ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్
బయటపడిన ఆస్తులు రూ.30 కోట్లకు పైనే?
హైదరాబాద్: ఏసీబీ అధికారుల వలకు మరో అవినీతి తిమింగళం చిక్కింది. గ్రేడ్ వన్ సబ్-రిజిస్ట్రార్ అధికారి ఇంటిపై ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు బయటపడ్డారుు. అధికారుల దాడుల్లో మరికొన్ని ఆస్తుల వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఏపీలోని విశాఖప ట్నం జిల్లా భీముని పట్నం సబ్- రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న బిల్లా సం జీవయ్య హైదరాబాద్ వనస్థ లిపురం విజయపురికాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఏపీ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ అధి కారులు సోమవారం సంజీ వయ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు.
సంజీవయ్యకు విజయపురి కాలనీలో ఇల్లు, సరూర్ నగర్‌లో భార్య జాయ్ కుమారి పేరున ఫ్లాట్, ప్రకాశం జిల్లా మార్టూర్‌లో ఒక ఇల్లు, హయత్‌నగర్, వనస్థలిపురం, మార్టూర్, సొంతూరు పెద్దఅంబడి పూడి (ఏపీ)లో మొత్తం 15 ఇళ్ల స్థలాలు, పెద్దఅంబడి పూడిలో తండ్రి, మేన ల్లుడి పేరున 16 ఎకరా లున్నట్లు గుర్తించారు. వనస్థలి పురం ఇంట్లో అరకిలో బంగారం, పావుకిలో వెండి, రూ. 2.50 లక్షల నగదు, బ్యాంకుల్లో రూ.12 లక్షలు, ఎఫ్‌డీలు రూ.8.50 లక్షలు, రూ.10.50 లక్షల విలు వైన ప్రామిసరీ నోట్లు, రూ.10 లక్షలు ఎల్‌ఐసీ పాలసీలు, పోస్టల్ డిఫాజిట్లు బయటపడ్డారుు. బ్యాంక్ లాకర్లు తెరవాల్సి ఉందని ఏసీబీ డిప్యూటీ డెరైక్టర్ కె.జగన్నాధరెడ్డి తెలిపారు. బయట పడిన ఆస్తులు డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం రూ.3 కోట్లు ఉండవచ్చని, మార్కెట్ వాల్యూ ప్రకారం రూ.30 కోట్లకు పైగానే ఉంటుందని అధికా రులు భావిస్తున్నారు. ఈ దాడుల్లో డీఎస్‌పీలు ఎస్‌వీవీ.ప్రసాద్‌రావు, షకీలాభాను, ఇన్‌స్పెక్టర్లు సతీష్, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.