Ammayi Premalo Padithe
-
ప్రేమలో పడితే..!
మణీందర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘అమ్మాయి ప్రేమలో పడితే’. ఈ చిత్రంలో సోనాక్షీ వర్మ కథానాయికగా నటించారు. ఎ.ఎస్.ఎం.ఆర్ సమర్పణలో అరిగెల ప్రొడక్షన్స్ పతాకంపై హర్ష వర్థన్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ‘‘స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం ఇది. మంచి లవ్ అండ్ ఎమోషన్ ఎలిమెంట్స్‌తో రూపొందించాం. త్వరలో ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం’’ అన్నారు మణీందర్. ఈ సినిమాకు చిన్ని కృష్ణ సంగీతం అందించారు. -
అమ్మాయిప్రేమలో పడితే...?
యువత ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు? ప్రేమలో లేనప్పుడు ఎలా ఉంటారు? అనే కథతో దర్శకుడు మణి రూపొందించనున్న సినిమా ‘అమ్మాయి ప్రేమలో పడితే’. మణి, షాను జంటగా బి. రమేశ్, హర్షవర్థన్ నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్ కెమేరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. మే నెలలో అరకు లోయలో చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ‘‘స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుంది? అనేది చిత్రకథ. సంగీత ప్రధానమైన చిత్రమిది. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి’’ అన్నారు మణి. చిత్ర సంగీత దర్శకుడు భానుప్రసాద్, కథానాయిక షాను, రచయిత బండోజి, కెమేరామెన్ ఫణి తదితరులు పాల్గొన్నారు.