1884లోనే సెంటినరీ బాప్టిస్టు చర్చి నిర్మాణం
1956లో కేథ్రడల్ క్రీస్తు మందిరం
హన్మకొండ కల్చరల్ : చారిత్రాత్మక ఓరుగల్లుకు సువార్త సందేశం చేరి 135 ఏళ్లు అవుతోంది. ఎందరో మిషనరీ గురువులు తమ జీవితాలను త్యాగం చేసి సువార్త సందేశాన్ని మోసుకొచ్చి ఇక్కడ బీజం వేశారు. భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడి ప్రజల మత సామాజి క విషయాల్లో జోక్యం చేసుకోవద్దనే నిబంధనను పాటిస్తూ వచ్చిం ది. అయితే, 1813లో కొత్త చార్టర్ సిద్ధం చేస్తున్న సమయం లో డాక్టర్ విలియమ్ కేరీ స్పూర్తితో ఎవాంగ్లికన్స్ మత వ్యా ప్తికి ఇంగ్లాండ్ పార్లమెంట్‌లో చట్టంలో మార్పులు తీసుకొ చ్చారు. దీంతో క్రైస్తవ మిషనరీలు తమ సేవలను ప్రారంభిం చాయి. 1835లో అమెరికాలోని వర్జినీయాలో బాప్టిస్ట్ మిషన రీ కన్వెన్షన్ జరిగినప్పుడు తెలుగు ప్రాంతాల్లో సువార్త ప్రచా రం చేయాలని నిర్ణయించి రెవరెండ్ ఎస్‌ఎస్ డే దంపతులను ఇందుకోసం నియమించారు. 1836లోనే రెవరెండ్ ఎస్‌ఎస్ డే హన్మకొండను సందర్శించి క్రీస్తు విత్తు నాటడానికి సరైన స్థలంగా భావించారట. కానీ ఆయన విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరులో కొంతకాలం ఉండి 1845లో అమెరికా తిరిగి వెళ్లిపోయారు.
హైదరాబాద్ స్టేట్‌లో రెవరెండ్ డబ్ల్యూడబ్ల్యూ క్యాంప్‌బెల్ 1875లో మిషనరీ స్థాపించారు. అయితే, నల్లగొండ తదితర దూరప్రాంతాలకు వెళ్లడానికి ఆయనకు సహాయకులు అవసరం కావడంతో 1878లో ఒంగోలులో పనిచేస్తున్న రెవరెండ్ ఆల్బర్ట్ లారిడ్జ్‌ను పిలిపించుకున్నారు. కొందరు సహాయకులతో కలిసి 1879 జనవరి 11న హన్మకొండలోని కోర్టు వెనుక ఉన్న ఓ ఇంట్లో మిషనరీని స్థాపిం చారు. లారిడ్జ్‌కు తోడుగా ఆత్మకూరి రంగయ్య, బెజవాడ ఆంబ్రొసు, దళవాయి నారయ్య, కలపాల నర్సయ్య, దీనమ్మ పనిచేశారు. రెవరెండ్ ఆల్బర్ట్ లారిడ్జ్ సతీమణి ఎలిజెబెత్, దీనయ్య కలిసి స్త్రీల సమాజం ఏర్పాటు చేశారు. ఒంగోలులో ఇంజనీర్‌గా పనిచేస్తున్నప్పుడే రెవరెండ్ ఆల్బర్ట్ లారిడ్జ్ తెలు గు నేర్చుకోవడంతో ఇక్కడి ప్రజలతో కలిసి మాట్లాడటం సులభమైంది.
‘నిజాం’ అనుమతితో చర్చి నిర్మాణం
హన్మకొండలో ఏర్పాటుచేసిన మిషనరీస్ ద్వారా హన్మకొండతో పాటు బీమారం,వడ్డేపల్లి, గుండ్లసింగారంలో సువార్త ప్రచారం చేశారు. హన్మకొండ లష్కర్ బజారులో ప్రెంచ్, బ్రిటీష్ సైనిక నివాసాలు ఉండడంతో రెవరెండ్ ఆల్బర్ట్ లారిడ్జ్ ఇదే సరైన ప్రదేశమని భావించారు. ఇక నిజాం ప్రభు త్వ అనుమతితో 1880 జనవరి 4న చర్చి నిర్మాణానికి పూనుకోగా 1884 లో సెంటినరీ బాప్టిస్టు చర్చి నిర్మా ణం పూర్తయింది. ఆ తర్వాత భార్య ఎలి జబెత్ అనారోగ్యం కారణంగా లారిడ్జ్ తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత 1844 నుంచి 1886 వరకు రెవరెండ్ ఆల్ఫ్రెడ్ ఆగస్టస్ న్యూహాల్, 1886 నుంచి 1891 వరకు రెవరెండ్ రేమండ్ మెప్లీస్టన్, 1891 నుంచి1893 వరకు రెవరెండ్ థామస్ పార్కర్ డడ్లీ, 1893 నుంచి 1897 వరకు రెవరెండ్ ఆత్మకూరి రంగయ్య, 1897 నుంచి 1898 వరకు దలవాయి నారయ్య, 1898 నుంచి 1901వరకుచావలి ఆంధ్రయ్య, 1901 నుండి 1902 వరకు రెవరెండ్ వేసపోగు జాన్, ఆ తర్వాత రెవరెండ్ దాసరి ప్రసంగి, వేసపోగు ఆంబ్రోసు, జేడీ.ఎడ్వర్డ్, రెవరెండ్ ఎంఎస్‌ఎం.రామానుజులు, రెవరెండ్ వీఆర్.దేవదాసు, రెవరెండ్ రూబెన్ తదితరులు బాప్టిస్టు మిషన్‌పురోగతికితోడ్పడ్డారు. అనంతరం మిషన్ కార్యకలాపాలు విస్తరణకు నోచుకున్నాయి.
బాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్, సండే స్కూల్, విలి యంకేరి బాప్టిస్టు స్కూల్, వికలాంగుల కోసం రీచ్, బ్లైండ్‌స్కూల్ వంటివి ఏర్పాటు చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, చర్చికి వస్తున్న ఆరాధకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో జేడీ.ప్రసాద్ అధ్యక్షతన ఉన్న సంఘ కార్య నిర్వాహక కమిటీ 15వందల మంది ఒకేసారి ప్రార్థన చేసుకునేలా మరో పెద్ద చర్చి భవనం నిర్మించాలని తలపెట్టారు. చాడా పురుషోత్తంరెడ్డి డిజైన్ చేసిన ప్రస్తుత సెంటినరీ బాప్టిస్టు చర్చి నిర్మాణానికి 1991లో భూమిపూజ చేయగా 2005లో నిర్మా ణం పూర్తయింది. ప్రస్తుతం పాస్టర్‌గా రెవరెండ్ డాక్టర్ నిరంజన్‌బాబు పాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఫాతిమా కేథ్రడల్ చర్చి..
వరంగల్ జిల్లా కాజీపేటలో ఉన్న రోమన్ కేథ్రడల్ క్రీస్తు మందిర నిర్మాణానికి బిషప్ బెరట్టా 1956లో శంకుస్థాపన చేశారు. బ్రదర్ సారా ఈ చర్చికి కేథ్రడల్ గౌరవాన్ని కల్పించగా ఫాతిమా చర్చిగా పేరుపొందింది. ఈ చర్చి కారణంగానే ఈ ప్రాంతానికి ఫాతిమానగర్‌గా పిలుస్తున్నారు. ఇటలీ నిర్మాణశైలిలో ఎర్రని రంగురాయితో నిర్మించబడిన ఈ ర్చిలో విశాలపైన ప్రార్థనా వేదిక.. ఎదురుగా జీసెస్, మేరీ, జోసఫ్ విగ్రహాలు ఉంటాయి. నాలుగు ప్రక్కలా అమర్చబడిన రంగురంగుల అద్దాలు సూర్యరశ్మి సోకినంతనే శోభాయమానంగా రంగులు వెదజల్లుతాయి. చర్చి పైభాగంలో అమర్చబడిన శిలువ చాలా దూరం నుండి కూడా కనిపిస్తుంది. చర్చి భవనం లోపలి భాగంలో పైన జీసస్ విగ్రహం, కుడివైపు మరియామాత విగ్రహం, ఎడమ దిక్కు భాగంలో క్రీస్తు విశేషాలు కనిపిస్తాయి.
ఓరుగల్లు సందేశానికి 135 ఏళ్లు
Published Fri, Dec 25 2015 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM
Advertisement
Advertisement