
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ కోరారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. మేడారాన్ని అతిపెద్ద గిరిజన జాతరగా అభివర్ణించారు. సంప్రదాయ బద్ధంగా జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.