kalpana devi
-
ఆమె ఒక్కరే...
మహిళలకు ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు అని పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేస్తున్నా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టేందుకు మాత్రం ఉమ్మడి జిల్లా నుంచి అవకాశం రావడం లేదు. ఇప్పటి వరకు కేవలం టి కల్పనాదేవి ఒక్కరు మాత్రమే ఎంపీ గెలుపొందారు. వరంగల్, మహబూబాబాద్ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీలు అతివలకు అవకాశాలు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. సాక్షి, వరంగల్: వరంగల్, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక మహిళా ఎంపీ మాత్రమే ప్రాతినిథ్యం వహించారు. వరంగల్ ఎంపీగా డాక్టర్ టి కల్పనాదేవి 1984లో గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆమె కూడా పరాజయం పాలయ్యారు. వరంగల్, మానుకోట రెండు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే 26,657 మంది అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురు మహిళలు టికెట్ ఆశిస్తుండగా టికెట్ వచ్చేనే లేదో చూడాలి. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో అతివలకు అవకాశాలు కల్పించడంలో రాజకీయ పార్టీలు చిన్న చూపుచూస్తున్నాయి. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ తప్పనిసరి అని నిబంధన పెట్టడంతో పురుషులతో సమానంగా అవకాశాలు దక్కుతున్నా చట్ట సభలకు వచ్చే సరికి అంతంతమాత్రంగానే ఉంటుంది. వరంగల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు 15,18,907, మహిళా ఓటర్లు 15,45,564, ఇతరులు 223 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళ ఓటర్లు ఎక్కువ ఉండటంతో వచ్చే ఎన్నికల్లోనైనా మహిళలకు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. అభ్యర్థిత్వం ఆశించే మహిళలు ఉంటున్నా గెలుపోటములను బేరీజు వేసుకుంటూ రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటుండటంతో టికెట్లు దక్కడం లేదు. గెలిచి.. ఓడిన కల్పనాదేవి వరంగల్ లోకసభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 19 సార్లు ఎన్నికలు జరిగాయి. 1984లో హన్మకొండకు చెందిన డాక్టర్ టి.కల్పనాదేవి తెలుగుదేశం పార్టీ నుంచి వరంగల్ లోక్‌సభ సభ్యురాలిగా గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి కమాలోద్దిన్ అహ్మద్‌పై 8,456 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1989లో టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వరంగల్ లోకసభ ఏర్పాటైనప్పటి నుంచి ఏకైక మహిళా ఎంపీగా చరిత్రలో నిలిచారు. ప్రముఖ వైద్యురాలుగా పనిచేస్తూ టీడీపీ పార్టీలో చేరారు. 1990లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ ఉపాధ్యక్షురాలుగా, ఏఐసీసీ సభ్యురాలుగా పనిచేశారు. 2016 మే 29న గుండెపోటుతో మరణించారు. ప్రస్తుత ఆశావహులు.. వరంగల్ ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సింగపురం ఇందిర ఆశిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో పోటీచేసి ఓటమి చెందారు. మానుకోట అభ్యర్థిత్వం విషయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత మానుకోట టికెట్‌ను ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ వస్తుందో...గెలుపొంది చట్టసభల్లో ఎవరు అడుగుపెడతారో వేచి చూడాలి. -
తొలి మహిళా ఎంపీ కల్పనాదేవి
జిల్లా నుంచి లోక్‌సభకు తొలి మహిళగా డాక్టర్ కల్పనాదేవి స్థానం దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1984లో కల్పనాదేవి ఆ పార్టీలో చేరారు. అదే సంవత్సరంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కమాలుద్దీన్ అహ్మద్‌పై విజయం సాధించారు. కొంతకాలం ఆమె టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. జిల్లా రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించారు. తదుపరి జరిగిన పరిణామాల్లో 1994లో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉండగా కాంగ్రెస్‌లో చేరారు. 1999లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీగా రెండోసారి పోటీచేసి టీడీపీ అభ్యర్థి బోడకుంట్ల వెంకటేశ్వర్లు చేతిలో ఓడిపోయూరు. పీసీసీ, ఏఐసీసీ సభ్యురాలుగా కొనసాగారు. ప్రస్తుతం పీసీసీ మెంబర్‌గా ఉన్నారు. కల్పనాదేవి కేఎంసీ మొదటి బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్థిని. ఆమె ఎంజీఎం డెవలప్మెంట్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. మహిళా నాయకురాలిగా ప్రత్యేకతను సాధించారు. -న్యూస్‌లైన్, వరంగల -
ఓ మహిళా.. ఏలుకో...
రాణిరుద్రమ పౌరుషం, సమ్మక్క-సారలమ్మ ధీరత్వానికి వారసత్వంగా నిలిచిన ఓరుగల్లులో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. చట్టసభలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1984లో కల్పనాదేవి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1967లో జిల్లా నుంచి మొదటిసారిగా మహిళా ఎమ్మెల్యే ఎన్నికయ్యూరు. ఆ తర్వాత 2004 నుంచి మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే ఉన్నారు. 2009లో ఒకేసారి నలుగురు మహిళలు ఎమ్మెల్యేలు గెలుపొంది రికార్డు సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. 1995లో 225 ఎంపీటీసీ, 17 మంది మహిళా జెడ్పీటీసీ సభ్యులు ఉంటే.. ఇప్పుడు 369 ఎంపీటీసీ, 25 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించనున్నారు. -
కల్పనకు కాంస్యం
న్యూఢిల్లీ: భారత జూడో క్రీడాకారిణి కల్పనా దేవి... ఐజేఎఫ్ గ్రాండ్‌ప్రి ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకుంది. దీంతో ఈ ఈవెంట్లో తొలిసారి భారత్‌కు పతకాన్ని అందించిన ఘతను దక్కించుకుంది. తాష్కెంట్లో జరుగుతున్న ఈ టోర్నీలో 52 కేజీల విభాగం రెప్‌చేజ్ రౌండ్లో కల్పన... రాక్వెల్ సిల్వా (బ్రెజిల్)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో జరిఫా సుల్తోనోవా (ఉజ్బెకిస్థాన్)పై గెలిచిన ఆమె.. తర్వాతి రౌండ్లో గిలి కోచెన్ (ఇజ్రాయెల్) చేతిలో ఓడింది. అయితే కోచెన్ ఫైనల్‌కు చేరుకోవడంతో కల్పన రెప్‌చేజ్ రౌండ్‌కు అర్హత సాధించింది. ఇండో-టిబెటియన్ బోర్డర్ పోలీసుగా పని చేస్తున్న కల్పన ఉజ్బెకిస్థాన్ (2010 సెప్టెంబర్)లో జరిగిన ప్రపంచకప్ జూడో చాంపియన్‌షిప్‌లోనూ కాంస్యంతో మెరిసింది.