రామప్ప కళ కళ
రామప్ప కళకళ
Published Mon, Sep 26 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
వెంకటాపురం : మండలంలోని రామప్ప చెరువు దేవాదుల నీటితో çకళకళలాడుతోంది. 36 అడుగుల నీటి సామర్థ్యం గల ఈ చెరువులో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు ఏ మాత్రం రాలేదు. పాకాల, లక్నవరం సరస్సులు నిండినా, రామప్పకు నీరు రాకపోవడంతో ఆయకట్టు రైతులు రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి అజ్మీర చందూలాల్ ద్వారా భారీ నీటి పారుదల శాఖ మాత్యులు హరీశ్‌రావు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో స్పందించిన మంత్రి హరీశ్‌రావు రామప్పలో ఉన్న దేవాదుల ఎయిర్‌వాల్‌్వలను ఓపె¯ŒS చేసి సరస్సు నిండేలా చర్యలు తీసుకోవాలని ఐబీ అధికారులను ఆదేశించారు. అదివారం దేవాదుల సిబ్బంది సరస్సులో ఉన్న ఆరు ఎయిర్‌వాల్‌్వలను ఒపె¯ŒS చేయగా, ఆ నీరంతా రామప్ప చెరువులోకి వచ్చింది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement