sanjeevaiah
-
ఏపీలో ‘థర్మల్’ ధగధగ
నాడు రాష్ట్రంలో విద్యుత్తు కోతలు... పారిశ్రావిుక రంగంలో వెతలు, జనం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, విద్యుత్తు కార్యాలయాల ముందు ధర్నాలు. రాత్రీ, పగలూ ఒకటే యాతన. ఇటు వ్యవసాయ రంగం, అటు పారిశ్రామిక రంగం కుదేలు. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమల కష్టాలు చెప్పనవసరం లేదు. పవర్ హాలీడేలతో నరక యాతనే. నేడు కరెంటు కష్టాలు లేవు...కోతలు అసలే లేవు. జనంలో అప్పటి మాదిరిగా ఆగ్రహోద్వేగాల జాడే లేదు. పారిశ్రామికం, వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్తు సరఫరా కావడంతో ఆయా రంగాల్లో ఉత్పత్తి భేషుగ్గా నమోదవుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకుల మోముల్లో దరహాసం కనిపిస్తోంది. దీనికి కారణం సీఎం జగన్ తీసుకున్న చర్యలు.. దూర దృష్టి. సాక్షి, అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపు ఫలితంగా రాష్ట్రంలో గత ఐదేళ్లుగా విద్యుత్ వెలుగులీనుతోంది. విద్యుదుత్పత్తికి ఎలాంటి అవరోధాలు లేకపోవడంతో వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడానికి జగన్ ముందు చూపే కారణం. చంద్రబాబు హయాంలో ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు సామరŠాధ్యనికి తగ్గట్టుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేని దుస్థితిలో ఉండేవి. అవే ప్లాంట్లు జగన్ పాలనలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అదనపు సామరŠాధ్యన్ని జోడించుకుని పురోగతిని సాధించాయి. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో దాదాపు 45 శాతం ఏపీ జెన్కో థర్మల్ ప్రాజెక్టుల నుంచే సమకూరుతోందంటే రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాçßæమే ప్రధాన కారణం. అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైందని ఆ రంగ నిపుణులే చెబుతున్నారు. గత ప్రభుత్వ అసమర్థత శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం)లో రూ.8,432 కోట్ల అంచనా వ్యయంతో స్టేజ్ 1ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, 2012లో ఒక యూనిట్ 800 మెగావాట్లు, 2013లో మరో 800 మెగావాట్ల యూనిట్‌ను పూర్తి చేయాలని నిర్ధేశించారు. కానీ అలా జరగలేదు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నడిచే మొదటి ప్రాజెక్ట్ ఇది. విదేశీ తయారీదారుల నుంచి సాంకేతికతను బదిలీ చేయడంలో అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రాజెక్ట్ ప్రారంభించడంలో జాప్యం చోటుచేసుకుంది. తర్వాత అంచనా వ్యయం రూ.12,230 కోట్లకు పెంచారు. అయితే స్టేజ్ 1 నిర్మాణం కోసం తీసుకున్న రూ.12942.28 కోట్ల అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. అవన్నీ కలిపి మొత్తంగా రూ.20 వేల కోట్లకు చేరాయి. వీటిలో గత ప్రభుత్వం అసమర్ధత కారణంగా రూ.4200 కోట్లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గుర్తించలేదు. అప్పులతోపాటు రూ.2106.75 కోట్ల నష్టాల్లోకి ప్లాంటు వెళ్లిపోయింది. జగన్ సర్కారు సమర్ధత అలాంటి ప్లాంటులో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి చేయూతనందించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు త్వరితగతిన పనులు పూర్తి చేయించి, గతేడాది మార్చిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారు. అక్కడితో ఆగలేదు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణంపైనా దృష్టి సారించించారు. గతేడాది డిసెంబర్లో దానినీ అందుబాటులోకి తెచ్చారు. బొగ్గు కొరతకు చెక్ దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జగన్ సర్కారు ప్రణాళికలు అమలు చేస్తోంది. గతంలో ఒక్క రోజు నిల్వలకే అప్పటి ప్రభుత్వం నానా తంటాలు పడేది. ఉత్పత్తి లేక విద్యుత్ కోతలు విధించేది. ► ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు సమకూర్చుకుంటున్నాయి. ►సాధారణంగా 65 శాతం నుంచి 75 శాతం వరకు ఉండే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ వద్ద 1000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ►ఈ మేరకు వీటీపీఎస్‌లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,12,350 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ►ఆర్టీపీపీలో 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి వస్తే అక్కడ 1,28,715 మెట్రిక్ టన్నులు తెచ్చి ఉంచారు. కృష్ణపట్నంలో 29 వేలు ఉత్పత్తికి వాడాల్సి ఉంటే 9,0971 మెట్రిక్ టన్నులు అందుబాటులో పెట్టారు. ►ఈ నిల్వలు వారం రోజుల వరకూ విద్యుత్ ఉత్పత్తికి సరిపోతాయి. బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ► కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతోపాటు, టెండర్ల ద్వారా విదేశీ బొగ్గును రప్పించుకుంటున్నాయి. ►శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించేలా ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ►ఇది కాకుండా థర్మల్ కేంద్రాలకు ఎంసీఎల్ నుంచి ఏటా 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) చేసుకుంది. ►ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్‌సీసీఎల్‌లు డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ)కు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. -
పవన్ ఒక డ్రైనేజీ స్టార్.. మురికి కాలువలో పవన్ కళ్యాణ్
-
పచ్చదళం దుష్ప్రచారం
నాయుడుపేట టౌన్: ‘కురుక్షేత్ర రక్షణ సమితి’ పేరుతో డబ్బులు దండుకునే స్వామిజీని అడ్డం పెట్టుకుని పచ్చదళం తనపై దుష్ప్రచారం చేస్తోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యుడు కిలివేటి సంజీవయ్య ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను 2015లో సూళ్లూరుపేటలో జరిగిన ఈస్టర్ వేడుకల్లో పాల్గొని క్రైస్త్రవుల అభ్యర్థన మేరకు శిలువ లాగిన ఫొటోలను టీడీపీ నేతలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి హిందూ వ్యతిరేకిననే ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన కుటుంబ సభ్యులు పుట్టుకతోనే హిందువులమని, హిందూ మతంపై తనకు అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పారు. తాను హిందువుగానే మరణిస్తానన్నారు. తమ కులదైవం కూడా కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి అని చెప్పారు. శాసనసభ్యుడిగా అన్ని మతాలు, అన్ని కులాల వారిని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. హిందూ, క్రైస్తవ, ముస్లిం, జైన మతస్తుల పండుగ రోజుల్లో వారి ఆహ్వానం మేరకు వెళ్లి వారి మనోభావాల మేరకు వేడుకల్లో పాల్గొనడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. గతంలో మాజీ సీఎం చంద్రబాబు చర్చికి వెళ్లి శిలువ మోశారని, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సైతం చర్చిలో ప్రార్థనలకు హాజరయ్యారని, అంతమాత్రాన వారు క్రైస్తవులుగా మారిపోతారా అంటూ ఆ ఫొటోలను చూపించి నిలదీశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారని, ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. హైందవ ధర్మానికి కట్టుబడి టీటీడీ సభ్యుడిగా సేవలు అందిస్తానని సంజీవయ్య స్పష్టం చేశారు. -
ఓటు అడిగే అర్హత ఒక్క వై ఎస్ ఆర్ కాగ్రెస్ కె ఉంది
-
భీమిలి సబ్‌రిజిస్ట్రార్ సంజీవయ్య అరెస్ట్
-
ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్
బయటపడిన ఆస్తులు రూ.30 కోట్లకు పైనే? హైదరాబాద్: ఏసీబీ అధికారుల వలకు మరో అవినీతి తిమింగళం చిక్కింది. గ్రేడ్ వన్ సబ్-రిజిస్ట్రార్ అధికారి ఇంటిపై ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు బయటపడ్డారుు. అధికారుల దాడుల్లో మరికొన్ని ఆస్తుల వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఏపీలోని విశాఖప ట్నం జిల్లా భీముని పట్నం సబ్- రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న బిల్లా సం జీవయ్య హైదరాబాద్ వనస్థ లిపురం విజయపురికాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఏపీ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ అధి కారులు సోమవారం సంజీ వయ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు. సంజీవయ్యకు విజయపురి కాలనీలో ఇల్లు, సరూర్ నగర్లో భార్య జాయ్ కుమారి పేరున ఫ్లాట్, ప్రకాశం జిల్లా మార్టూర్‌లో ఒక ఇల్లు, హయత్‌నగర్, వనస్థలిపురం, మార్టూర్, సొంతూరు పెద్దఅంబడి పూడి (ఏపీ)లో మొత్తం 15 ఇళ్ల స్థలాలు, పెద్దఅంబడి పూడిలో తండ్రి, మేన ల్లుడి పేరున 16 ఎకరా లున్నట్లు గుర్తించారు. వనస్థలి పురం ఇంట్లో అరకిలో బంగారం, పావుకిలో వెండి, రూ. 2.50 లక్షల నగదు, బ్యాంకుల్లో రూ.12 లక్షలు, ఎఫ్డీలు రూ.8.50 లక్షలు, రూ.10.50 లక్షల విలు వైన ప్రామిసరీ నోట్లు, రూ.10 లక్షలు ఎల్ఐసీ పాలసీలు, పోస్టల్ డిఫాజిట్లు బయటపడ్డారుు. బ్యాంక్ లాకర్లు తెరవాల్సి ఉందని ఏసీబీ డిప్యూటీ డెరైక్టర్ కె.జగన్నాధరెడ్డి తెలిపారు. బయట పడిన ఆస్తులు డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం రూ.3 కోట్లు ఉండవచ్చని, మార్కెట్ వాల్యూ ప్రకారం రూ.30 కోట్లకు పైగానే ఉంటుందని అధికా రులు భావిస్తున్నారు. ఈ దాడుల్లో డీఎస్పీలు ఎస్వీవీ.ప్రసాద్‌రావు, షకీలాభాను, ఇన్స్పెక్టర్లు సతీష్, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
పురోహితుడి ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్
పురోహితుని ఆత్మహత్య కేసులో ఎట్టకేలకు అరెస్టుల పర్వం మొదలైంది. ఈ కేసు విచారణలో జరుగుతున్న జాప్యంపై సాక్షి’లో వస్తున్న వరుస కథనాలతో స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిని గురువారం పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పద్మానగర్ ఫేజ్-2 కు చెందిన శ్రీనివాసాచార్యులు కుమారుడు భాస్కర కృష్ణ స్వరూప్ (భాస్కరాచార్యులు) స్థానిక మహిళతో చనువుగా ఉంటున్నాడని కాలనీవాసులు చేయి చేసుకోవడంతో మనస్తాపానికి గురై ఈనెల 11న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారన్న పుకార్లు షికార్లు చేయడంతో పాటు పురోహితుని ప్రాణానికిరూ.5 లక్షలు వెల కట్టడంపై సాక్షి’ గురువారం ఓ కథనాన్ని ప్రచురించింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు స్థానిక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, భాస్కరకృష్ణను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై మెహర్సాయి హైస్కూల్ అధినేత విజయభాస్కరరాజు, కృష్ణం నాయుడు, సంజీవయ్య, రామకృష్ణ, సత్యనారాయణ, రాంరెడ్డిలను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు. -
పొదలకూరులో రూ.4 లక్షల చోరీ
నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని శివాలయం పక్కన ఉన్న కట్టెల వ్యాపారి సంజీవయ్య ఇంట్లో మంగళవారం వేకువజామున దొంగలుపడి రూ.4లక్షల విలువైన నగదు, నగలు చోరీ చేశారు. సంజీవయ్య కుటుంబసభ్యులతో ఇంటి ముందర నిద్రిస్తుండగా దొంగలు పడి బీరువా లాకర్ తెరిచి 1.5లక్షల రూపాయల నగదు, 2.5 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు దోచుకెళ్లారు. ఉదయం గమనించిన సంజీవయ్య పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ప్రసాద్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలను సేకరించారు. -
అభివృద్ధి పథకాలకు ఆద్యుడు సంజీవయ్య
భారతదేశంలో కెల్లా ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన వారిలోను, అఖిల భారత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నలంకరించిన వారిలోనూ అతిపిన్న వయస్కుడు దామోదరం సంజీవయ్య. ఒక హరిజనుడు రాష్ర్టంలో ముఖ్యమంత్రి కావడం, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం దేశ చరిత్రలో సంజీవయ్యతోనే మొదలైంది. ఆయన అనేక కష్టాలకోర్చి పట్టుదలతో చదువుకుని ఎదిగివచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ర్టంలో రాజాజీ మంత్రి వర్గంలో చేరే నాటికి ఆయన వయసు 31 ఏళ్ళు మాత్రమే. 1950లోనే 29వ ఏట పార్లమెంటుకు ఎంపికై ఏడాది పాటు సభ్యుడిగా వ్యవహరించారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో మద్రాసు శాసన సభకు కర్నూలు రిజర్వుడ్ సీటు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది రాజగోపాలాచారి ప్రభుత్వంలో సహకారశాఖకు మంత్రిత్వం వహించారు. 1953లో టంగుటూరి ప్రకాశం పంతులు గారి మంత్రి వర్గంలో కూడా సాంఘిక సంక్షేమ, ప్రజారోగ్య శాఖల మంత్రిగా పనిచేశారు. 1955 మధ్యంతర ఎన్నికలలో ఎమ్మిగ నూరు నుండి ఎన్నికై బెజవాడ గోపాలరెడ్డి మంత్రి వర్గంలో రవాణా, సహకార శాఖల మంత్రిగా, రాష్ట్రావతరణ (1956) జరిగిన తదుపరి నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో స్థానిక సంస్థలు, కార్మికశాఖల మంత్రిగా పనిచేశారు. 1960లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా దళితుడైన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కావడం దేశంలోనే ఒక సంచలనం. 1960 జనవరి 11వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేసేనాటికి ఆయన వయసు 38 ఏళ్లు మాత్రమే. అప్పటికే మంత్రిగా 8 ఏళ్ళ అనుభవం ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం (1960-1962) రెండేళ్ళ స్వల్పకాలమే అయినా సామాజికాభ్యుదయ కార్యక్రమాలను చేపట్టారు. ఆనాడు ఆయన చేపట్టిన పలు విధానాలు ముందు తరాలకు మార్గదర్శకాలైనాయి. పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది వీరే. అవినీతి నిరోధక శాఖల ఏర్పాటు, వృద్ధాప్య పెన్షన్లు, కార్మికులకు బోనస్ ఇచ్చే పద్ధతికి వీరే ఆద్యులు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భూసంస్కరణలను కట్టుదిట్టంగా అమలు చేసి ఆరులక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిపెట్టారు. చట్టాలను సమన్వయ పర్చడానికి ‘లా కమిషన్’ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు లోనే విధిగా ఉత్తరప్రత్యుత్తరాలు జరగాలని ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమాభివృద్ధి కోసం భారీ పరిశ్రమలు, లఘుపరిశ్రమల విభాగాలు, గనుల అభివృద్ధి కోసం మూడు కార్పొరేషన్లను స్వతంత్ర ప్రతిపత్తి హోదాలో ఏర్పాటు చేశారు. అప్పటి వరకు వేరుగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాదు కార్పొరేషన్లను ఏకం చేసి ‘గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) కార్పొరేషన్’ గా రూపొందించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో కోడుమూరు నుండి ఎంపికైనా ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయలేదు. సంజీవరెడ్డి ముఖ్య మంత్రి అయ్యారు. తర్వాత నెహ్రూ జాతీయ కాంగ్రెస్ పదవిని సంజీవయ్యకు కట్టబెట్టారు. సంజీవయ్యను రెండేళ్ళు దాటి ముఖ్య మంత్రిగా అంగీకరించలేకపోయిన సమాజం మనది. ఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. 1967లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయి ఆపై రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. శ్రీమతి ఇందిరాగాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రిల మంత్రి వర్గాల్లో కూడా పనిచేశారు. దామోదరం సంజీవయ్య స్వయంగా కవి, సాహితీప్రియుడు, నటుడు. కాలేజి రోజుల్లోనే ‘కృష్ణలీలలు’లో పద్యాలు రాశారు. భీష్మజననం, శశిరేఖాపరిణయం, గయోపాఖ్యానం వంటి నాట కాలు కొన్నింటికి పద్యాలు వాశారు. సంజీవయ్య కందం ఎంత తేలికగా చెప్పగలరో, ఆటవెలదిని అంత తియ్యగా అల్లగలరు. ప్రసిద్ధి నటులచే ప్రదర్శనలిప్పించారు. తానుగా స్వయంగా ‘‘షాజహాన్ నాటకంలో’’ షాజహాన్ పాత్రను అద్భుతంగా పోషించినట్లు వినికిడి. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన అధ్యక్షతలోనే అఖిలభారత తెలుగు రచయితల మహాసభ మొదటిసారిగా హైదరాబాద్‌లో జరిగినది. ఆనాటి భారత ఉప రాష్ర్టపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ మహాసభలను ప్రారంభించారు. అప్పటి కేరళ గవర్నర్ బూర్గుల రామకృష్ణారావు, కేంద్రమంత్రి బెజవాడ గోపాలరెడ్డి వంటి వారు ఈ మహాసభల్లో పాల్గొని సంజీవయ్య కృషిని అభినందించారు. ఆయన స్వయంగా వేదాలు, భారత, భాగవత, రామాయణాది గ్రంథాలను అధ్యయనం చేసి ఉండటం ఆ రోజుల్లో అంత సామాన్య విషయంకాదు. నేటి భారత రాజకీయ పరిస్థితుల్లో షెడ్యూల్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల వారి జీవన పరిస్థితులు మెరుగు పడాలంటే, ప్రధాని, ముఖ్యమంత్రుల పదవులు కనీసం శతాబ్దం పాటైనాఈ వర్గాలకు రిజర్వేషన్ చేయాలి. యుగయుగాలు బాధలకు, అవమానాలకు గురైన ఈ వర్గాలకు ఆపాటి రిజర్వేషన్ రాజ్యాంగ బద్దంగా కల్పించడాన్ని అన్ని రాజకీయ పార్టీలు నిజాయితీతో ముందుకు వస్తేనే అసలుసిసలైన సామాజిక న్యాయం జరుగుతుంది. రాజాకీయ పార్టీలు మాటలుగాక, చేతల ద్వారా తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. దేశంలో మార్పును నిజంగా కోరుకునే వారు, బడుగుల ఆత్మగౌరవం కాపాడుతామనే వారు, బడుగులకు రాజ్యాధికారం కట్టబెడతామనేవారు తమ బడుగుల మెజారిటీ, వారిదే అధారిటీ అనేవారు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవుల రిజర్వేషన్‌కు అంగీకరిస్తేనే వారి అంకితభావానికి అర్దం, పరమార్ధం ఉంటాయి. దళితులు తాము భారతీయులమని సగర్వంగా చెప్పుకునే రోజుల కోసం ఎదురుచూస్తున్నారు. రాజ్యాంగాన్ని సవరించి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను రిజర్వేషన్ కిందకు తీసుకురావాలి. దళితులకు, తాము దళితులమనే భావన నుంచి దూరం చేయాలి. ప్రస్తుత సామాజిక పరిస్థితులు వారిని వేధిస్తున్నాయి. కుల వ్యవస్థను తొలగించడానికి ఆరున్నర దశాబ్దాల్లో జరిగినది శూన్యం. చట్టపరంగా సమానహక్కులు వున్న ఈ చట్టాలు అమలుకు నోచుకోనులేదు. సామాజిక న్యాయానికి కట్టుబడివు న్నామని గొప్పలు చెప్పుకునే పాత్రలు ఈ దశగా ఆలోచించవల్సిన తరుణం ఆసన్నమైంది. ఉద్యమాలకు తావులేని విధంగా రాజకీయ పార్టీలు స్పందించాలి. దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో (కర్నూలుకు 8 కి.మీ. దూరం) మాలదాసరులైన మునెయ్య, సుంకలమ్మ దంపతులకు కడపటి (5వ) సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు సంగీతం, కళాత్మక సాంప్రదాయ కుటుంబ నేపథ్యము కలిగియుండుట వలన ఆయన నావి జీవతంలో సాహితీ, కళల రంగాలపట్లా ఆసక్తి కలగటానికి ప్రేరణ కలిగిందాయనకు. కుల వివక్షత ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ సమాజంలో తాను ఉన్నతస్థ్థితికి ఎదగాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యపడుతుందని సంజీవయ్య నిరూపించారు. ప్రతి పదవిలోను ఆయన రాణించారు. ఎన్నో పదవులలో ఎంతో కాలంపాటు కొనసాగినప్పటికీ ఆయన నిర్దనుడే. ఏదో ఒక ప్రాంతమునకు ఒక వర్గమునకు చెందిన వ్యక్తిగాదు. రాజకీయ రంగంలో అతి చిన్నవయసులో అత్యున్నత శిఖరాలను అందుకుని ప్రజాసేవాయే పరమావదిగా, నిస్వార్ధపరునిగా స్వలాభపేక్ష లేకుండా ప్రజల మనిషిగా ఎదిగిన దామోదరం సంజీవయ్య లాంటి జనాదరణ కలిగిన దళిత నేత నేడు సీమాంధ్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా కావాలి. (నేడు దామోదరం సంజీవయ్య 95వ జయంతి) వ్యాసకర్త విశ్రాంత ఉద్యోగి, భారత ప్రభుత్వ అణుఇంధన సంస్థ మొబైల్ : 80081 89979 - వి. సర్వేశ్వరరావు -
సీటు వదలరా ?
బదిలీ అయినా.. కదలని అధికారులు ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు జాతర ముగిసినా జిల్లాలోనే విధులు ఉన్నవారు వెళితేనే.. కొత్తవారు వచ్చేది సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిన అధికారులు.. వాటిని పట్టించుకోవడం లేదు. జిల్లాలోని ఉన్నతాధికారులకు సర్కారు ఆదేశాలు అంటే లెక్కలేని తనంగా ఉంటోంది. ప్రభుత్వ అధికారులు అంటే... బదిలీ చేసిన స్థానాలకు వెళ్లాలి. కానీ, తమకు లబ్ధి కలిగే పోస్టులను వదిలేందుకు వీరు నిరాకరిస్తున్నారు. ఎన్నికల బదిలీలను కూడా ఇదే తీరుగా బేఖాతరు చేస్తున్నారు. బదిలీ అయినవారు జిల్లాను వదిలితేనే ఆ స్థానాలు ఇతరులతో భర్తీచేసే అవకాశం ఉంది. ఎన్నికల నేపథ్యంలో బదిలీ అయిన అడిషనల్ జారుుంట్ కలెక్టర్, జిల్లాపరిషత్ సీఈవో, డీఆర్డీఏ పీడీ, ములుగు ఆర్డీవోలు వారి స్థానాలను వదిలేం దుకు ఇష్టపడడం లేదు. బదిలీ అయిన వారు కొత్త స్థానాల్లోకి వెళ్లకపోవడంతో కొత్తవారు రావడం లేదు. ఉన్నవారు పోస్టులను వదలకపోవడంతో... ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ నిర్వహిస్తున్న సమీక్షలకు అర్థంలేకుండా పోతోంది. ఏజేసీ వెళ్లలేదు... సంజీవయ్య 2010 జనవరి 4న తొలి అదనపు జాయింట్ కలెక్టర్‌గా జిల్లాకు వచ్చారు. అప్పటికే జిల్లాలో డ్వామా పీడీగా చేసిన అనుభవం, జిల్లా అధికారులతో సత్సం బంధాలు ఉండటంతో ఉత్సాహంగా విధుల్లో చేరారు. అడిషనల్ జేసీ పోస్టుకు అంతగా పోటీ లేకపోవడంతో జిల్లాలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నాలుగేళ్లు పూర్తిచేసుకున్నారు. జిల్లాలో పనిచేస్తున్న కాలంలో సుమారు 10 శాఖలకు పైగా ఇన్చార్జ్గా వ్యవహరించారు. డ్వామా పీడీ నుంచి జేసీ వరకు అన్ని హోదాల్లో పనిచేశారు. కీలకమైన మేడారం జాతర సమయంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా అవకాశం వచ్చింది. అంతా అనుకున్నట్లు జరుగుతోందనుకుంటున్న సమయంలో ఎన్నికల కారణంగా జిల్లాల్లో మూడేళ్లు నిండిన అధికారులకు బదిలీ అప్పనిసరి అయింది. ఏజేసీ సంజీవయ్యను ప్రభుత్వం నల్లగొండ జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా బదిలీ చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 10న ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ మొదట ఇచ్చిన గడువు ఈ నెల 22తో పూర్తయింది. తర్వాత దీన్ని ఈ నెల 25కు పొడిగించారు. మంగళవారంతో ఈ గడువు ముగుస్తోంది. ఏజేసీ సంజీవయ్య మాత్రం రిలీవ్ కావడం లేదు. నల్లగొండ డీఆర్వోగా వెళ్లేందుకు సుముఖంగాలేని సంజీవయ్య ఇతర పోస్టుల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడి నుంచి రిలీవ్ కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. డీఆర్డీఏ పీడీది కూడా అదేదారి.. ఏజేసీ దారిలోనే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ-ఐకేపీ) ప్రాజెక్టు డెరైక్టరు ఎస్.విజయ్‌గోపాల్ ఉన్నారు. విజయ్‌గోపాల్ గతంలో డీఆర్డీఏ ఏవోగా, డ్వామా పీడీగా, హౌసింగ్ ప్రత్యేక అధికారిగా పనిచేశారు. రెండేళ్ల కిత్రం జిల్లా డీఆర్డీఏ పీడీగా విధుల్లో చేరారు. ఎన్నికల నేపథ్యంలో విజయ్‌గోపాల్‌ను కరీంనగర్ జిల్లా డీఆర్డీఏ పీడీగా బదిలీ చేస్తూ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లా డీఆర్డీఏ పీడీగా కరీంనగర్లో పని చేస్తున్న శంకరయ్యను నియమించింది. వీరిద్దరు పరస్పర అంగీకారంతో ప్రయత్నాలు చేసుకుని బదిలీలు చేసుకున్నట్లు తెలిసింది. కోరుకున్న స్థానానికి బదిలీ చేసిన్పటికీ డీఆర్డీఏ పీడీ విజయగోపాల్ రిలీవ్ కావడం లేదు. మేడారం విధుల్లో పాల్గొంటున్న వారిని జాతర తరువాత రిలీవ్ చేసేందుకు ప్రత్యేక అనుమతి తీసుకున్న కలెక్టర్ ఈ నెల 16న ఆదివారం తహసీల్దార్లను రిలీవ్ చేశారు. విజయగోపాల్ మాత్రం గడువు దగ్గరపడినా రిలీవ్ కాలేదు. జేడ్పీ సీఈఓ ఆంజనేయులూ అంతే.. జిల్లా పరిషత్ సీఈవో జి.ఆంజనేయులు గతంలో ములుగు ఆర్డీవోగా పనిచేశారు. ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్నారు. ఖమ్మం జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పీడీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆంజనేయిలు రిలీవ్ కాలేదు.. అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఆంజనేయులు మరో నాలుగు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ కారణంతో ఆయన తన బదిలీ రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ ద్వారా ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్డీఓ మోతీలాల్ బదిలీ రద్దు... ములుగు ఆర్డీవో మోతీలాల్ది దాదాపు ఇలాంటి పరిస్థితే. ఫిబ్రవరి 10న జరిగిన బదిలీల్లో ములుగు ఆర్డీవో మోతీలాల్ ఉన్నారు. కరీంనగర్ జిల్లా పౌర సరఫరాల విజిలెన్స్ విభాగం అధికారి రాంచందర్‌ను ఈ పోస్టులో నియమించారు. రాంచందర్ విధుల్లో చేరేందుకు రెండు రోజులు కలెక్టరేట్‌కు వచ్చినా జిల్లా ఉన్నతాధికారులు చేర్చుకోలేదు. ఎన్నికల బదిలీ మోతీలాల్‌కు వర్తించదని, జిల్లాకు కొద్ది రోజుల కిత్రమే వచ్చారని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల సంఘానికి వివరించినట్లు తెలిసింది. మోతీలాల్ బదిలీకి రాజకీయ కారణం ఉన్నట్లు వినికిడి. మేడారం జాతర ఏర్పాట్ల విషయంలో మోతీలాల్ మంత్రులతో వాగ్వాదానికి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మంత్రులు ఈయన బదిలీకి పట్టుబట్టారు. చివరికి కలెక్టర్ జోక్యంతో బదిలీ ఆగిపోయింది. -
మేడారంపై గిరిజన శాఖ నిర్లక్ష్యం
సాక్షిప్రతినిధి, వరంగల్: గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విషయంలో గిరిజన సంక్షేమ శాఖ దారుణంగా వ్యవహరిస్తోంది. మేడారం పరిసరాల్లో మెరుగైన ఏర్పాట్లు చేసి జాతర గొప్పదనాన్ని అందరికీ తెలిసేలా చేయాల్సిన ఆ శాఖకు.. కనీసం సాధారణ పనులు చేసేందుకు చేతులు రావడం లేదు. మేడారం జాతర ఏర్పాట్లలో తన వంతుగా చేపట్టే పనులకు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) రూ.10 కోట్లతో ప్రణాళిక రూపొందించింది. కోటి మంది భక్తులు వచ్చే జాతరకు రూ.10 కోట్లు అంటే.. కచ్చితంగా మంజూరవుతాయని ఐటీడీఏ భావించింది. కానీ, ఐటీడీఏ కోరిన నిధుల్లో 50 శాతమే మంజూరయ్యే పరిస్థితి ఉందని గిరిజన శాఖ చెప్పి ప్రణాళిక ఖర్చును రూ.5.80 కోట్లకు తగ్గించింది. దీంట్లో రూ.4.99 కోట్లు రోడ్ల అభివృద్ధికి, రూ.1.56 కోట్లు తాగునీటి సరఫరా పనులకు కేటాయించింది. నిధులను తగ్గించిన ఆ శాఖ.. మంజూరు విషయంలోనూ దారుణంగా వ్యవహరిస్తోంది. జాతర దగ్గరపడుతున్నా ఇప్పటికి కేవలం రూ.1.42 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మేడారంలోని గిరిజన గురుకుల కళాశాల నుంచి వనం రోడ్డు వరకు 600 మీటర్ల బీటీ రోడ్డు వేసేందుకు రూ.42 లక్షలు, ఊరట్టం కాజ్వే నుంచి గ్రామానికి 800 మీటర్ల సీసీ రోడ్డుకు రూ.52 లక్షలు చొప్పున ప్రణాళికలో పెట్టారు. చిలుకలగుట్టకు వెళ్లే 800 మీటర్ల సీసీ రోడ్డు వెడల్పునకు రూ.48.50 లక్షలు, దొడ్ల నుంచి కొండాయి బ్రిడ్జి వరకు 1.5 కిలో మీటర్ల బీటీ రోడ్డుకు రూ.1.10 కోట్లు, ఆర్అం డ్బీ పరిధిలోని మేడారం నుంచి చిలుకలగుట్ట కు ఉన్న 1.50 కిలో మీటర్ల రోడ్డుకు రూ.1.20 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. అలా గే మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌజ్ మరమతులకు రూ.6 లక్షలు, కాటేజీకి రూ.4 లక్షలు, క్యాంప్ ఆఫీసుకు రూ.3 లక్షల వెచ్చించాలని నిర్ణయించారు. అరుుతే గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధుల రాకపోవడంతో ఈ పనులు ముందుకుసాగడంలేదు. మేడారం జాతరలో కీలకంగా వ్యవహరించే ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సర్పరాజ్ నెల రోజులుగా సెలవులో ఉ న్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ సంజీవ య్య ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగం అధికారి సైతం ప్రస్తుతం సెలవులోనే ఉన్నారు. పూర్తి స్థాయి అధికారులు లేకపోవడంతో ఐటీడీఏ పనుల పర్యవేక్షణ జరగడంలేదు.