హీరోగా రవితేజ వారసుడి ఎంట్రీ.. ట్రైలర్ వచ్చేసింది! | Tollywood Movie Mr Idiot Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

Mr Idiot Trailer: రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ట్రైలర్ చూశారా?

Published Sun, Sep 29 2024 6:32 PM | Last Updated on Sun, Sep 29 2024 6:32 PM

Tollywood Movie Mr Idiot Official Trailer Out Now

మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన తమ్ముడు రఘు తనయుడు మాధవ్‌ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం 'మిస్టర్‌ ఇడియట్‌'. ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గౌరీ రోణంకి డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై రవిచంద్ నిర్మిస్తున్నారు.  తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో హనుమాన్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ పాల్గొన్నారు.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..' రవితేజ ఇండస్ట్రీలో నాలాంటి వారిని ఎంతోమందిని సపోర్ట్ చేశారు. ఈ ఫంక్షన్‌కు పిలిచినప్పుడు మాధవ్‌కు సపోర్ట్ చేయడం నా బాధ్యతగా భావించి వచ్చా. టైటిల్ మిస్టర్ ఇడియట్ అని చెప్పగానే నాకు ఇడియట్ సినిమా చూసిన రోజులు గుర్తొచ్చాయి. నేను కూడా చంటిగాడిలా ఫీలయ్యేవాడిని. ఆ సినిమాలో హీరోయిజం కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. రవితేజ స్థాయికి మాధవ్ చేరుకోవాలని కోరుకుంటున్నా. మిస్టర్ ఇడియ‌ట్‌ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా' అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement