జిల్లా నుంచి లోక్‌సభకు తొలి మహిళగా డాక్టర్ కల్పనాదేవి స్థానం దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1984లో కల్పనాదేవి ఆ పార్టీలో చేరారు. అదే సంవత్సరంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కమాలుద్దీన్ అహ్మద్‌పై విజయం సాధించారు.
కొంతకాలం ఆమె టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. జిల్లా రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించారు. తదుపరి జరిగిన పరిణామాల్లో 1994లో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉండగా కాంగ్రెస్‌లో చేరారు. 1999లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీగా రెండోసారి పోటీచేసి టీడీపీ అభ్యర్థి బోడకుంట్ల వెంకటేశ్వర్లు చేతిలో ఓడిపోయూరు. పీసీసీ, ఏఐసీసీ సభ్యురాలుగా కొనసాగారు. ప్రస్తుతం పీసీసీ మెంబర్‌గా ఉన్నారు.
కల్పనాదేవి కేఎంసీ మొదటి బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్థిని. ఆమె ఎంజీఎం డెవలప్‌మెంట్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. మహిళా నాయకురాలిగా ప్రత్యేకతను సాధించారు.
-న్యూస్‌లైన్, వరంగల