అమ్మాయిప్రేమలో పడితే...? | Ammayi Premalo Padithe Telugu Movie Opening 2017 | Sakshi

అమ్మాయిప్రేమలో పడితే...?

Apr 30 2017 12:23 AM | Updated on Sep 5 2017 9:59 AM

అమ్మాయిప్రేమలో పడితే...?

అమ్మాయిప్రేమలో పడితే...?

యువత ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు? ప్రేమలో లేనప్పుడు ఎలా ఉంటారు? అనే కథతో దర్శకుడు మణి రూపొందించనున్న సినిమా ‘అమ్మాయి ప్రేమలో పడితే’.

యువత ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు? ప్రేమలో లేనప్పుడు ఎలా ఉంటారు? అనే కథతో దర్శకుడు మణి రూపొందించనున్న సినిమా ‘అమ్మాయి ప్రేమలో పడితే’. మణి, షాను జంటగా బి. రమేశ్, హర్షవర్థన్‌ నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్‌ దామోదరప్రసాద్‌ కెమేరా స్విచ్ఛాన్‌ చేయగా, దర్శకుడు వీరశంకర్‌ క్లాప్‌ ఇచ్చారు. మే నెలలో అరకు లోయలో చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ‘‘స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుంది? అనేది చిత్రకథ. సంగీత ప్రధానమైన చిత్రమిది. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి’’ అన్నారు మణి. చిత్ర సంగీత దర్శకుడు భానుప్రసాద్, కథానాయిక షాను, రచయిత బండోజి, కెమేరామెన్‌ ఫణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement