
సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాము తలుచుకుంటే చంద్రబాబు వెన్నుపోటు గురించి చాలానే మాట్లాడగలమన్నారు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యుడు ఎవరైనా పీఎంవోకు వెళ్లొచ్చని తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబు గమనించాలన్నారు.
అభివృద్ధి ధ్యేయంగా కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకుందని, ఏపీకి ఏం చేశామె అమిత్ షా సవివరంగా చెప్పారని మాధవ్ గుర్తుచేశారు. తామెప్పుడు రాజకీయ లబ్ధి చూసుకోలేదన్నారు. ఇంతవరకు నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలు ఇవ్వలేదని, స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు రాష్ట్రం ఎందుకు ఒప్పుకోలేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment