rani rudrama
-
‘ప్రభుత్వాస్పత్రులకు నిధులు కేటాయించాలి’
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్లుగా ప్రభుత్వా స్పత్రులకు నిధులు కేటాయించకపోవడం వల్లే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ప్రజలు బలవుతున్నారని యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణీ రుద్రమ అన్నారు. ఆదివారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. శాశ్వత ప్రాతిపదికన వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాలు చేపట్టి ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. -
కొప్పుముడి ఖడ్గధారి
అమెరికన్ మిలటరీలో రాణీ రుద్రమ! ఫస్ట్ ‘అబ్జర్వెంట్’ సిక్కు గ్రాడ్యుయేట్. సైన్యానికి తన రూల్స్ ఉన్నాయి. ఆమెకు తమ ఆచారాలు ఉన్నాయి. ఆమె కోసం సైన్యం తనని మార్చుకుంది. ఖఢ్గం అమెరికాది. కొప్పు ఆమెది. వ్యక్తిగా తనని నిలుపుకుంటూనే..సైనిక శక్తిగా నిలబడింది అన్మోల్!! సైన్యం సైన్యంలా ఉండాలన్నది అమెరికన్ పాలసీ. సైన్యంలో స్త్రీలు ఉండొచ్చు. పురుషులు ఉండొచ్చు. ట్రాన్స్జెండర్లు ఉండొచ్చు. వివిధ మతాల వారు ఉండొచ్చు. ప్రధానంగా మాత్రం వారంతా సైనికులు. ఆచారాలు ఉంటే పక్కన పెట్టేయాలి. తలజుట్టు కత్తిరించుకోనంటే ఆర్మీలో చేరాలన్న ఆశల్ని కత్తిరించుకోవలసిందే. గడ్డం ఉండాల్సిందే అనుకుంటే ఆర్మీ కెరీర్‌కీ దూరంగా ఉండాల్సిందే. అయితే శనివారం న్యూయార్క్, వెస్ట్ పాయింట్‌లోని యు.ఎస్.మిలటరీ అకాడెమీలో జరిగిన ‘గ్రాడ్యుయేషన్ సెర్మనీ’లో హ్యాట్‌ను పైకి ఎగరేసిన పట్టుకున్న ఒక యువతి.. మిలటరీ డ్రెస్, చేతిలో ఖడ్గంతో పాటు కొప్పుముడితో సాక్షాత్కరించింది! అమెరికన్ ఆర్మీలో ఆచార పరాయణత్వాన్ని ప్రతిఫలింపజేసిన ఆ సిక్కు మహిళ.. అన్మోల్ నారంగ్ (23). అయితే తనేమీ నిబంధనలకు మినహాయింపు పొంది ఆకాడెమీలో చేరలేదు. మోకాళ్ల వరకు ఉండే తన జుట్టును నిబంధనలకు లోబడే మూడున్నర అంగుళాల చుట్టుకొలతను మించని కొప్పుగా ముడి వేసుకుని ‘క్యాడెట్’ శిక్షణ పూర్తి చేసింది. పట్టాతో పాటు, యు.ఎస్. మిలటరీ అకాడమీలో ‘ఫస్ట్ అబ్జర్వెంట్ ఫిమేల్ సిఖ్ గ్రాడ్యుయేట్’ గా గుర్తింపు పొందింది. 2017లో యు.ఎస్. మిలటరీ తన నిబంధనలను సడలించాక అబ్జర్వెంట్గా (ఆచారాలను వదలని సైనికురాలిగా) అకాడమీ నుంచి డిగ్రీతో బయటికి వచ్చిన తొలి సిక్కు మహిళ అన్మోల్ నారంగ్. ఇప్పటికే ఆమె అమెరికా సైన్యంలో ‘సెకండ్ లెఫ్ట్‌నెంట్’ హోదాలో ఉంది. ఇప్పుడిక కొత్తగా వచ్చిన డిగ్రీతో ‘బేసిక్ ఆఫీసర్ లీడర్షిప్ కోర్సు’ కూడా పూర్తి చేస్తే 2021 జనవరిలో జపాన్‌లోని ఓకినావాలో ఉన్న అమెరికన్ బేస్‌లో హై ర్యాంక్ ఆఫీసర్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించవచ్చు. అన్మోల్ అమెరికాలోనే పుట్టింది. జార్జియాలోని రాస్వెల్లో స్థిరపడిన రెండో తరం భారతీయ సంతతి కుటుంబంలోని అమ్మాయి అన్మోల్. తాతగారు (అమ్మవాళ్ల నాన్న) భారత సైన్యంలో చేశారు. అయితే సైన్యంలో చేరాలన్న అన్మోల్ ఆశలు ఆయన్నుంచి చిగురించలేదు. హైస్కూల్లో ఉండగా తల్లిదండ్రులతో కలిసి హానలూలు లోని ‘పెరల్ హార్బర్ నేషనల్ మెమోరియల్’ చూడ్డానికి Ðð ళ్లింది అన్మోల్. 1941 డిసెంబర్ 7 ఉదయం హానలూలు లోని పెరల్ హార్బర్లో ఉన్న అమెరికన్ నావికా స్థావర ంపై జపాన్ నౌకాదళం వైమానిక దాడులు జరిపింది. ఆ దాడిలో రెండు వేలమందికి పైగా అమెరికన్లు చనిపోయారు. మరో రెండు వేల మంది గాయపడ్డారు. అప్పటి వరకు తటస్థంగా ఉన్న అమెరికా పెరల్ హార్బర్‌పై జపాన్ దాడితో రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగవలసి వచ్చింది. మెమోరియల్‌లో ఆనాటి యుద్ధ జ్ఞాపకాలను చూస్తున్న అన్మోల్ ఆ క్షణమే అనుకుంది అమెరికన్ ఆర్మీలో చేరాలని. చేరడమే కాదు, తన ‘శత్రుదేశం’ జపాన్ని హద్దులో ఉంచడానికి అమెరికా సైనికాధికారిగా కూడా వెళ్లబోతోంది. వెస్ట్ పాయింట్లో చేరడానికి ముందు జార్జియాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అండర్గ్రాడ్యుయేట్ కోర్సు చేసింది అన్మోల్. న్యూక్లియర్ ఇంజినీరింగ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆమె సబ్జెక్టులు. ‘‘వెస్ట్ పాయింట్లో డిగ్రీ చెయ్యాలన్న నా కల ¯ð రవేరింది. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, మిలటరీలోని నిబంధనల సడలింపునకు అమెరికాలోని ‘సిక్కు కోఎలిషన్’ సంస్థ చేసిన పదేళ్ల పోరాటం నా కలను నెరవేర్చాయి’’ అంటోంది అన్మోల్ నారంగ్. పాసింగ్ అవుట్ పరేడ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లకు వారి తల్లిదండ్రులకు బదులుగా సైనికాధికారులు, వారి సతీమణులు ‘మిలటరీ స్టార్’లు తొడిగారు. ఆఫీసర్లే అమ్మానాన్నలు! యు.ఎస్. మిలటరీ అకాడమీలో ‘గ్రాడ్యుయేట్ సెర్మనీ’ జరిగిన రోజే మన డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. అక్కడి అకాడమీలో అన్మోల్ నార ంగ్ తన మత సంప్రదాయాన్ని నిలబెట్టుకున్న తొలి సిక్కు మహిళా గ్రాడ్యుయేట్‌గా గుర్తింపు పొందితే.. ఇక్కడి అకాడమీ.. పాసింగ్ అవుట్ పరేడ్‌కు గ్రాడ్యుయేట్ల తల్లిదండ్రులను ఆహ్వానించే సంప్రదాయాన్ని కరోరా కారణంగా నిలుపుకోలేకపోయింది. తల్లిదండ్రులకు బదులుగా భారత సైనిక అధికారులు, వారి సతీమణులు పట్టభద్రులైన యంగ్ ఆఫీసర్ల భుజాలకు స్టార్లను తొడిగారు. అమెరికన్ మిలటరీ అకాడమీ నుంచి 1100 మంది, ఇండియన్ మిలటరీ అకాడమీ నుంచి 423 మంది శిక్షణ పూర్తి చేసుకుని బయటికి వచ్చారు. -
కొట్లాడే ధైర్యం, నిబద్ధత ఉన్నాయి : రాణి రుద్రమ
సాక్షి, కరీంనగర్ : ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే చట్టసభలకు పోటీచేస్తున్నానని యువతెలంగాణ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణీ రుద్రమ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ పట్టణంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ప్రభుత్వంలో ప్రాతినిథ్యం కల్పించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను అవమానపరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖను కూడా మగవారే చీరలు కట్టుకొని పరిపాలిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలోఉద్యోగాల కోసం 100 నోటిఫికేషన్లు ఇస్తే 10 నోటిఫికేషన్లు కూడా పూర్తిగా భర్తీ చేయలేదని మండిపడ్డారు. ప్రధాన అభ్యర్థులను పట్టభద్రుల సమస్యలపై చర్చకు రావాలని డిమాండ్ చేస్తే ఎవరు స్పందించడం లేదని విమర్శించారు. ఒక్క అవకాశం ఇవ్వండి.. ‘ప్రతి డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులపై ప్రతి సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసేలా చూస్తా. ఎమ్మెల్సీగా గెలిస్తే ఏ సంవత్సరంలో ఖాళీ అయిన పోస్టులను అదే సంవత్సరంలో భర్తీ చేసేలా, నిర్ణీత గడువులోగా నియామకాలు జరిగేలా శాసన మండలిలో చట్టం కోసం ప్రతిపాదిస్తా. ఉద్యోగాల ప్రకటన వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసేలా చూస్తాను. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తా. నేరగాళ్లకు వరంలా మారిన సీఆర్పీసీ సెక్షన్ 41ఏ సవరణకోసం, సీపీఎస్ రద్దు, పీఆర్సీ, ఐఆర్ సకాలంలో వచ్చేలా చూస్తా. జర్నలిస్టుల హక్కులకోసం పోరాడతా. నాకు ప్రతి అంశంపై అవగాహన ఉంది. కొట్లాడే ధైర్యం, నిబద్ధత ఉన్నాయి. అవసరమైతే అసెంబ్లీ ముందు గాని, సీఎం కార్యాలయం ముందు గాని కూర్చుని ప్రజల తరఫున గళం వినిపిస్తా. కాబట్టి అవకాశం ఇవ్వాలి’ అని కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి రాణి రుద్రమ కోరారు. -
ఓ మహిళా.. ఏలుకో...
రాణిరుద్రమ పౌరుషం, సమ్మక్క-సారలమ్మ ధీరత్వానికి వారసత్వంగా నిలిచిన ఓరుగల్లులో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. చట్టసభలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1984లో కల్పనాదేవి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1967లో జిల్లా నుంచి మొదటిసారిగా మహిళా ఎమ్మెల్యే ఎన్నికయ్యూరు. ఆ తర్వాత 2004 నుంచి మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే ఉన్నారు. 2009లో ఒకేసారి నలుగురు మహిళలు ఎమ్మెల్యేలు గెలుపొంది రికార్డు సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. 1995లో 225 ఎంపీటీసీ, 17 మంది మహిళా జెడ్పీటీసీ సభ్యులు ఉంటే.. ఇప్పుడు 369 ఎంపీటీసీ, 25 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించనున్నారు. -
నా కల నెరవేరింది!
ఈ జనరేషన్లో మోస్ట్ లక్కీయెస్ట్ హీరోయిన్ అంటే అనుష్క పేరే చెప్పాలి. కొన్ని కొన్ని హైఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ కేరెక్టర్స్ విషయంలో డెరైక్టర్స్‌కి ఫస్ట్ చాయిస్ అండ్ బెస్ట్ చాయిస్ ఆమె. 2013 వత్సరం... ఆమె కెరీర్లో చాలా కీలకమైనది. ఈ ఏడాది మొదలైన మూడు భారీ ప్రాజెక్ట్స్‌లో ఆమె ముఖ్య తార. ఆ జాబితాలో మొదటిది ‘వర్ణ’. ఆర్య, అనుష్క జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సినిమాపై అనుష్క భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అనుష్కతో ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించింది. వర్ణ.. రుద్రమదేవి.. బాహుబలి... ఈ మూడూ మెగా ప్రాజెక్టులే. ఒకేసారి ఈ మూడు సినిమాలు చేయడం ఎలా అనిపిస్తోంది? ముందుగా నిర్మాత శ్యామ్ప్రసాద్రెడ్డిగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన నన్ను ‘అరుంధతి’కి ఎంపిక చేసినప్పుడు, నేను రెండే రెండు సినిమాలు చేశాను. పైగా, వాటిలో నావి గ్లామర్ రోల్స్. కానీ, ఓ నమ్మకంతో ‘అరుంధతి’కి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా నేనేంటో ప్రూవ్ చేసింది. దాంతో, అనుష్కకు నటనకు అవకాశం ఉన్న రోల్స్ ఇవ్వొచ్చని, శక్తిమంతమైన పాత్రలకు కూడా పనికొస్తాననే అభిప్రాయం చాలామందికి ఏర్పడింది. అందుకే, ఇలా మెగా ప్రాజెక్ట్స్‌కి అవకాశం వచ్చింది. ఈ మూడు కూడా అద్భుతమైన అవకాశాలు. బాధ్యతను పెంచిన చిత్రాలు కూడా. ఈ మూడు చిత్రాల్లో ఏది కష్టం? అలా చెప్పలేం. ఏ సినిమా కష్టం దానిదే. కాకపోతే, ‘వర్ణ’తో పోల్చితే ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల్లో ఫైట్స్ ఎక్కువ. ‘వర్ణ’లో నేను పోరాట యోధురాల్ని కాదు. సందర్భానుసారం కొన్ని ఫైట్స్ చేశాను. ఆర్య వారియర్ కాబట్టి, తనకు రిస్కీ ఫైట్స్ ఉన్నాయి. ఈ సినిమాకి మీరే హీరో అని ఆర్య అంటున్నారు..? సినిమాలో నేనూ కొన్ని ఫైట్స్ చేశాను కాబట్టి అలా అని ఉంటారు. కానీ, ఆర్య చేసిన పాత్రలు కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. నేను దేవుణ్ణి, వాడు-వీడు చిత్రాల్లో తను ఎంత అద్భుతంగా నటించారో తెలిసిందే. ఈ సినిమాలో కూడా నటనపరంగా ఆర్య విజృంభించారు. ‘వర్ణ’ అంటే ఏంటి.. ఇందులో మీరు రెండు పాత్రలు చేశారా? ఈ సినిమాలో నేను రెండు పాత్రల్లో కనిపిస్తాను. ఒక పాత్ర పేరు వర్ణ. సాదాసీదా అమ్మాయి. ఇంకోటి డాక్టర్ కేరక్టర్. ఒక పాత్ర సీరియస్‌గా, ఇంకోటి అమాయకంగా ఉంటుంది. రెండు భిన్నమైన పాత్రల్లో వ్యత్యాసం చూపించడానికి శాయశక్తులా కృషి చేశాను. సో.. ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందన్నమాట.. అదేం లేదు. రెండు విభిన్న ప్రపంచాలలో జరిగే కథ అనుకోవచ్చు. ఓ టిపికల్ లవ్‌స్టోరీతో తీసిన సినిమా. ప్రేమ కోసం ఎంతవరకూ వెళతామో సినిమా చూస్తే తెలుస్తుంది. నేటి తరానికి తగ్గ కథతోనే సినిమా ఉంటుంది. కథలో కొంచెం ఆధ్యాత్మికత కూడా ఉంటుంది. సెల్వరాఘవన్ అంటే.. రెండు, మూడేళ్లు సినిమా తీస్తారనే అభిప్రాయం ఉంది. ఈ సినిమా ఒప్పుకునేటప్పుడు మీకా ఆలోచన రాలేదా? ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కథ. కొన్ని కథలు వదులుకుంటే భవిష్యత్తులో మళ్లీ రాకపోవచ్చు. ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలాంటి సినిమా చేయాలనే నా కల ‘వర్ణ’తో నెరవేరింది. ‘వర్ణ’ అంగీకరించడానికి మరో కారణం సెల్వరాఘవన్. తనో అద్భుతమైన దర్శకుడు. అది అందరికీ తెలిసిన విషయం. కానీ, తెలియని విషయం ఏంటంటే, ఆయన ఎక్స్ట్రార్డనరీ పెర్ఫార్మర్. లొకేషన్లో ప్రతి సీన్ యాక్ట్ చేసి, చూపించేవారు. అలాగే, సీన్ చెప్పగానే ‘ఇలా తీస్తారేమో’ అని ఊహించుకునేదాన్ని. కానీ, అందుకు భిన్నంగా ఆయన టేకింగ్ ఉండేది. ఈ సినిమా చేయడంవల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక, సినిమా ఆలస్యం అయ్యిందంటే దానికి నేను, ఆర్య కూడా ఒక కారణమే. మేం మిగతా సినిమాలు చేయడంవల్ల డేట్స్ విషయలో కొంచెం ఇబ్బంది ఏర్పడింది. ఓ నటిగానే కాదు.. ఓ ప్రేక్షకురాలిగా కూడా ఇలాంటి సినిమా చూడ్డానికి ఇష్టపడతాను. చిత్ర నిర్మాతల గురించి? సినిమా మీద ఎంతో పేషన్ ఉన్నవాళ్లే ‘వర్ణ’లాంటివి తీయగలుగుతారు. ప్రసాద్‌గారు, వినయ్‌గారు కథని నమ్మి ఈ సినిమా నిర్మించారు. ఏ విషయంలోనూ రాజీపడలేదు. ఈ సినిమాకి వాళ్లు నిర్మాతలు కాబట్టే.. న్యాయం జరిగింది. ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లే కథతో రూపొందిన చిత్రం ‘వర్ణ’ అన్నారు. మరి.. మీరు ప్రేమలో పడితే, దానికోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి ట్రై చేస్తారా? అంత అవసరం రాదేమో అనుకుంటున్నా. ఎందుకంటే, నేను ప్రేమలో పడితే హ్యాపీగా పెళ్లి చేసుకుంటా. నా లవ్‌స్టోరీకి ఎలాంటి ఇబ్బందులు రావనుకుంటున్నా. అయితే మీది గ్యారంటీగా లవ్ మ్యారేజే అన్నమాట... ఏదీ ముందే చెప్పలేం. నచ్చిన వ్యక్తి తారసపడితే ప్రేమ వివాహం చేసుకుంటా. లేకపోతే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటా. అంటే.. ఇప్పటివరకూ ప్రేమలో పడలేదా? ఇప్పటికి పడలేదు. భవిష్యత్తులో పడతానేమో తెలియదు. అసలు ఎప్పుడో జరగబోయేవాటి గురించి ఇప్పుడే ఎలా ఊహించగలుగుతాం. అసలు పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? సదభిప్రాయమే ఉంది.