాలను భావితరాలకు అందించడం మన కర్తవ్యం. దీని కోసమే భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ), హెరిటేజ్ తెలంగాణ కృషి చేస్తున్నాయి. యునెస్కో గుర్తింపు కోసం రామప్ప ఆలయాన్ని ప్రతిపాదించడం.. ఎర్రమంజిల్ కూల్చివేత నేపథ్యంలో ‘హెరిటేజ్’ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. అసలు హెరిటేజ్ అంటే ఏమిటి?.. ఎలా గుర్తిస్తారు?... ఏఎస్ఐ ఆధీనంలో 8 కట్టడాలే ప్రస్తుతం తెలంగాణలో ఏఎస్ఐ ఆధీనంలో 8 కట్టడాలే ఉన్నాయి. చార్మినార్, గోల్కొండ, రామప్ప, వేయిస్తంభాల గుడి ఇందులో ప్రముఖమైనవి. దేశానికి ప్రాధాన్యాన్ని కల్పించే ప్రాంతం/ కట్టడాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) తన ఆధీనంలోకి తీసుకుంటుంది. హెరిటేజ్ తెలంగాణలో ప్రస్తుతం 337 హెరిటేజ్ తెలంగాణలో ప్రస్తుతం 337 రక్షిత కట్టడాలు ఉన్నాయి. స్థానిక ప్రాంతానికి ప్రత్యేకతదిగా ఉన్న కట్టడం/ప్రాంతం రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని రక్షిత కట్టడాల జాబితాలోకి చేరుతుంది. నాటి హుడా ఆధ్వర్యంలో ఏర్పడ్డ హెరిటేజ్ కమిటీ గుర్తించిన కట్టడాలు 137. ఇటీవల వీటిని రక్షిత కట్టడాల జాబితా నుంచి సవరించారు. ఇవి అటు ఏఎస్ఐ అధీనంలో, ఇటు హెరిటేజ్ తెలంగాణ అధీనంలో లేవు. ప్రస్తుతం 3,693 కేంద్ర ప్రభుత్వ అధీనంలో (బ్రిటిష్ కాలంలో) 1861లో ప్రారంభమైన ఏఎస్ఐ తొలుత ఢిల్లీలోని 20 చారిత్రక కట్టడాలను రక్షిత కట్టడాలుగా గుర్తించింది. స్వాతంత్రం సిద్ధించే నాటికి వీటి సంఖ్య 151కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆ జాబితాలో 3,693 ఉన్నాయి. వారసత్వ కట్టడాలంటే.. ఒక మానవ కట్టడం, ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ప్రాంతం కొన్ని ప్రత్యేక లక్షణాలతో కనీసం వందేళ్లుగా మనుగడ సాగిస్తూ ఉంటే దాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించొచ్చు. చారిత్రకంగా ఆ ప్రాంతానికి ప్రత్యేక లక్షణాలుండాలి. లేదా నిర్మాణ శైలి అసాధారణ విలక్షణతతో కూడుకుని ఉండాలి. ఆ నిర్మాణంలో ప్రత్యేక నైపుణ్యం దాగి ఉండాలి. దాని సౌందర్యం గొప్పగా అనిపించాలి. ఇది భవిష్యత్ తరాలకు చాలా అవసరమైనదై ఉండాలి. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేదిగా ఉండాలి. ప్రకృతి రమణీయతలో విలక్షణం కనపడాలి. అది ఆ ప్రాంత ప్రత్యేకత అని చాటి చెప్పేలా ఉండాలి.... ఇలా ఏదో ఓ అంశాన్ని అది కలిగి ఉంటే దాన్ని వారసత్వ ప్రాంతం కట్టడంగా గుర్తిస్తారు. -
రామప్ప కీర్తికి ‘హెరిటేజ్’ కిరీటం!
వారసత్వ సంపద హోదాపై కొత్త ఆశలు - యునెస్కో కోరినట్టు ఆధారాలు పంపనున్న ప్రభుత్వం - సేకరణ బాధ్యతలు ప్రఖ్యాత నర్తకి చూడామణికి - మూడు రోజులు అధ్యయనం.. రామప్ప అద్భుతమంటూ కితాబు - సెప్టెంబర్ రెండో వారంలో దరఖాస్తు - నేడు హైదరాబాద్‌లో కీలక భేటీ సాక్షి, హైదరాబాద్: ‘‘ఆలయమంటే ఆధ్యాత్మికతకు ఆలవాలం. అది భక్తిభావంతోపాటు దేశీయ సంస్కృతిని ప్రతిబింబించే దృశ్య కావ్యం కూడా అయితే? అప్పుడిక దాని ప్రత్యేకతే వేరు. అలా ఆధ్యాత్మికతకు, అద్భుత నృత్య రీతులతో కూడిన శిల్ప సంపదకు ఆటపట్టుగా అలరారుతున్న గొప్ప దేవాలయం రామప్ప. కళ్యాణి చాళుక్యులు, దేవగిరి యాదవ రాజులు, చోళులు, పాండ్యులు, కాకతీయులు 12–15 శతాబ్దాల మధ్య నిర్మించిన వందలాది ఆలయాల్లో మకుటాయమానం అనదగ్గ అద్భుత ప్రత్యేకతలు ఈ ఆలయం సొంతం!!’’ ► ప్రఖ్యాత నర్తకి, నృత్య పరిశోధకురాలు ప్రొఫెసర్ చూడామణి నందగోపాల్ వెలిబుచ్చి న అభిప్రాయాలివి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందే అర్హతలు రామప్పకు పూర్తిగా ఉన్నాయని కూడా తేల్చారామె. యునెస్కో కన్సల్టెంట్ కూడా అయిన నందగోపాల్, రామప్ప ఆలయాన్ని మూడు రోజుల పాటు ఆసాంతం పరిశోధించి చెప్పిన ఈ మాటలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏ నిర్మాణానికీ ఇప్పటిదాకా ఈ హోదా లేని లోటును రామప్ప తీర్చే అవకాశం కనిపిస్తోంది. యునెస్కో గుర్తింపు పొందేందుకు రామప్పకున్న అర్హతలను సవివరంగా పొందుపరుస్తూ నందగోపాల్ సమగ్రమైన దరఖాస్తు (డోసియర్)ను రూపొందించనున్నారు. కేంద్రం దాన్ని సెప్టెంబర్ రెండో వారంలో యునెస్కోకు పంపనుంది. రామప్పపై అధ్యయనంలో తాను గుర్తించిన అంశాలను తాత్కాలిక నివేదిక రూపంలో నందగోపాల్ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తేనున్నారు. ఇందుకోసం గురువారం ప్రభుత్వ సలహాదారు పాపారావు, పురావస్తుశాఖ సంచాలకులు విశాలాచ్చి, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు నిర్వాహకులతో హైదరాబాద్‌లో ఆమె భేటీ కానున్నారు. యునెస్కో సందేహాల నివృత్తి కోసం... చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణాలకు ప్రపంచ వారసత్వ హోదా కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో చివరి ప్రయత్నంగా రామప్ప ఆలయానికి హోదా కోసం ప్రభుత్వం 4 నెలల క్రితం దరఖాస్తు చేసింది. దాన్ని కేంద్రం యునెస్కోకు పంపగా నిర్మాణపరంగా రామప్ప ప్రత్యేకతలు, దానికి ప్రపంచ ప్రసిద్ధి పొందేందుకున్న అర్హతలకు సంబంధించిన ఆధారాలు లేకపోవటంతో దరఖాస్తును దాదాపుగా తిరస్కరించింది. దాంతో, రామప్ప విశిష్టతలను తెలిపే ఆధారాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయ గోడలు, పై కప్పులపై నృత్య భంగిమలే ఎక్కువగా ఉండటంతో ఆ రంగ నిపుణులతో అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. యునెస్కో గుర్తింపు పొందిన కర్ణాటకలోని హంపి, బాదామీ పట్టదకల్ శివాలయం, తమిళనాడులోని మహాబలిపురం వంటి కట్టడాల ప్రత్యేకతలపై అధ్యయనం చేసిన నందగోపాల్‌ను ఇందుకు ఎంపిక చేసింది. నాలుగు రోజుల క్రితం ఆమె నృత్య, విద్య, కళా పరిశోధకురాలు సౌమ్య మంజునాథ్, పురావస్తు శాఖ విశ్రాంత ఉప సంచాలకుడు రంగాచార్యులుతో కలిసి రామప్పపై అధ్యయనం చేశారు. కుడ్యా లు, పై కప్పులపై చెక్కిన మురళీధర కృష్ణుడు, గోపికా వస్త్రాపహరణం, సాగర మథనం, అష్టదిక్పాలకులు, కోలాటాలు, వాయిద్యాలతో కూడిన శిల్పాలు, యువ తుల తాడాట వంటి వాటన్నింటినీ నిశితంగా పరిశీలించారు. ► కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి బావమరిది జయాపసేనాని 1250లో రచించిన నృత్త రత్నావళిలోని వర్ణనలకు రామప్ప ఆలయ శిల్పాకృతులే ప్రేరణ అని తేల్చారు. ► నటరాజ రామకృష్ణ రూపొందించిన పేరిణీ శివ తాండవానికి ఆలయశిల్పాలే స్ఫూర్తి అన్న దానిని పరిగణనలోకి తీసుకున్నారు. ► 7, 8వ శతాబ్దాలకు చెందిన మహాబలిపురం, 8, 9 శతాబ్దాలకు చెందిన బాదామీ పట్టడకల్ శివాలయం, 11 శతాబ్దానికి చెందిన తంజావూరు బృహదీశ్వరాలయం, 16వ శతాబ్దానికి చెందిన హంపి కట్టడాలు యునెస్కో గుర్తింపు పొందాయి. వీటి మధ్య కాలానికి చెందిన రామప్ప ఆలయంలో వాటికి తీసిపోని ప్రత్యేకతలెన్నో ఉన్నాయని తేల్చారు. నివేదికలో వీటన్నింటినీ సవివరంగా పొందుపరచనున్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
మడకశిర రూరల్ : మృత్యువు ఐచర్ వాహన రూపంలో దూసుకొచ్చింది. ఆటోను బలంగా ఢీకొంది. అందులో ఉన్న ఇద్దర్ని కబళించింది. ఈ సంఘటన మడకశిర రూరల్ మండలం కల్లుమర్రి–అగ్రంపల్లి గ్రామాల మధ్య బుధవారం జరిగింది. మడకశిర ఎస్ఐ మగ్బుల్‌బాషా కథనం ప్రకారం... కల్లుమర్రికి చెందిన రామప్ప(65), హనుమంతరాయుడు(21) సహా కలూమ్ అనే వ్యక్తులు ఆటోలో హిందూపురానికి బయలుదేరారు. కల్లుమర్రి–అగ్రంపల్లి మార్గమధ్యంలో మడకశిర వైపు నుంచి విపరీతమైన వేగంతో వచ్చిన ఐచర్ వాహనం ఆటోను ఢీకొనడంతో అది అదుపు తప్పి బోల్తాపడింది. అందులోని ముగ్గురూ గాయపడ్డారు.వారిని 108లో హిందూపురం ఆస్పత్రికి తరలిస్తుండగానే రామప్ప మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హనుమంతరాయుడు మరణించారు. తీవ్రంగా గాయపడిన కలూమ్‌ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మగ్బుల్‌బాషా తెలిపారు. కాగా ఘటన స్థలంలో జనం భారీగా గుమిగూడారు. నాన్న చనిపోయిన నాలుగు రోజులకే... హనుమంతరాయుడు తండ్రి అంజప్ప నాలుగు రోజుల కిందట మరణించారని గ్రామస్తులు తెలిపారు. ఇంకా ఆ చేదు జ్ఞాపకాల నుంచి తేరుకోకనే ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో తండ్రీకొడుకులిద్దరూ చనిపోవడంతో కల్లుమర్రిలో విషాదం నెలకొంది. -
21 అడుగులకు ‘రామప్ప’ నీటిమట్టం
వెంకటాపురం : మధ్యతరహా నీటి ప్రాజెక్టు అయిన రామప్ప సరస్సులోకి దేవాదుల జలాలను గత మూడు రోజులుగా ఎయిర్ వాల్వ్‌ల ద్వారా పంపింగ్ చేస్తున్నారు. దీంతో సరస్సులో నీటిమట్టం 21 అడుగులకు చేరుకుంది. మంగళవారం ఉదయం ఐదు ఎయిర్వాల్వ్లలో రెండింటికి 600 ఎం.ఎం వ్యాసార్ధం కలిగిన పైపులను బిగించి, భీంఘన్‌పూర్ వద్ద మోటార్లను ప్రారంభించారు. దీంతో ఎయిర్‌వాల్వ్‌ల ద్వారా పెద్ద మొత్తంలో దేవాదుల జలాలు సరస్సులోకి చేరాయి. దీంతో ఆయకట్టు రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. -
రామప్ప కళ కళ
వెంకటాపురం : మండలంలోని రామప్ప చెరువు దేవాదుల నీటితో çకళకళలాడుతోంది. 36 అడుగుల నీటి సామర్థ్యం గల ఈ చెరువులో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు ఏ మాత్రం రాలేదు. పాకాల, లక్నవరం సరస్సులు నిండినా, రామప్పకు నీరు రాకపోవడంతో ఆయకట్టు రైతులు రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి అజ్మీర చందూలాల్ ద్వారా భారీ నీటి పారుదల శాఖ మాత్యులు హరీశ్‌రావు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి హరీశ్‌రావు రామప్పలో ఉన్న దేవాదుల ఎయిర్వాల్్వలను ఓపె¯ŒS చేసి సరస్సు నిండేలా చర్యలు తీసుకోవాలని ఐబీ అధికారులను ఆదేశించారు. అదివారం దేవాదుల సిబ్బంది సరస్సులో ఉన్న ఆరు ఎయిర్వాల్్వలను ఒపె¯ŒS చేయగా, ఆ నీరంతా రామప్ప చెరువులోకి వచ్చింది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
రామప్పకు గోదావరి జలాలు
పాలంపేట చెరువు నింపేందుకు ఏర్పాట్లు భారీ వర్షాలు కురిసినా నిండని వైనం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు.. ప్రస్తుత నిల్వ 0.4 టీఎంసీలు దేవాదులతో చారిత్రక చెరువుకు జలకళ సాక్షి ప్రతినిధి, వరంగల్: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా చిన్నా, పెద్ద చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా చారిత్రక నేపథ్యమున్న రామప్ప(పాలంపేట) చెరువు పరిస్థితి మాత్రం దయనీయంగానే ఉంది. గరిష్ట స్థాయి వర్షపాతం నమోదైనా.. ఆ చెరువు సగం కూడా నిండకపోవడం గమనార్హం. రామప్ప చెరువు నీటి నిల్వ సామర్థ్యం 2.99 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.4 టీఎంసీల నీరే ఉంది. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దేవాదుల ప్రాజెక్టు నీటితో రామప్ప చెరువును నింపాలని సాగునీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే దేవాదుల ప్రాజెక్టు మూడోదశలో టన్నెల్ నిర్మాణం నిలిచిపోవడంతో రామప్ప చెరువులోకి నీరు చేరే పరిస్థితి లేకుండాపోయింది. ప్రాజెక్టు మొదటి దశలో భీంఘనపూర్ నుంచి నీటిని పులుకుర్తి రిజర్వాయర్‌లో... రెండో దశలో చలివాగు ప్రాజెక్టులో, మూడో దశలో రామప్ప చెరువులోకి తరలించేలా ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపాదించారు. టన్నెల్లోకి నీరు ప్రవేశించడంతో ఈ పనులు ఆగిపోయాయి. టన్నెల్ స్థానంలో పైపులైను నిర్మించాలనే కొత్త ప్రతిపాదనలు ముందుకు కదలడంలేదు. ఈ పరిస్థితుల్లో రామప్ప చెరువులోకి దేవాదుల జలాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సాగునీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు నిర్ణయంతో రామప్ప చెరువు జలకళను సంతరించుకునే అకాశం ఉంది. దేవాదుల ప్రాజెక్టులో మొదటి దశలోని భీంఘనపూర్ చెరువు నుంచి పులుకుర్తి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేస్తారు. ఈ పైపులైను రామప్ప చెరువు అంతర్భాగం నుంచి వెళ్లింది. దేవాదుల మొదటి దశ పైపులైను ప్రస్తుతం చెరువు నీటిలో ఉండిపోయింది. ఈక్రమంలో సాగునీటి శాఖ అధికారులు దేవాదుల రెండోదశ పైపులైనును చెరువు శిఖం నుంచి వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ పైపులైను ఉన్న ఎయిర్ వాల్వులను తెరిచి రామప్ప చెరువును నింపేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. రామప్ప చెరువు పరివాహక ప్రాంతంలో పది ఎయిర్ వాల్వ్‌లు ఉన్నాయి. వీటిని తెరిస్తే పది రోజుల్లో రామప్ప చెరువు జలకళను సంతరించుకొని, గరిష్ట నీటిమట్టాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎస్సారెస్పీతో... శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మొదటి, రెండో దశ ప్రాజెక్టు నీటితో జిల్లాలోని చెరువులన్నింటినీ నింపేందుకు ఏర్పాట్లు చేయాలని సాగునీటిపారుల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వర్షాభావ ప్రాంతాల్లోని చెరువులకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఒక్కటే ఆధారం. భారీగా వరదలు వస్తేనే ఈ ప్రాజెక్టు కాలువల్లో నీరు వస్తుంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఈ ప్రాజెక్టు నుంచి నీరు వదిలేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా వదిలే నీటితో మన జిల్లాలోని చెరువులను నింపేందుకు అవకాశాలు ఉన్నాయి. 19 అడుగులకు చేరిన నీటిమట్టం వెంకటాపురం : మండలంలోని పాలంపేట రామప్ప సరస్సు నీటిమట్టం శనివారం సాయంత్రానికి 19 అడుగులకు చేరింది. కాగా, ఈ సరస్సు గరిష్ట నీటిమట్టం 36 అడుగులు. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
గణపతిదేవునిగా...సుమన్
ఓరుగల్లు రామప్ప దేవాలయ చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘రామప్ప’. ఇందులో గణపతిదేవునిగా సుమన్ నటించారు. కాశీవిశ్వనాథ్, విన్నీ ముఖ్య పాత్రలు చేశారు, ఓ ప్రత్యేక పాత్రలో సంగీతదర్శకుడు చక్రి నటించారు. ఈ చిత్రానికి పానుగంటి శశిధర్ దర్శకుడు. సాయిచరణ్ మూవీస్ పతాకంపై కుమార్ మారబోయిన నిర్మిస్తున్న ఈ చిత్రం రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘గ్రాఫిక్స్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే, చక్రిపై తీసిన ప్రత్యేక పాట యువతను బాగా అలరిస్తాయి. అన్ని వర్గాలవారూ చూడదగ్గ చిత్రం ఇది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మహిత్ నారాయణ్, కథాసేకరణ-స్క్రీన్‌ప్లే: ఎ.ఆర్.కె. సాయి, సమర్పణ: ఆమూరి శైలజామధుసూదన్.