నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని శివాలయం పక్కన ఉన్న కట్టెల వ్యాపారి సంజీవయ్య ఇంట్లో మంగళవారం వేకువజామున దొంగలుపడి రూ.4లక్షల విలువైన నగదు, నగలు చోరీ చేశారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని శివాలయం పక్కన ఉన్న కట్టెల వ్యాపారి సంజీవయ్య ఇంట్లో మంగళవారం వేకువజామున దొంగలుపడి రూ.4లక్షల విలువైన నగదు, నగలు చోరీ చేశారు. సంజీవయ్య కుటుంబసభ్యులతో ఇంటి ముందర నిద్రిస్తుండగా దొంగలు పడి బీరువా లాకర్ తెరిచి 1.5లక్షల రూపాయల నగదు, 2.5 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు దోచుకెళ్లారు. ఉదయం గమనించిన సంజీవయ్య పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలను సేకరించారు.