మేడారంపై గిరిజన శాఖ నిర్లక్ష్యం
సాక్షిప్రతినిధి, వరంగల్: గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విషయంలో గిరిజన సంక్షేమ శాఖ దారుణంగా వ్యవహరిస్తోంది. మేడారం పరిసరాల్లో మెరుగైన ఏర్పాట్లు చేసి జాతర గొప్పదనాన్ని అందరికీ తెలిసేలా చేయాల్సిన ఆ శాఖకు.. కనీసం సాధారణ పనులు చేసేందుకు చేతులు రావడం లేదు. మేడారం జాతర ఏర్పాట్లలో తన వంతుగా చేపట్టే పనులకు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) రూ.10 కోట్లతో ప్రణాళిక రూపొందించింది. కోటి మంది భక్తులు వచ్చే జాతరకు రూ.10 కోట్లు అంటే.. కచ్చితంగా మంజూరవుతాయని ఐటీడీఏ భావించింది. కానీ, ఐటీడీఏ కోరిన నిధుల్లో 50 శాతమే మంజూరయ్యే పరిస్థితి ఉందని గిరిజన శాఖ చెప్పి ప్రణాళిక ఖర్చును రూ.5.80 కోట్లకు తగ్గించింది.
దీంట్లో రూ.4.99 కోట్లు రోడ్ల అభివృద్ధికి, రూ.1.56 కోట్లు తాగునీటి సరఫరా పనులకు కేటాయించింది. నిధులను తగ్గించిన ఆ శాఖ.. మంజూరు విషయంలోనూ దారుణంగా వ్యవహరిస్తోంది. జాతర దగ్గరపడుతున్నా ఇప్పటికి కేవలం రూ.1.42 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మేడారంలోని గిరిజన గురుకుల కళాశాల నుంచి వనం రోడ్డు వరకు 600 మీటర్ల బీటీ రోడ్డు వేసేందుకు రూ.42 లక్షలు, ఊరట్టం కాజ్‌వే నుంచి గ్రామానికి 800 మీటర్ల సీసీ రోడ్డుకు రూ.52 లక్షలు చొప్పున ప్రణాళికలో పెట్టారు. చిలుకలగుట్టకు వెళ్లే 800 మీటర్ల సీసీ రోడ్డు వెడల్పునకు రూ.48.50 లక్షలు, దొడ్ల నుంచి కొండాయి బ్రిడ్జి వరకు 1.5 కిలో మీటర్ల బీటీ రోడ్డుకు రూ.1.10 కోట్లు, ఆర్‌అం డ్‌బీ పరిధిలోని మేడారం నుంచి చిలుకలగుట్ట కు ఉన్న 1.50 కిలో మీటర్ల రోడ్డుకు రూ.1.20 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. అలా గే మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌజ్ మరమతులకు రూ.6 లక్షలు, కాటేజీకి రూ.4 లక్షలు, క్యాంప్ ఆఫీసుకు రూ.3 లక్షల వెచ్చించాలని నిర్ణయించారు.
అరుుతే గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధుల రాకపోవడంతో ఈ పనులు ముందుకుసాగడంలేదు. మేడారం జాతరలో కీలకంగా వ్యవహరించే ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సర్పరాజ్ నెల రోజులుగా సెలవులో ఉ న్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ సంజీవ య్య ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగం అధికారి సైతం ప్రస్తుతం సెలవులోనే ఉన్నారు. పూర్తి స్థాయి అధికారులు లేకపోవడంతో ఐటీడీఏ పనుల పర్యవేక్షణ జరగడంలేదు.