
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మరోసారి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో టెక్నాలజీ పేరుతో పోలవరం అంచనాలు పెంచారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్ అంచనాల పెంపుపై విచారణ జరగాలని ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు. ‘2013లో ఎంత రీహాబిలిటేషన్ అవుతుందని చెప్పారో.. 2015కల్లా దాని అంచనా పెరిగిపోయింది. దానిపై విచారణ జరగాలి. గతంలోనే నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేశాం’ అని అన్నారు.
‘పోలవరం ప్రాజెక్ట్ డీపీఆర్ 1,2 లకు సంబంధించి ఎంత అంచనాలు ఇస్తారో అవి వందకు వంద శాతం చేస్తామని గతంలో ఉమా భారతి, నితిన్ గడ్కరీ, నేటి జల వనరుల శాఖ మంత్రి వరకు హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రం భరిస్తుంది. పోలవరంపై వస్తున్న వాదనలన్ని ఊహాగానాలే. కేంద్రం పూర్తి వంద శాతం నిధులతో పోలవరాన్ని పూర్తి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరంపై గత ప్రభుత్వ అంశాలపై కూడా శ్వేత పత్రం విడుదల చేయాలి. పారదర్శకంగా పోలవరం పనులు జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి’ అని ఎమ్మెల్సీ మాధవ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment