కల్పనకు కాంస్యం | Judoka Kalpana wins bronze at IJF Grand Prix in Tashkent | Sakshi
Sakshi News home page

కల్పనకు కాంస్యం

Published Sun, Oct 6 2013 1:53 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

కల్పనకు కాంస్యం

కల్పనకు కాంస్యం

న్యూఢిల్లీ: భారత జూడో క్రీడాకారిణి కల్పనా దేవి... ఐజేఎఫ్ గ్రాండ్‌ప్రి ఈవెంట్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. దీంతో ఈ ఈవెంట్‌లో తొలిసారి భారత్‌కు పతకాన్ని అందించిన ఘతను దక్కించుకుంది. తాష్కెంట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో 52 కేజీల విభాగం రెప్‌చేజ్ రౌండ్‌లో కల్పన... రాక్వెల్ సిల్వా (బ్రెజిల్)పై విజయం సాధించింది.

అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో జరిఫా సుల్తోనోవా (ఉజ్బెకిస్థాన్)పై గెలిచిన ఆమె.. తర్వాతి రౌండ్‌లో గిలి కోచెన్ (ఇజ్రాయెల్) చేతిలో ఓడింది. అయితే కోచెన్ ఫైనల్‌కు చేరుకోవడంతో కల్పన రెప్‌చేజ్ రౌండ్‌కు అర్హత సాధించింది. ఇండో-టిబెటియన్ బోర్డర్ పోలీసుగా పని చేస్తున్న కల్పన ఉజ్బెకిస్థాన్ (2010 సెప్టెంబర్)లో జరిగిన ప్రపంచకప్ జూడో చాంపియన్‌షిప్‌లోనూ కాంస్యంతో మెరిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement