మణీందర్, సోనాక్షీ వర్మ
మణీందర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘అమ్మాయి ప్రేమలో పడితే’. ఈ చిత్రంలో సోనాక్షీ వర్మ కథానాయికగా నటించారు. ఎ.ఎస్.ఎం.ఆర్ సమర్పణలో అరిగెల ప్రొడక్షన్స్ పతాకంపై హర్ష వర్థన్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ‘‘స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం ఇది. మంచి లవ్ అండ్ ఎమోషన్ ఎలిమెంట్స్‌తో రూపొందించాం. త్వరలో ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం’’ అన్నారు మణీందర్. ఈ సినిమాకు చిన్ని కృష్ణ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment