వనజాతరకు ఆకాశయానం | Helicopter services for Medaram Sammakka Saralamma Jathara | Sakshi
Sakshi News home page

వనజాతరకు ఆకాశయానం

Published Sun, Jan 26 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

వనజాతరకు ఆకాశయానం

వనజాతరకు ఆకాశయానం

నాలుగేళ్ల తర్వాత మళ్లీ హెలికాప్టర్ సర్వీసు
 సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల సౌకర్యార్థం హెలికాప్టర్ సర్వీసులను అందించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నట్లు టర్బో ఏవియేషన్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ వి.ఉమేశ్ ప్రకటించారు. ఈ మేరకు శనివారం   కలెక్టర్ జి.కిషన్‌తో భేటీ అయ్యారు. మహాజాతర జరిగే ఫిబ్రవరి 12నుంచి 15వరకు హెలికాప్టర్ సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉమేశ్ చెప్పారు. మేడారంలో దేవతల గద్దెల సమీపంలో హెలిపాడ్ ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. ముందుగా సీట్లను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుందని.. ఇందుకు 9908765554, 9676999683 నంబర్లకు ఫోన్ చేయాలని  సూచించారు.
 
 చార్జీల వివరాలు
 ళీ    హైదరాబాద్ నుంచి మేడారానికి 1.15గంటల ప్రయాణం. ఒక్కరికి రానుపోను చార్జి రూ.40వేలు
 ళీ    వరంగల్ నుంచి రూ.18 వేలు
 ళీ    ములుగు నుంచి రూ.8వేలు
 ళీ    హెలికాప్టర్ అద్దెకు కావాలంటే ఐదుసీట్లకు రూ.90వేలు చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి సర్వీసు ఉంటుంది.
 అప్పట్లో రూ.6వేలు చార్జీ..
 2010లో వరంగల్‌లోని మామునూరు నుంచి  ఒక్కో వ్యక్తికి రానుపోను రూ.6వేలు తీసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement