నెట్టికంటుడి సేవలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ | north andhra mlc in kasapuram | Sakshi
Sakshi News home page

నెట్టికంటుడి సేవలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ

Published Thu, Jun 29 2017 10:16 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

north andhra mlc in kasapuram

గుంతకల్లు రూరల్‌ : బీజేపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్‌ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. బీజేపీ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంతకల్లుకు విచ్చేసిన ఆయన గురువారం నేరుగా కసాపురం చేరుకున్నారు. ఆలయ అధికారులు, ఇతర అర్చక బృందం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను, స్వామివారి పట్టువస్త్రాలను అందజేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి, కసాపురం ఆలయ ట్రస్టు బోర్డు సభ్యురాలు వనగొంది విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement