21 అడుగులకు ‘రామప్ప’ నీటిమట్టం
వెంకటాపురం : మధ్యతరహా నీటి ప్రాజెక్టు అయిన రామప్ప సరస్సులోకి దేవాదుల జలాలను గత మూడు రోజులుగా ఎయిర్ వాల్వ్‌ల ద్వారా పంపింగ్ చేస్తున్నారు. దీంతో సరస్సులో నీటిమట్టం 21 అడుగులకు చేరుకుంది. మంగళవారం ఉదయం ఐదు ఎయిర్‌వాల్వ్‌లలో రెండింటికి 600 ఎం.ఎం వ్యాసార్ధం కలిగిన పైపులను బిగించి, భీంఘన్‌పూర్ వద్ద మోటార్లను ప్రారంభించారు. దీంతో ఎయిర్‌వాల్వ్‌ల ద్వారా పెద్ద మొత్తంలో దేవాదుల జలాలు సరస్సులోకి చేరాయి. దీంతో ఆయకట్టు రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.