సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణ శివారులోని రాయన్‌గూడెం వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై నలుగురు వ్యక్తులు టేకుమట్ల నుంచి సూర్యాపేట వైపు వెళుతుండగా ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న కల్యాణ్, మణి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఉమేష్, ఉపేందర్‌లను చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. మృతులు, క్షతగాత్రులు సూర్యాపేట పట్టణంలోని బర్లపెంటబజార్‌కు చెందినవారు.