మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం "మిస్టర్ ఇడియట్". ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్ఎల్‌పీ పతాకంపై జెజేఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారు
తాజాగా ఈ మూవీ నుంచి కాంతార అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సాంగ్‌ను రాహుల్ సిప్లిగంజ్ పాడగా.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఇప్పటికే మిస్టర్ ఇడియట్ ట్రైలర్ విడుదల కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment