పోలవరం ప్రాజెక్టు పనులు, పీఎంవో వ్యవహారాలపై ఏపీ శాసనమండలిలో సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ప్రాజెక్టు పునరావాస బాధ్యతలు ఏపీ తీసుకుంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎలా అన్నారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పోలవరంపై కుట్ర జరుగుతందని, తాను రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే కొందరు తనపై యుద్ధం చేస్తామంటున్నారని తెలిపారు. కొందరు తనను బోనులో నిలబెడతామంటున్నారని, కానీ తాను ఎక్కడా టెక్నికల్‌గా.. లీగల్‌గా తప్పు చేయలేదనని చంద్రబాబు చెప్పారు.